Home /News /national /

THE STUDENTS WHO WON RAMAYANAM COMPETITIONS READ THEIR WORDS AND SAY WOW UMG GH

Ramayana Quiz: రామాయణం పోటీల్లో విజేతలుగా ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు !

 రామాయణం  పోటీల్లో విజేతగా నిలిచిన ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు !

రామాయణం పోటీల్లో విజేతగా నిలిచిన ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు !

కేరళ(Kerala)లో జరిగిన రాష్ట్ర స్థాయి రామాయణం క్విజ్‌లో విజేతలుగా ఐదుగురు నిలిచారు. వీరిలో ముహమ్మద్ బాసిత్ ఎం (20), ముహమ్మద్ జాబిర్ పికె (23) అనే ఇద్దరు ఇస్లామిక్ (Islamic) స్టడీస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీరు మర్కజ్ వాలన్చేరిలోని KKHM ఇస్లామిక్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
వాల్మీకి (Valmiki) రాసిన ఇతిహాసం రామాయణం (Ramayana) రాముడి కథ గురించి మాత్రమే కాదు చాలా విషయాలను కవర్ చేస్తుంది. మానవత్వం గురించి వివరించే ఈ కావ్యాన్ని పిల్లలందరూ చదవాలని పెద్దలు చెబుతుంటారు. హిందూ మతంలో రెండు ముఖ్యమైన ఇతిహాసాల్లో రామాయణం ఒకటిగా నిలుస్తుంది. అయితే ఈ హిందూ(Hindu) ఇతిహాసంపై నిర్వహించిన ఒక క్విజ్‌లో ఇద్దరు ఇస్లామిక్ స్టడీస్ (Wafy) విద్యార్థులు విజేతలుగా నిలిచి ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల కేరళ(Kerala)లో జరిగిన రాష్ట్ర స్థాయి రామాయణం క్విజ్‌లో విజేతలుగా ఐదుగురు నిలిచారు. వీరిలో ముహమ్మద్ బాసిత్ ఎం (20), ముహమ్మద్ జాబిర్ పికె (23) అనే ఇద్దరు ఇస్లామిక్ (Islamic) స్టడీస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీరు మర్కజ్ వాలన్చేరిలోని KKHM ఇస్లామిక్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్నారు.

రామాయణంపై లోతైన అధ్యయనం ఆధారంగా జులై 23-జులై 25 మధ్య కేరళకు చెందిన పబ్లిషింగ్ హౌస్ DC బుక్స్ ఆన్‌లైన్ క్విజ్ నిర్వహించింది. అయితే జాబీర్, బాసిత్ తమ చదువులో భాగంగా రామాయణం చదివి అర్థం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరూ క్విజ్‌లో పాల్గొన్నారు. ఈ క్విజ్‌లో నవనీత్ గోపన్, అభిరామ్ MP, గీతు కృష్ణన్‌తో పాటు వీరు కూడా విన్నర్స్‌గా నిలిచారు. వేదాంతశాస్త్రం (Theology)లో సీనియర్ విద్యార్థి అయిన జాబీర్, అన్ని మతాలు మానవాళి శాంతియుతంగా జీవించడం కోసమే రూపొందించారని అన్నాడు. ఒక దేశంలో మెరుగైన పాలన, న్యాయాన్ని ఎలా అమలు చేయవచ్చో రామాయణం వివరించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని జాబీర్ పేర్కొన్నాడు.

“రామాయణం రాముడిని ఆదర్శవంతమైన రాజుగా చూపిస్తుంది. దేశంలో మెరుగైన పాలన, న్యాయం, ధర్మం, విధులను ఎంత గొప్పగా అమలుపరచవచ్చో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇలాంటి పాలన ప్రపంచం మొత్తం జరగాలి. ఈ పవిత్ర గ్రంథంలో ద్వేషం గురించి అసలు ఏ ప్రస్తావన లేదు. నిజానికి ఏ మతమూ కూడా ద్వేషాన్ని ప్రోత్సహించదు” అని జబీర్ తెలిపాడు.

ఇదీ చదవండి: Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!



"ముస్లిం రచయితలు రచించిన మతపరమైన పుస్తకాలను నేర్చుకోవడానికి మాకు అవకాశం ఉంది. వాటికి అదనంగా ఇతర మతపరమైన పవిత్ర గ్రంథాలను కూడా చదవాలని మాకు సూచించారు. అందుకే ఆ పుస్తకాలను చదువుతూ అర్థం చేసుకున్నాను. మా లైబ్రరీలో అన్ని మతపరమైన పవిత్ర పుస్తకాలు, వాటిపై ఇతర అధ్యయనాలు ఉన్నాయ"ని జబీర్ చెప్పాడు.



సాధారణంగా వాఫీ విద్యార్థులు ఇస్లామిక్ అధ్యయనాలతో పాటు మిగతా అధ్యయనాలను కూడా చదువుతారు. “మాకు యూనివర్సిటీ ఆమోదం ఉన్న డిగ్రీ ఉంటేనే ఈ కోర్సుకు సర్టిఫికేట్ పొందుతాం. అలానే, మిగతా అన్ని మతాలు, సంస్కృతుల గురించి మేం తెలుసుకోవాలి. మన దేశంలోని అన్ని సంస్కృతుల గురించి మాకు నేర్పిస్తూ మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కోర్సు లక్ష్యం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హిందూ మత జ్ఞానోదయం కలిగించే పవిత్ర గ్రంథం రామాయణాన్ని కూడా చూశాను” అని జబర్ పేర్కొన్నాడు.
Published by:Mahesh
First published:

Tags: Kerala, Muslim brothers, Ramayanam, Valmiki

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు