దేశంలో కరోనా వ్యాక్సిన్ జర్నీపై హిస్టరీ TV18 స్పెషల్ డాక్యుమెంటరీ 'ద వయల్' మనకు తెలియని అనేక విషయాలను మన ముందుకు తీసుకొచ్చింది. మహమ్మారిపై దేశం సాధించిన విజయం గురించి ప్రధాని మోదీ వివరంగా మాట్లాడిన మొదటి డాక్యుమెంటరీ ఇది. ప్రపంచంలో కరోనా వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో మోదీ ఏం ఆలోచించారో ఈ డాక్యుమెంటరీలో చెప్పారు. అన్ని దేశాలకు వ్యాపిస్తున్న వైరస్ మన దేశానికి రాదని భావించడం మూర్ఖత్వమే అవుతుందని స్టార్టింగ్‌లో థింగ్ చేసినట్లు మోదీ చెప్పుకొచ్చారు. మొదట్లో భారత్ ఈ వైరస్ బారి నుంచి బయటపడిన మాట వాస్తవమేనని, కానీ నేడు ప్రపంచం చాలా చిన్నదని, పరస్పర సంబంధం ఉన్నదని.. ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నామన్నారు. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకే పరిమితమవుతుందని, భారత్‌ను ఎప్పుడూ టచ్ చేయదని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని భావించినట్లు మోదీ చెప్పారు. 'మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం మిమ్మల్ని మీరు రక్షించుకోవడం. జాన్ హై తో జహాన్ హై'. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించగలిగానన్నారు మోదీ. దేశంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని.. సప్లై చైన్ దెబ్బతింటాయని తెలిసినా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించారని ప్రధాని అంగీకరించారు.
ఆ విషయం ప్రపంచానికి షాక్‌కు గురి చేసింది:
140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 2020 మార్చి, 22న జనతా కర్ఫ్యూ, ఆ తెల్లారి నుండి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనాకు కట్టడి ఏదంటే గడప దాటి మృత్యు కిరీటాన్ని మనం ముద్దాడకపోవడమే. ఇదే విషయాన్న ప్రధాని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.. ప్రపంచంలో రెండో అతి పెద్ద జనాభా ఉన్న ఇండియాలో అన్ని రోజులు పాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధించడం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించిందన్నారు మోదీ.
ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను:
నిజానికి అమెరికా జనాభా మన కంటే నాలుగు రెట్లు తక్కువ.. కానీ అక్కడ కరోనా సృష్టించిన విధ్వంసం, విషాదం ఇండియా చవిచూడలేదు.. కరోనా ప్రారంభమైన మొదట్లో అందరూ ఇండియానే అన్నిటికంటే ఎఫెక్ట్ అవుతుందనుకున్నారు. మునుపెన్నడూ చూడని వినాశన భయాలు అటు ప్రజలను, ఇటు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి.. అయితే ప్రధాని మోదీ మాత్రం తన మార్క్ స్టైల్‌లో తన పని తాను చేసుకువెళ్లారు. "మాకు అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలు సాధారణ పరిస్థితి కోసం ఉన్నాయి. కానీ దేశం మొత్తం మహమ్మారితో పోరాడుతున్న పరిస్థితిలో, వనరులు తక్కువగా ఉంటాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని డిమాండ్, సప్లయ్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఎంత డబ్బు, బడ్జెట్ అవసరమో దాన్ని వినియోగించాలని నిర్ణయించాం' అని మోదీ 'ద వయల్ డాక్యుమెంటరీలో తన మనసులో మాటలను బయటపెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Narendra modi