హోమ్ /వార్తలు /జాతీయం /

సీజేఐపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం.. నిగ్గు తేల్చిన జస్టిస్ బాబ్డే కమిటీ

సీజేఐపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం.. నిగ్గు తేల్చిన జస్టిస్ బాబ్డే కమిటీ

సుప్రీం కోర్టు సీజేఐ రంజన్ గోగోయ్ (ఫైల్ చిత్రం)

సుప్రీం కోర్టు సీజేఐ రంజన్ గోగోయ్ (ఫైల్ చిత్రం)

సీజేఐపై దురుద్దేశపూర్వకంగా మహిళా ఉద్యోగిని ఈ తరహా ఆరోపణలు చేసినట్లు తెలిపింది. సీజేఐపై లేవనెత్తిన లైంగిక ఆరోపణలకు సంబంధించి కమిటీ మహిళా ఉద్యోగినిని విచారణ జరపగా. ఆమె ఇచ్చిన సమాధానాలు, ఆరోపణలకు మధ్య పొంతన లేదని తేల్చింది.

    సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీం కోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ తోసిపుచ్చింది. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జస్టిస్ బాబ్డే కమిటీ తేల్చింది. ఈ మేరకు ప్రత్యేక కమిటీ సుప్రీం కోర్టుకు నివేదికను అందజేసింది. కమిటీ నివేదికను సీజేఐ సెక్రటరీ జనరల్ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇదిలా ఉంటే సీజేఐపై దురుద్దేశపూర్వకంగా మహిళా ఉద్యోగిని ఈ తరహా ఆరోపణలు చేసినట్లు తెలిపింది. సీజేఐపై లేవనెత్తిన లైంగిక ఆరోపణలకు సంబంధించి కమిటీ మహిళా ఉద్యోగినిని విచారణ జరపగా. ఆమె ఇచ్చిన సమాధానాలు, ఆరోపణలకు మధ్య పొంతన లేదని తేల్చింది.


    ఇదిలా ఉంటే సీజేఐపై సుప్రీం కోర్టు ఉద్యోగిని చేసిన ఆరోపణలపై గతంలో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోనే ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. కాగా దీనిపై అభ్యంతరాలు వెలువడటంతో జస్టిస్ బాబ్డే అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.

    First published:

    Tags: Supreme Court

    ఉత్తమ కథలు