హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

The Vial: మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ ఎలా చేరుకుంది? కాలినడకన కొండల్లో, గుట్టల్లో నడచిన హెల్త్‌ లైన్ వర్కర్లు

The Vial: మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ ఎలా చేరుకుంది? కాలినడకన కొండల్లో, గుట్టల్లో నడచిన హెల్త్‌ లైన్ వర్కర్లు

అదర్ పూనావాలా, కృష్ణ ఎల్లా (image credit History TV18)

అదర్ పూనావాలా, కృష్ణ ఎల్లా (image credit History TV18)

చింపాంజీల‌లో కనిపించే కామ‌న్ కోల్డ్ వైర‌స్ బ‌ల‌హీన‌ప‌రిచిన వెర్ష‌న్‌ను కొవిషీల్డ్ అభివృద్ధిలో ఉప‌యోగించారు. ఇందులో క‌రోనా వైర‌స్ స్పైక్ ప్రొటీన్‌ కు సంబంధించిన జ‌న్యు ప‌దార్థాన్ని వినియోగించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ల కోసం పరితపిస్తున్న సమయంలో ఇండియా ఏకంగా రెండు టీకాలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయడం ఇప్పటికీ అందిరికి గుర్తిండే ఉంటుంది.. దేశంలో కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడిన వాటిలో వ్యాక్సిన్‌ అన్నిటికంటే ముందుంటుంది.. ఇది విషయాలను వివరిస్తూ.. ఇండియన్ కోవిడ్ వ్యాక్సిన్ జర్నీపై ‘హిస్టరీ TV18’ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ద వయల్’ (The Vial) టెలిక్యాస్ట్ అయ్యింది.60 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ సహా భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నారాయణ హృదయాలయ డాక్టర్ దేవి శెట్టి, డాక్టర్ అభిరమ్‌, డాక్టర్‌ బలారామ్‌ భార్గవా తదితరులు ఈ డాక్యుమెంటరీలో వ్యాక్సిన్ జర్నీపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా దేశంలో తొలి రెండు వ్యాక్సిన్‌లైన కొవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాల తయారీపై 'ద వయల్' ప్రత్యేకంగా ఫోకస్‌ చేసింది

వ్యాక్సిన్ తయారీలో భారత్ రికార్డులు:

కరోనా వ్యాప్తి మొదలైన ఏడాది లోపే మార్కెట్‌లోకి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ల పంపిణీ జరగడం అప్పట్లో ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచింది. వ్యాక్సిన్‌ తయారీలో మన గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పిన విషయమిది.. ఇదే విషయాన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా 'ద వయల్‌' డాక్యుమెంటరీలో ప్రస్తావించారు. దేశంలో వైరస్‌ వ్యాప్తి మొదలైన ఏడాదిలోపే వ్యాక్సిన్ తీసుకొచ్చామని.. ఇది ప్రపంచ రికార్డేనన్నారు. 2021 జనవరిలో తమ వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ తొలి టీకా పడిందన్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యాక్సిన్ తయారీ కేవలం డబ్బుల పరంగా రిస్క్‌ మాత్రమే కాదు అని.. ప్రజలపై తమకున్న బాధ్యత కూడా అన్నారు పూనావాలా. నిజానికి పోలియా అవుట్ బ్రేక్ తర్వాత 23ఏళ్లకు వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులోకి వస్తే కరోనా టీకా మాత్రం వైరస్‌ వ్యాప్తి మొదలైన ఏడాదికే వచ్చింది. ఇక భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా వ్యాక్సిన్ జర్నీలో తన అనుభవాలను పంచుకున్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి టీకా ఇవ్వడం వేరు.. ఏదైనా ఆరోగ్య సమస్యతో ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం వేరన్నారు. మోదీ నాయకత్వం వల్లే ఇండియాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా మొదలైందన్నారు.

మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ ఎలా చేరుకుంది?

మిజోరంలోని ఒక చిన్న గ్రామానికి వ్యాక్సిన్లు ఎలా చేరాయో ఈ డాక్యుమెంటరీలో వివరించారు. నూన్సూరి గ్రామానికి చేరుకోవడానికి, టీకాలు తయారైన పూణే నుంచి 1,500 కిలోమీటర్ల జర్నీ మొదలైందని.. మొదట కోల్‌కతా నిల్వ కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి ఐజ్వాల్‌కు తరలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శాస్త్రవేత్త డాక్టర్ సుమిత్ అగర్వాల్ తెలిపారు. ఆ తర్వాత ట్రక్కు ద్వారా లుంగ్లీ వరకు, కారులో త్లాబంగ్ వరకు, చివరకు పడవ ద్వారా నున్సూరీ వరకు ప్రయాణం కొనసాగింది. అయితే అక్కడితో ఆగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఒక్క గ్రామస్థుడు కూడా మిస్‌ అవ్వకుండా చూసేందుకు హెల్త్‌కేర్‌ వర్కర్లు, వ్యాక్సినేటర్లు కాలినడకన బయలుదేరారు. దేశం నుంచి వైరస్‌ను తరిమికొట్టాలనే స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కూడా తెలివైన పరిష్కారాలకు దారితీసింది. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్‌లోని మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్లను డ్రోన్ ద్వారా ఈ మారుమూల ప్రాంతాలకు డెలివరీ చేయగలిగితే.. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పంపిణీ చేయవచ్చనేది కేంద్ర ఆలోచన.

వ్యాక్సిన్‌ను పెద్ద దిక్కు ఇండియా:

ప్రపంచానికే ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు అందిస్తున్న దేశంగా భారత్‌ నిలుస్తోంది.. ప్రపంచంలో 62శాతం వ్యాక్సిన్లు ఇండియాలోనే తయారవుతున్నాయని.. మార్చి 2021 నాటికే ప్రపంచంలోని 71దేశాలకు ఇండియా కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసిందన్నారు పబ్లిక్‌ పాలసీ ఎక్స్‌పర్ట్‌ షమికా రవి. అంటే వ్యాక్సిన్ మన మార్కెట్‌లోకి వచ్చిన మూడు నెలల్లోనే 71దేశాలకు 6కోట్ల డోసులు పంపిణీ చేశామన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు, ప్రముఖులు మోదీ థ్యాంక్స్‌ చెప్పిన క్లిప్స్‌ను 'ద వయల్' డాక్యుమెంటరీలో చూపించింది.. అందులో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్ కూడా ఉన్నాడు. ఇండియాలో వ్యాక్సినేషన్‌ వేగంపై బిల్‌గేట్స్‌ మెచ్చుకున్న వ్యాఖ్యలను చూపించింది డాక్యుమెంటరీ.. ధనిక దేశాలకు కూడా సాధ్యం కానీ విధంగా భారత్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్ చేపట్టింది.

వ్యాక్సిన్ జర్నీ:

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా సంస్థ.. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది‌. అటు కొవాగ్జిన్ టీకాను ఇండియాలోనే అభివృద్ధి చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌.. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌, నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీల‌తో క‌లిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. చింపాంజీల‌లో కనిపించే కామ‌న్ కోల్డ్ వైర‌స్ బ‌ల‌హీన‌ప‌రిచిన వెర్ష‌న్‌ను కొవిషీల్డ్ అభివృద్ధిలో ఉప‌యోగించారు. ఇందులో క‌రోనా వైర‌స్ స్పైక్ ప్రొటీన్‌ కు సంబంధించిన జ‌న్యు ప‌దార్థాన్ని వినియోగించారు. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత స్పైక్ ప్రొటీన్ ఉత్ప‌త్త‌యి, వైర‌స్‌పై దాడి చేసేలా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప్రేరేపిస్తుంది. ఇక కొవాగ్జిన్ అనేది ఒక ఇన్ ‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌.

First published:

ఉత్తమ కథలు