హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

The Vial: కోట్ల మందిని కాపాడిన ఆయుధం! అది లేకపోతే.. అన్న మాటే భయమేస్తుంది

The Vial: కోట్ల మందిని కాపాడిన ఆయుధం! అది లేకపోతే.. అన్న మాటే భయమేస్తుంది

‘ద వయల్’ హిస్టరీ TV18 డాక్యుమెంటరీ

‘ద వయల్’ హిస్టరీ TV18 డాక్యుమెంటరీ

ఎవడికో జలుబు చేస్తే ఇంకెవ్వడో తుమ్మినట్లు... ఎవడో ఏదో తింటే.. మిగిలివాళ్లు చేతులు కడుక్కోవాల్సి వచ్చినట్లు.. కరోనా దెబ్బకు భారత్‌ ఎలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించిందో.. మహమ్మారి ముప్పు నుంచి ఎలా బయటపడిందో.. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ జర్నీపై హిస్టరీ TV18 స్పెషల్ డాక్యుమెంటరీ 'ద వయల్‌' చక్కగా వివరించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎటు చూసినా హాహాకారాలు.. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు...ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు.. దేశమంతా ఇదే దుస్థితి..! మన పక్కనే ఉన్న చైనాలో మొదలై.. ప్రపంచదేశాలకు విహరించి.. గల్లీ గల్లీకి వ్యాపించి.. అగ్రరాజ్యలో అలజడి రేపిన కరోనా దెబ్బకు మన దేశమూ విలవిలలాడింది.. అందులో 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో అసలు కరోనా దాటికి ప్రాణాలు పిట్టల్లా రాలిపోతాయని అంతా భావించారు.. కరోనా వ్యాప్తి మొదలైన తొలిరోజుల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఇవే భయాలు.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణమొక యుగంలా గడిపిన రోజులు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి! కరోనాకు విరుగుడేంటి..? కరోనాను కట్టడి చేసే ఆయుధమేంటి..? కరోనాతో కలిసి జీవించాల్సిన విషయం అప్పటికే అర్థమైపోయిన ప్రజలను ఈ ప్రశ్నలే వేధించాయి.. అయితే ఎప్పుడైనా సరే సంక్షోభాలే కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు కారణమవుతాయి.. చరిత్రపొడుగునా అదే జరిగింది.. కరోనా వ్యాక్సిన్ వేగంగా దూసుకొచ్చింది. వైరస్‌ వ్యాప్తి మొదలైన ఏడాది లోపే ఇండియా అద్భుతం సృష్టించింది.

వ్యాక్సిన్‌ జర్నీ:

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ జర్నీపై హిస్టరీ TV18 స్పెషల్ డాక్యుమెంటరీ రూపొందించింది. ‘ద వయల్’(The Vial) పేరుతో హిస్టరీ TV18లో ఇది టెలిక్యాస్ట్ అయ్యింది. 63 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ దేశాన్ని కరోనా వ్యాక్సిన్‌ కాపాడిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.. ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ సాధించిన విజయాలను ఈ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నారాయణ హృదయాలయ డాక్టర్ దేవి శెట్టి తదితరులు ఈ డాక్యుమెంటరీలో వ్యాక్సిన్ జర్నీపై తమ అనుభవాలను పంచుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా సృష్టించిన రికార్డులు.. కొవిన్‌ పొర్టల్‌ విశేషాలు, ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించిన తీరు, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ కంపెనీలకు ఇచ్చిన ప్రోత్సాహం లాంటి విషయాలను 'ద వయల్‌' డాక్యుమెంటరీలో చక్కగా వివరించారు.

వ్యాక్సినేషన్‌లో ప్రపంచానికే రోల్‌ మోడల్‌గా నిలిచిన ఇండియా:

140 కోట్ల జనాభా.. అంటుకుంటేనే అల్లుకుపోయే విలక్షణమైన వైరస్‌.. ఉత్సవాలు, ఊరేగింపులు, పార్టీలు, పబ్బులు, భజనలు, జాతరలు.. ఎక్కడ చూసినా ఏదో ఒక మీటింగ్‌లతో నిండిపోయిన దేశం మనది.. అలాంటి దేశంపై కంటికి కనపడని ఓ మహమ్మారి దాడి చేస్తే.. దానికి పర్యావసనాలు ఎలా ఉంటాయో ఊహించకుంటూనే భయం వేయక మానదు.. అయితే వ్యాక్సిన్‌ రాకతో ఇండియా చాలా వరకు సేవ్ అయ్యింది.. భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ సంస్థల కృషితో కరోనా వ్యాక్సిన్‌ వేగంగా మార్కెట్‌లోకి వచ్చింది.. 2021, జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని 'ద వయల్‌' క్లియర్‌కట్‌గా చూపించింది.

వ్యాక్సినేషన్‌ రికార్డుల రారాజు భారత్:

ప్రపంచంలోనే రెండో అదిపెద్ద జనాభా కలిగిన భారత్‌లో ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయడం చిన్న విషయం కాదు.. దీని వెనక ఎంతో మంది తిండీ, తిప్పలు మానేసి కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్‌ విషయంలో హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ పడ్డ కష్టాన్ని 'ద వయల్‌'లో ప్రత్యేకంగా ప్రస్థావించారు.. వారి త్యాగాలను, కుటుంబాలకు దూరమైన వారి బాధను చూపించారు.. వాళ్లకి ఒక కుటుంబం ఉంటుందని.. అయితే ప్రజల కోసం చాలా కాలం అన్నీ వదిలేసి సేవ చేసినట్లు డాక్ముమెంటరీలో చూపించారు..ఇక వ్యాక్సినేషన్‌లో ఇండియా రికార్డులను ప్రత్యేకంగా గ్లోరిఫై చేశారు.2021, సెప్టెంబర్‌ 17.. ప్రధాని మోదీకి బర్త్ డే గిఫ్ట్‌గా ఒక్కరోజే 2.5 కోట్ల టీకాలు పంపీణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.. మరే దేశంలోనూ ఒక్క రోజులో ఇన్ని డోసులను పంపిణీ చేయలేదు.. అగ్రరాజ్యంగా ప్రపంచం భావించే అమెరికాకు సాధ్యంకాని రికార్డులను వ్యాక్సినేషన్‌లో ఇండియా సృష్టించింది.. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ వ్యాక్సినేషన్‌లో ప్రపంచానికే రోల్‌మోడల్‌గా భారత్‌ నిలిచిందని 'ద వయల్‌' కొనియాడింది.

First published:

Tags: Corona Vaccine, Manoj bajpayee, Narendra modi

ఉత్తమ కథలు