Resturant Offer: మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా.. అయితే ఆ రెస్టారెంట్ లో 20 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.. వివరాలివే..

రెస్టారెండ్ ఆఫర్ బోర్డు

Resturant Offer: కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి కొంతమంది ఇంకా భయపడుతున్నారు. తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో టీకాపై అపోహలు, భయాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని.. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తమ రెస్టారెంట్ లో ఆఫర్ కల్పించనున్నట్లు ప్రకటించారు. వివరాలిలా..

  • Share this:
    కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ వేషధారణలో అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో కరోనా షేప్ లో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. మొదటి వేవ్ కరోనా వ్యాప్తి కంటే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. దేశంలో కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల సూచనలతో.. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా నిర్వహిస్తోంది. అయితే విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్నా, సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో టీకాపై అపోహలు, భయాలున్నాయి. ఆ సందేహాలను.. అపోహల్ని నివృత్తి చేసేందుకు వైద్యులు, సెలబ్రిటీలు, సామాజికవేత్తలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడానికి చెన్నైకి చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన ఆకారంలో ఆటోని రూపొందించి అవగాహన కల్పించారు.

    తాజాగా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఓ రెస్టారెంట్ యజమాని మంచి ఆఫర్ ప్రకటించాడు. అదేంటో .. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.  నావెల్ కరోనా వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గం నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడంలో ప్రజలు తమ వంతు సహాయం అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారానే ఈ మహమ్మరిని అరికట్టడానికి రోగనిరోధక శక్తిని పొందవచ్చు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాజస్థాన్ లోని ఒక రెస్టారెంట్ యజమాని వ్యాక్సిన్ వేసుకున్న వారికి మంచి ఆఫర్ ప్రకటించాడు.


    రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వేద్ పేరుతో ఉన్న ఒక రెస్టారెంట్ కు సింగిల్ డోసు వేసుకున్న కస్టమర్ వెళ్తే బిల్లుపై 10 శాతం డిస్కౌంట్, అలాగే సెకండ్ డోస్ వేసుకున్న కస్టమర్ 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. "వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలను ప్రోత్సహించడమే మా లక్ష్యం" అని రెస్టారెంట్ యజమాని అనిల్ కుమార్ మీడియా మాట్లాడుతూ చెప్పారు. దీని వల్ల ప్రజల్లో ఎంతో కొంత అవగాహన కల్పించినవాళ్లం అవుతామని.. దీనిపై అపోహలు పోవాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రకటించినట్లు వారు తెలిపారు.
    Published by:Veera Babu
    First published: