THE USE OF MASKS HUNDREDS OF YEARS BEFORE CORONA KOLKATA DOCTOR WHO EXPLAINED ABOUT THE PREPARATION AND NECESSITY OF THESE GH VB
Kolkata Doctor: కరోనాకు వందేళ్ల ముందే మాస్కుల వాడకం.. వీటి తయారీ, అవసరం గురించి వివరించిన కోల్‌కతా వైద్యుడు..!
కోల్ కత్తా వైద్యుడు
కరోనా వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా మాస్కులు వినియోగించడం ప్రారంభమైంది. అంతకుముందు వీటి వినియోగం చాలా తక్కువ. అయితే వంద సంవత్సరాల ముందు ఒక కోల్‌కతా వైద్యుడు అంటు వ్యాధులను(Infectious Diseases) నివారించడంలో మాస్క్‌ల ప్రాముఖ్యత గురించి విస్తృతంగా పరిశోధన చేశారు.
కరోనా(Corona) వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా మాస్కులు(Masks) వినియోగించడం ప్రారంభమైంది. అంతకుముందు వీటి వినియోగం చాలా తక్కువ. అయితే వంద సంవత్సరాల ముందు ఒక కోల్‌కతా(Kolkata) వైద్యుడు అంటు వ్యాధులను(Infectious Diseases) నివారించడంలో మాస్క్‌ల ప్రాముఖ్యత గురించి విస్తృతంగా పరిశోధన చేశారు. వాటిని ఎలా తయారు చేయాలనే అంశాలను మాన్యువల్‌లో(Manual) కూడా వివరించారు. 1919లో, ప్రపంచవ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో జహర్ లాల్ దాస్ అనే వైద్యుడు మాస్కుల వాడకం ప్రాధాన్యాన్ని వివరించారు. ఆయన రాసిన 'హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్’(Hygiene and Public Health) అనే మాన్యువల్‌ను వెస్ట్ బెంగాల్ అడ్మినిస్ట్రేటర్ జనరల్, అఫీషియల్ ట్రస్టీ (AGOTWB) కార్యాలయంలో అధికారులు ఇటీవల చూశారు. అందులో.. వివిధ రకాల వైరస్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రజలు అందరూ మాస్క్ వినియోగించడం ఒక మంచి వ్యూహంగా 100 ఏళ్లకు ముందే భావించారు. అప్పటి పరిస్థితుల ప్రభావంతో మాస్క్‌ల వినియోగాన్ని సమర్థించారు.
దీనిపై జహర్ లాల్ దాస్ రాసిన మాన్యువల్‌లో.. ‘ఇన్ఫ్లుఎంజా రోగులను చేర్చుకునే ఆసుపత్రులలో నర్సులు, అటెండర్లకు మాస్క్‌ల వాడకం తప్పనిసరి. ఇన్ఫ్లుఎంజా ఉన్న ఇళ్లలో, అలాంటి రోగులతో సన్నిహితంగా ఉండే వాలంటీర్లు కూడా దీనిని అవలంబించవచ్చు.’ అని రాశారు.
* అంటు వ్యాధుల గురించి ఓ అధ్యాయం..
ప్రస్తుతం రెడీమేడ్ మాస్క్‌లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో బహిరంగ మార్కెట్లో మాస్క్‌లు దొరకడం చాలా కష్టం. అందుకే ఒకరు సొంతంగా మాస్క్ ఎలా తయారు చేసుకోవాలనే అనే అంశాలను జహర్ లాల్ దాస్ వివరించి ఉంటారు. మాస్క్ తయారీ గురించి ఆయన వివరిస్తూ..‘మాస్క్‌ను చాలా దగ్గరగా నేసిన మస్లిన్ గుడ్డ లేదా గేజ్‌తో తయారు చేయాలి. అటువంటి వస్త్రంతో మూడు నుంచి ఆరు పొరలతో వీటిని తయారు చేయాలి. అది ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి’ అని పేర్కొన్నారు.
ఆయన ఒక అధ్యాయంలో పూర్తిగా అంటువ్యాధుల గురించి వివరించారు. అలాంటి వ్యాధులు ప్రబలుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. మాస్క్‌లతో పాటు, ఐసోలేషన్ నిబంధనలు, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం, బాగా వెంటిలేషన్ ఉన్న గదుల ఆవశ్యకత, క్రిమిసంహారక మందుల ప్రాముఖ్యత, థియేటర్ల వంటి మూసి ఉన్న బహిరంగ ప్రదేశాలను మూసివేయడం వంటి వివిధ నివారణ చర్యలను కూడా వివరించారు.
* 100 ఏళ్ల క్రితం మాస్క్‌ల గురించి డాక్టర్ మాట్లాడడం ఆశ్చర్యం
జహర్ లాల్ దాస్ స్వచ్ఛంద ప్రయోజనాల కోసం బరాక్‌పూర్‌లోని తన పూర్వీకుల ఆస్తి సహా పశ్చిమ బెంగాల్ అధికారిక ట్రస్టీకి తన చర, స్థిరాస్తులన్నింటినీ అంకితం చేశారు. ఇటీవల అతని వస్తువులు, రాసిన పుస్తకాలు, ఆధారాలను రుజువు చేసే పత్రాలు, బంగారు రిమ్డ్ ఫ్రేమ్‌లతో కూడిన ఒక జత గాజులు వంటి వ్యక్తిగత వస్తువులను కొత్త సచివాలయ కార్యాలయంలోని రికార్డు గదిలో గుర్తించారు. AGOTWB అని బిప్లాబ్ రాయ్ మాట్లాడుతూ.. ‘100 సంవత్సరాల క్రితం ఈ వైద్యుడు మాస్క్‌ల ప్రాముఖ్యత గురించి మాట్లాడటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇవన్నీ నేటికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి. మేము ఈ వైద్యుడి గురించి మరింత తెలుసుకోవడానికి, అతని వస్తువులను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాం.’ అని చెప్పారు. ఈ పత్రాలను సంవత్సరాలుగా మూసివేసిన రికార్డ్ గదిలో ఇటీవల కనుగొన్నారు.
* రాయ్ బహదూర్ బిరుదు..
రికార్డుల ప్రకారం.. దాస్ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి 1907లో LMS (లైసెన్స్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ) పూర్తి చేశారు. ఆ సమయంలో సర్ అశుతోష్ ముఖర్జీ వైస్-ఛాన్సలర్‌గా ఉన్నారు. ఆయన 1929లో రాయ్ బహదూర్ బిరుదును అందుకొన్నారు. తాను AIIMSలో అంటు వ్యాధుల గురించి చదవడానికి చేరిన తర్వాతనే మాస్క్‌ల ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, UG లేదా PG మెడికల్ స్టూడెంట్‌గా పనిచేసిన సమయంలో మాస్క్‌లు ప్రస్తావన జరగలేదని చెప్పారు IPGMER అంటు వ్యాధుల అసోసియేట్ ప్రొఫెసర్ యోగిరాజ్ రే. కోల్‌కతాలోని ఒక వైద్యుడు 100 సంవత్సరాల క్రితం మాస్క్‌ల గురించి మాట్లాడటం అద్భుతమైన విషయమని పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.