Home /News /national /

THE UNION MINISTRY OF HEALTH HAS WRITTEN TO THE STATES ISSUING INDICATIONS AS THE NUMBER OF OMICRON CORONA CASES IS ON THE RISE IN INDIA PRV

Omicron cases: భార‌త్‌లో పెరుగుతున్న‌ ఒమిక్రాన్ కేసులు.. ఆయా రాష్ట్రాల‌కు కేంద్రం ఏం సూచ‌న‌లు చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఇప్పటి వరకు 200 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ప‌లు సూచ‌న‌లు జారీ చేసింది.

    కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. బ్రిటన్ లో భారీగా కేసులు (Omicron cases), మరణాలు చోటుచేసుకుంటుండగా, అమెరికాలోనూ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇటు భారత్ (In India) లోనూ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ కేసులు 200 మార్కును చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ (Union Department of Health) మంగళవారం నాడు వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 12 రాష్ట్రాలకు కొత్త మహమ్మారి విస్తరించింది. ప్రధానంగా ఏడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంటే, అందులో రెండు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వేడుకల్లో ఒమిక్రాన్ మరింత వ్యాపించే అవకాశాలుండటంతో ఎక్కడికక్కడే ఆంక్షలు విధిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులపై కేంద్రం చెప్పిన వివరాలివి..

    దేశంలో ఇప్పటి వరకు 200 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ (Union Department of Health) మంగళవారం తెలిపింది. మ‌రోవైపు డెల్టా వేరియంట్‌ను మించి వేగంగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron)తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ (Union Health Secretary Rajesh Bhushan) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.

    ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్‌ ఉంది. తాజాగా, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ అయిన ఒమిక్రాన్‌ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రస్తుతం ఆధారాలున్నాయి. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్ (data Analysis), నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్‌మెంట్‌ విషయంలో చురుగ్గా ఉండాలి’అని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ‘వార్‌రూంలను క్రియాశీలకం చేయాలి.. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలి. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్‌మెంట్‌ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలి. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో (celebrations) ప్రజలు భారీగా గుమికూడకుండా నియంత్రించాలి.

    వైరస్‌ బాధితుల హోం ఐసోలేషన్‌ (Home Isolation) సమయంలో నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలి’అని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ‘డోర్‌ టు డోర్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన మొదటి, రెండో డోస్‌ లబ్ధిదారులందరికీ టీకా వేగంగా అందేలా చూడాలి. వ్యాక్సినేషన్‌ (vaccination)లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’అని రాజేశ్‌ భూషణ్‌ కోరారు.

    గత వారం రోజులుగా టెస్ట్‌ పాజిటివిటీ రేటు 10%, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్‌ ఆక్యుపెన్సీ 40%, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. క్లస్టర్లలో సేకరించిన శాంపిళ్లను తక్షణమే తప్పనిసరిగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు పంపాలన్నారు. దేశంలో చిన్నారులకు ప్రస్తుతానికి కోవిడ్‌–19 టీకా (vaccine) అవసరం లేదని వ్యాధి నిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (National Technical Advisory Team) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌టీఏజీఐ వర్కింగ్‌ గ్రూప్‌లో నిర్ణయించినట్లు పేర్కొంది.

    ‘పిల్లలకు కోవిడ్‌ ముప్పు అంతగా లేదు. అందుకే, చిన్నారులకు (For children) కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ అవసరం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం’అని మంగళవారం ఎన్‌టీఏజీఐ తెలిపింది.

    దేశంలో ఇప్పటి వరకు 200 ఒమిక్రాన్ కేసులు (Omicron cases) నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత తెలంగాణ (Telangana)లో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది. సోమవారం వరకు దేశంలో 174గా ఉన్న కేసులు ఒక్కరోజులోనే 200 మార్కును చేరడం గమనార్హం.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona cases, Health department, Omicron

    తదుపరి వార్తలు