హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

viral news: కొ​బ్బరికాయ కొడితేనే పగిలిపోయిన కొత్త రోడ్డు.. అవాక్కయిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్​

viral news: కొ​బ్బరికాయ కొడితేనే పగిలిపోయిన కొత్త రోడ్డు.. అవాక్కయిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోటి రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు ఒపెనింగ్‌ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఒపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

వానలొస్తే చాలు రోడ్లు (Roads) గుంతలు, నీటితో నిండిపోతాయి. ఒకప్పుడు భారీ వర్షాలకు మాత్రమే రోడ్లకు గుంతలు పడేవి. ఇపుడైతే చిన్న చిన్న వర్షాలకే గుంతలమయం అవుతున్నాయి. ఇదంతా అధికారులు, ప్రాజెక్టు కాంట్రాక్టర్ల చేతివాటం అని చెప్పుకోక తప్పదు. అవి గుంతలు పడటం.. మళ్లీ కొత్త కొత్త రోడ్లు (new roads) వేయడం పరిపాటే. నాణ్యత (Quality) సదరు కాంట్రాక్టర్‌ ఎంత నిజాయతీపరుడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోటి రూపాయలకు పైగా పెట్టి నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం రోజునే (On the day of the inauguration) దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఒపెనింగ్‌లో (Road Inauguration) భాగంగా కొబ్బరి కాయ (Coconut) కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొబ్బరి కాయ బదులు రోడ్డు బీటలు వారింది. ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

రోడ్డు నాణ్యత ఇదేనా..

ఉత్తర్​ప్రదేశ్ (Uttar Pradesh)​ బిజ్నోర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌధరి (MLA Suchi Chaudhary)కి మైండ్​ బ్లాంక్​ అయ్యే అనుభవం ఎదురైంది. కొత్తగా వేసిన రోడ్డును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే.. కొబ్బరికాయ కొట్టగానే (When coconut knocked down) రోడ్డుపై పగుళ్లు (Cracks on the road) వచ్చాయి. దీంతో ఆమెకు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రోడ్డు నాణ్యత ఇదేనా అంటూ అధికారులపై సుచి చౌధరి మండిపడ్డారు.

ఖేడా గ్రామంలో రూ. కోటి 16 లక్షలు వెచ్చించి ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు (Road) నిర్మించారు. గురువారం సాయంత్రం శాసనసభ్యురాలు సుచి.. రోడ్డును ప్రారంభించేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొబ్బరికాయ(Coconut)కొట్టేందుకు ప్రయత్నించారు. కొబ్బరికాయ పగలకపోగా.. రోడ్డుపై పగుళ్లు  (Cracks)వచ్చాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త మౌసమ్ చౌధరి రైడా అక్కడే ఉన్నారు. ఆయన ఓ పారతో తవ్వగా.. రోడ్డు ఎంత నాణ్యతతో రోడ్డు (Road) వేశారో అర్థమయిపోయింది అందరికి.

విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మెల్యే సుచి చౌధరి.. అధికారులపై ఓ రేంజ్‌లో మండి పడ్డారు. నాసిరకం రోడ్డు వేసిన కాంట్రక్టర్‌కు చివాట్లు పెట్టింది. అనంతరం అక్కడే ధర్నాకు దిగి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వికాస్ అగర్వాల్ రోడ్డు నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలన నిమిత్తం పంపినట్లు అధికారులు వెల్లడించారు.

First published:

Tags: Coconut water, Ministry of road transport and highways, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు