కరోనా కత్తిని తునాతునకలు చేయ్యాలంటే ఏం చేయాలి..? ఎవరి సాయం కావాలి..? ఎవరు త్యాగాలు చేయాలి..? ప్రజల సంగతి సరే.. మరి వైరస్‌కు విరుగుడు సంగతేంటి..? ఈ విషయాలన్నిటీతో పాటు దేశంలో వ్యాక్సిన్ జర్నీపై ‘హిస్టరీ TV18’ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ద వయల్’ (The Vial) టెలిక్యాస్ట్ అయ్యింది. హిస్టరీ TV18లో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ కీలక విషయాలను వెల్లడించారు.. వ్యాక్సిన్ జర్నీలో సైంటిస్టుల కృషిని అభినందించారు.
కరోనా ఎవర్నీ వదిలిపెట్టలేదు:
పేదవారికి మాత్రమే సోకలేదు.. ప్రపంచంలో... మనుషుల ఆనవాళ్లున్న అన్ని దేశాల్లోనూ వ్యాపించింది.. రాజులు, రాణులు, ప్రధానులు, పేద, ధనిక తేడా లేకుండా అందిరినీ అల్లుకుంది కరోనా! ‘హిస్టరీ TV18’ రూపొందించిన 'ద వయల్‌లో ప్రధాని మోదీ మాటలు ఇదే అర్థం వచ్చేలా ఉన్నాయి.. చదువుకున్న వాళ్లు, చదువులేని వాళ్లు అన్న విషయం కరోనాకు తెలియదని.. మన ధైర్యంతో ఉండటమే మనం చేయాల్సిన పని అని ప్రధాని మోదీ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డ విషయం వాస్తవమేనని.. అయితే అది తప్ప ఆ సమయంలో వేరే మార్గం కనిపించలేదన్నారు. కరోనాకు అడ్డుకట్ట వేయ్యాలంటే ప్రజల సహాకరం అవసరమని.. లాక్‌డౌన్‌కు అందరూ సహకరించారన్నారు. డమాండ్ సప్లై హ్యాండ్ టు హ్యాండ్ ఉండాలన్నారు మోదీ.
ప్రపంచమంతా అలా.. మనం ఇలా..:
వ్యాక్సిన్ త్వరగా తయారు చేయాల్సిన విషయాన్ని టీకా కంపెనీలు గుర్తించాయని.. అనుకున్నదాని కంటే వేగంగా మార్కెట్‌లోకి వ్యాక్సిన్లు వచ్చామన్నారు మోదీ.. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్నారు. డాక్టర్లకు, అధికారులకు మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాతే రంగంలోకి దిగారన్నారు. పకడ్భంది ప్రణాళికలతో ముందుకు వెళ్లారన్నారు. ఇక 2021 జనవరి 16 వ్యాక్సినేషన్ మొదలయ్యాక.. కోవిన్ పోర్ట్‌ల్ టెక్నాలజీ ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. టైమ్ టు టైమ్ అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు.. వ్యాక్సినేషన్ సెంటర్లు, రెండో టీకా డోసు లాంటి సమాచారాన్ని అందించడంలో టెక్నాలజీని ఉపయోగించుకున్నామన్నారు మోదీ. నిజానికి వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచానికే కోవిన్ పోర్టల్ రోల్‌మోడల్‌గా నిలిచింది. ఈ విషయాలను ప్రస్థావిస్తూ.. 'ద వయల్' డాక్యుమెంటరీ వ్యాక్సిన్ జర్నీని ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
భవిష్యత్ తరాలు మరిచిపోవు:
వ్యాక్సిన్ విషయంలో భారత్ పాత్రను యావత్ మానవాళి గుర్తుపెట్టుకుంటుందన్నారు మోదీ. మరో 50ఏళ్ల తర్వాత చరిత్రను తిరిగి చూస్తే మన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంత గొప్పదో అప్పటి తరాలకు తెలుస్తుందన్నారు. హ్యూమన్ సర్వీస్ హిస్టరీలో మన వైద్యులు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఇంత పెద్ద దేశంలో టైమకి వ్యాక్సిన్ ఇచ్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మన దేశ డాక్టర్లపై తనకు పూర్తి నమ్మకముందని.. ఎవరి మీద ఆధారపడకుండా వ్యాక్సిన్ జర్నీ సక్సెస్ అయ్యిందన్నారు. మన వ్యాక్సిన్‌లపై ఎలాంటి నెగివిటివీ లేదని.. ప్రజలు పూర్తి నమ్మకంతో వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు మోదీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.