Home /News /national /

THE SON WHO WANDERED IN SEARCH OF A JOB MET HIS MOTHER AFTER 27 YEARS PVN

Son met mother after 27 years: 14 ఏళ్ల వయస్సులో తప్పిపోయి..27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు!

.27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు

.27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు

Son met his mother after 27 years: ఈ సృష్టిలో అత్యంత గొప్ప బంధం తల్లీబిడ్డల బంధం. తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా తన బిడ్డకు మాత్రం ఆ కష్టం తెలియకూడదని కోరుకుంటుంది ప్రతి తల్లి. అయితే అటువంటి తల్లి ప్రేమకు 27 ఏళ్ల క్రితం దూరమయ్యాడు ఓ యువకుడు.

ఇంకా చదవండి ...
Son met his mother after 27 years: ఈ సృష్టిలో అత్యంత గొప్ప బంధం తల్లీబిడ్డల బంధం. తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా తన బిడ్డకు మాత్రం ఆ కష్టం తెలియకూడదని కోరుకుంటుంది ప్రతి తల్లి. అయితే అటువంటి తల్లి ప్రేమకు 27 ఏళ్ల క్రితం దూరమయ్యాడు ఓ యువకుడు. ఉపాధి కోసం ఢిల్లీకి వచ్చిన ఓ నేపాలీ యువకుడు తప్పిపోయి.. 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన తల్లిని కలుసుకున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడా(Noida)లో ఈ సంఘటన జరిగింది.

నేపాల్‌(Nepal)లోని పుతులి గ్రామానికి చెందిన కిషన్ అలియాస్ రవి 27 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ తన పొరుగింటి వ్యక్తి టికారంతో కలిసి ఢిల్లీ(Delhi)కి వచ్చాడు. అప్పటికి కిషన్‌ వయసు 14 ఏళ్లు. కొద్ది రోజులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఆ తర్వాత వారు పని చేసే చోటు నుంచి కిషన్ తప్పిపోయాడు. కిషన్ దారి తప్పి టికారమ్ నుండి విడిపోయి నోయిడా-దాద్రీ అటవీ ప్రాంతంలోని కోట్ అనే గ్రామానికి చేరుకున్నాడు. అదే సమయంలో, కిషన్ అదృశ్యమైన విషయాన్ని టికారమ్ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. దీనిపై ఆ కుటుంబం నేపాల్‌లోనే టికారంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు టికారాన్ని క్షుణ్ణంగా విచారించారు. దీని తర్వాత నేపాల్ పోలీసులు కిషన్‌ను కనుగొనలేకపోయారు. అదే సమయంలో కిషన్.. కోట్ గ్రామం చేరుకున్నాక అతడి ఆరోగ్యం క్షీణించింది. కోట్​ గ్రామంలో ఉండే సంజయ్​ అనే వ్యక్తి తన పొలంలొ పనిచేసుకుంటుండగా అక్కడ కూర్చుండిపోయిన కిషన్ ను చూసి తన ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. 22 ఏళ్ల పాటు వారితోనే ఉండిపోయాడు కిషన్.

ALSO READ Woman Beaten: ఆడపిల్లల్ని కన్నందుకు..మహిళను చిత్రహింసలు పెట్టిన భర్త,అత్తమామలు

అయితే కొన్నేళ్ల క్రితం కిషన్‌ను తమ కొడుకుగా తీసుకోవడానికి ఒక జంట వచ్చారని, అయితే కిషన్ వారిని తల్లిదండ్రులుగా అంగీకరించడానికి నిరాకరించాడని మరియు తమతో కలిసి ఉండాలని పట్టుబట్టాడని సంజయ్​ దంపతులు తెలిపారు. ఫిబ్రవరి 5,2020న గ్రామానికి చెందిన ఒక కుటుంబం కిషన్‌ను బాగ్‌పత్‌కు తీసుకెళ్లి మహరంపూర్ గ్రామంలోని ఒక వ్యక్తికి అప్పగించింది. అతను కిషన్‌ చేత జంతువుల పనులు చేయించడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కొత్వాలి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసుల సాయంతో కిషన్‌ను వెనక్కి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బాఘ్​పత్​కు చెందిన కొందరు రవి గురించి నేపాల్​ ఎంబసీకి సమాచారం అందించారు. నేపాల్ యువకుడు నాయిడాలోని కోట్​ గ్రామంలో ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న నేపాల్​ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రవి కుటుంబానికి సైతం సమాచారం అందించారు. వారు వెంటనే ఢిల్లీ చేరుకున్నారు.

ALSO READ Shocking: బిడ్డకు జన్మనిచ్చిన నాలుగో రోజే..భార్యను హాస్పిటల్ లోనే దారుణంగా హత్య చేసిన భర్త!

27 ఏళ్ల తర్వాత దాద్రీ కొత్వాలీ పోలీసుల సాయంతో కోట్​ గ్రామం నుంచి రవిని అతడి కుటుంబ సభ్యులతో తీసుకెళ్లారు నేపాల్​ పోలీసులు. 27 ఏళ్ల తర్వాత తన కుమారుడిని కలిసిన కిషన్ తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను కలిసిన ఆనందంతో కిషన్ సైతం కంటతడి పెట్టుకున్నాడు. తమ కుమారుడికి ఆశ్రయం కల్పించిన సంజయ్​ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ కుటుంబ సభ్యులు. మరోవైపు, 22 ఏళ్ల పాటు రవికి ఆశ్రయం కల్పించిన సంజయ్​​, అతని కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులతో పాటు రవిని నేపాల్​ పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Missing person, Mother, Nepal, Noida, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు