హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Babia: శాఖాహార మొసలి 'బాబియా' ఇక లేదు..70 ఏళ్లుగా ప్రసాదం తింటూనే బతికిన 'బాబియా'

Babia: శాఖాహార మొసలి 'బాబియా' ఇక లేదు..70 ఏళ్లుగా ప్రసాదం తింటూనే బతికిన 'బాబియా'

మొసలి అనగానే మనం ఆమడ దూరంలో ఉంటాం. ఎందుకంటే అది ప్రాణాలు తీసే క్రూర జంతువు. కానీ కేరళలోని ఓ మొసలి శాఖాహారి అంట. అంతేకాదు అది  చిన్న చిన్న చేపలను కూడా తినేది కాదట.

మొసలి అనగానే మనం ఆమడ దూరంలో ఉంటాం. ఎందుకంటే అది ప్రాణాలు తీసే క్రూర జంతువు. కానీ కేరళలోని ఓ మొసలి శాఖాహారి అంట. అంతేకాదు అది  చిన్న చిన్న చేపలను కూడా తినేది కాదట.

మొసలి అనగానే మనం ఆమడ దూరంలో ఉంటాం. ఎందుకంటే అది ప్రాణాలు తీసే క్రూర జంతువు. కానీ కేరళలోని ఓ మొసలి శాఖాహారి అంట. అంతేకాదు అది  చిన్న చిన్న చేపలను కూడా తినేది కాదట.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

మొసలి అనగానే మనం ఆమడ దూరంలో ఉంటాం. ఎందుకంటే అది ప్రాణాలు తీసే క్రూర జంతువు. కానీ కేరళలోని ఓ మొసలి శాఖాహారి అంట. అంతేకాదు అది  చిన్న చిన్న చేపలను కూడా తినేది కాదట. అది ఆహారంగా కేవలం అన్నం మాత్రమే తినేది. ఈ అరుదైన శాకాహార మొసలి పేరు బాబియా. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనంతపద్మస్వామి కోనేరులో ఉంటుంది. ఇది భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. 70 ఏళ్లుగా సరస్సులో జీవించిన మొసలి తాజాగా మరణించింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు.

ప్రత్యేకత ఏంటంటే?

ఈ మొసలి శాఖాహారి కావడం విశేషం. ఆలయ సరస్సులో ఉంటూ ప్రసాదాన్ని ఇష్టంగా తినేదని, అలాగే భక్తులు ఎటువంటి భయం లేకుండా మొసలికి ఇష్టంతో అన్నం తినిపించేవారని చెప్పుకొచ్చారు. శాఖాహార ప్రసాదాన్ని అతి ఇష్టంగా తినేదని, అందులో అన్నం, బెల్లం ఉండేవని వారు తెలిపారు. ఇది ప్రసాదాన్ని రోజుకు రెండు సార్లు తినేదని తెలిపారు. అయితే అనంత పద్మనాభ స్వామి ఆలయ చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనేది మాత్రం ఎవరికీ తెలియదు. అంతేకాదు దానికి బాబియా అనే పేరు కూడా ఎవరు పెట్టారో తెలియదని స్థానికులు, ఆలయ పూజారులు చెబుతున్నారు. అది ఏనాడు ఎవరితోనూ క్రూరంగా ప్రవర్తించలేదని ఆలయ పూజారి వెల్లడించారు.

కాగా ఆదివారం రాత్రి మొసలి సరస్సులో తేలియాడుతూ కనిపించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు ఆలయ అధికారులు తెలిపారు. ఇక బాబియాను కడసారి చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకుంటున్నారు.. భక్తుల రాకతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సందర్శనార్ధం మొసలిని ఆలయ పరిసరాల్లో ఉంచారు. నేడు ముసలి అంత్యక్రియలు జరగనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయానికి కాపలా ఈ మొసలిని దేవుడే పంపించాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని ఆలయ పూజారి తెలిపారు.

ఒకప్పుడు బిల్వమంగళం అనే భక్తుడు భీకర తప్పస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణువు బాలుడిగా శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమిచ్చాడు. అయితే ఆ బాలుడిని దేవుడిగా గుర్తించలేకపోయారు ఆ భక్తుడు. ఇలా ఒకరోజు ఆ బాలుడిపై బిల్వమంగళం కోపం తెచ్చుకున్నాడు. దీనితో అలిగిన బాలుడు రూపంలో వున్న శ్రీకృష్ణ భగవానుడు ఒక గుహలోకి వెళ్ళాడు. ఇక అతడిని వెతుక్కుంటూ బిల్వమంగళం గుహలోకి వెళ్లాడు. అలా వెతుకుతూ బయటకు వస్తున్న బిల్వమంగళంకు పద్మనాభస్వామి విగ్రహం కనిపించింది. అప్పటి నుంచి గుహకు రెండు వైపులా తిరువనంతపురం, అనంతపురం అనే పేరు వచ్చింది.

First published:

Tags: Kerala

ఉత్తమ కథలు