హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వంతెన మిగిల్చిన విషాదం..ఎంగేజ్ మెంట్ రోజే వధువు సహా ఆరుగురు మృతి..కంటతడి పెట్టిస్తున్న ఘటన

వంతెన మిగిల్చిన విషాదం..ఎంగేజ్ మెంట్ రోజే వధువు సహా ఆరుగురు మృతి..కంటతడి పెట్టిస్తున్న ఘటన

వంతెన మిగిల్చిన విషాదం

వంతెన మిగిల్చిన విషాదం

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ వంతెన ప్రమాదం వందల కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 141 మంది మరణించగా అందులో ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నారు. ఇక ఈ ప్రమాదానికి ముందు ఓ కుటుంబంలో జరిగిన ఘటన ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. అప్పటివరకు ఆ ఇంట ఎంగేజ్ మెంట్ సంబరాలు అంబరాన్నంటాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Gujarat

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ వంతెన ప్రమాదం వందల కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 141 మంది మరణించగా అందులో ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నారు. ఇక ఈ ప్రమాదానికి ముందు ఓ కుటుంబంలో జరిగిన ఘటన ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. అప్పటివరకు ఆ ఇంట ఎంగేజ్ మెంట్ సంబరాలు అంబరాన్నంటాయి. పెళ్లి కూతురు అవుతున్నానని యువతి మొఖంలో చెప్పలేని ఆనందం, ఇంటిల్లిపాది పిల్లలు బంధువులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అప్పటివరకు ఆనందంలో మునిగిపోయిన ఆ కుటుంబంలో రెప్పపాటు సమయంలో పెను విషాదం చోటు చేసుకుంది. వంతెన ప్రమాదాన్ని ఊహించలేకపోయిన వధువు కానరాని లోకాలకు వెళ్ళిపోయింది.

Morbi Bridge Collapse: మోర్జి బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ .. బాధితులకు పరామర్శ..

గుజరాత్ కు చెందిన మీరా కూతురు మెహబూబాయి మీరా ఎంగేజ్ మెంట్ ఆరోజే జరిగింది. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులంతా కలిసి అప్పుడే కొత్తగా ప్రారంభించిన వంతెన వద్దకు వెళ్లారు. పిల్లలు, బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి అప్పటివరకు ఆనందంగా గడిపారు. కానీ అనుకోని ప్రమాదం..ఊహించని ఘటనతో వధువుతో సహా ఆరుగురు కుటుంబసభ్యులు మరణించారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు మీరా, రుక్సానాబెన్ చౌహన్, సానియాబెన్ చౌహన్, రోషన్ బెన్ పఠాన్, మహియా పఠాన్, దానిష్ పఠాన్ గా తెలుస్తుంది. ఈ ఘటనతో మా కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయని ఆ కుటుంబానికి చెందిన ఇమ్రాన్ సయ్యద్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటనకు భాద్యులు ఎవరో తెలియదు. దోషులను గుర్తించాలి. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మోర్బి ప్రమాదం తర్వాత మరణించిన వారి కుటుంబాలకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో పాటు క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని ప్రకటన చేశారు. అలాగే గుజరాత్ ప్రభుత్వం కూడా మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు మరియు గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మోర్బీకి(Morbi) చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రధాని మోదీకి, ఘటన ఎలా జరిగింది, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయనే పూర్తి సమాచారాన్ని హర్ష్ సంఘ్వీ తెలిపారు. దీని తర్వాత, సహాయ మరియు సహాయక చర్యల్లో నిమగ్నమైన అన్ని బృందాలతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో నిమగ్నమైన స్థానిక ప్రజలను కూడా ప్రధాని మోదీ (PM Modi)కలిశారు. ఆ తర్వాత నేరుగా మోర్బీలోని సివిల్ ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని క్షతగాత్రులకు (Victims)హామీ ఇచ్చారు. ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించి, ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు.

First published:

Tags: Gujarat, India