• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • THE TRAGEDY AT THE HOME OF MAHARASHTRA CHIEF MINISTER UDDHAV THACKERAY BN

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంట్లో విషాదం..

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంట్లో విషాదం..

ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)

పాటంకర్ కిడ్నీ సమస్యతో పాటు పలు రకాల అనారోగ్య కారణాలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం రోజురోజూకీ విషమిస్తున్న తరుణంలో అంధేరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

  • Share this:
    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. ఉద్దవ్ థాకరే మామ, శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటర్ మాధవ్ పాటంకర్ చనిపోయారు. పాటంకర్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. పాటంకర్ కిడ్నీ సమస్యతో పాటు పలు రకాల అనారోగ్య కారణాలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం రోజురోజూకీ విషమిస్తున్న తరుణంలో అంధేరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పాటంకర్ ఆదివారం చనిపోయారు. సోమవారం పాటంకర్ భౌతికకాయానికి అంత్యక్రియలు చేశారు. ఇదిలావుంటే.. ముంబైలోని థాకరే ఇంటికీ దగ్గరలోనే మాధవ్ పాటంకర్ ఇల్లు సైతం ఉంది. పాటంకర్ మరణం పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీలు సంతాపం ప్రకటించాయి.
    Published by:Narsimha Badhini
    First published: