హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Repeal of farm laws: సాగు చట్టాల ఉపసంహరణకు కారణమేంటి? రాజకీయ లబ్ధి కోసమేనా..?

Repeal of farm laws: సాగు చట్టాల ఉపసంహరణకు కారణమేంటి? రాజకీయ లబ్ధి కోసమేనా..?

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)

The repeal of farm laws: సాగు చట్టాల ఉపసంహరణ నిర్ణయం బీజేపీకి రాజకీయ పరమైన ప్రయోజనాలు కలిగించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల రైతులు సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారని, వారి కోసమే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...

(Aman Sharma, Senior Editor (Politics), CNN-News18)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇందులో రెండు పెద్ద సందేశాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని విషయాల కంటే జాతీయ ప్రయోజనాలకు విలువ ఇస్తుంది.. ప్రభుత్వం రైతుల మాట వింటుంది.. అనే బలమైన సందేశాలను మోదీ ప్రకటనలో గుర్తించవచ్చని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే 2015లో వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవడంతో పాటు ఇప్పుడు మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు News18కి చెప్పారు.

‘వ్యవసాయ చట్టాల గురించి రైతులు, ప్రజలను ఒప్పించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో చట్టాలను వ్యతిరేకించే కొంతమంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఖలిస్థాన్, పాకిస్తాన్ ISI నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే గ్రూపులు రైతుల ఉద్యమాన్ని అనుసరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఒక బీజేపీ నేత చెప్పారు. భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలను బలహీనపరిచే ఇలాంటి శక్తులను అంతమొందిస్తూ.. దేశ ఐక్యత, సమగ్రత కోసం మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

గుజరాత్‌లో సామూహిక మతమార్పిడుల కలకలం.. బ్రిటన్ నుంచి ఒక గ్రామానికి రూ.80 కోట్లు

* బీజేపీకి రాజకీయ లబ్ధి

ఈ నిర్ణయం బీజేపీకి మరో రెండు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చనుంది. పంజాబ్‌ ఎన్నికల్లో తిరిగి బలం పుంజుకోవడంతో పాటు ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కాపాడుకోవడంపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో సాగు చట్టాల ఉపసంహరణ నిర్ణయం బీజేపీకి రాజకీయ పరమైన లాభాన్ని తెచ్చిపెట్టగలదు. పంజాబ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల రైతులు సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన విషయం గమనార్హం.

ఇప్పుడు పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పార్టీతో పొత్తుకు బీజేపీకి మార్గం సుగమమైంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, జయంత్ చౌదరికి చెందిన RLD వ్యవసాయ చట్టాలపై పశ్చిమ ప్రాంతంలో రైతులను సంఘటితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో తమకు వ్యతిరేకంగా కనిపించిన ఒక అంశానికి చెక్ పెట్టినట్లు బీజేపీ భావిస్తోంది. పంజాబ్, యూపీలో మూడు నెలల్లోపు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తమ పెద్ద విజయంగా అభివర్ణించుకుంటున్నాయి.

Farm Laws: సాగు చట్టాల రద్దుపై నేతల స్పందన.. ఎవరు ఏమన్నారంటే..

* పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలను సద్వినియోగం చేసుకునేందుకు భారత వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు ఒక ప్రభుత్వ పెద్ద చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. విభిన్న వర్గాల మధ్య చీలికలు సృష్టించి.. దేశ సామాజిక స్వరూపాన్ని, సమగ్రతను భగ్నం చేయాలనుకునే ఇలాంటి అంశాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని ప్రభుత్వం భావించినట్లు చెప్పారు. “రైతుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నందుకు.. అందరికంటే ఎక్కువగా ప్రధానమంత్రి నిరాశ చెందారు. మెజారిటీ రైతులు ఈ చట్టాలను స్వాగతించారు. ప్రధాని సైతం ఈరోజు తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు” అని ఒక అధికారి తెలిపారు.

CM Stalin : రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. సీఎం మరో కీలక నిర్ణయం

వ్యవసాయ చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేసే ప్రతిపాదన ఉంది. దీంతోపాటు చట్టాలపై వ్యక్తమైన అభ్యంతరాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. అయినా కూడా ఆందోళనలు చేస్తున్న రైతులను ప్రభుత్వం ఒప్పించలేకపోయిందని మోదీ చెప్పారు. అందుకే నవంబర్ 29 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉదయం మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను గుర్తుచేసుకున్నారు. చిన్న రైతుల సంక్షేమం కోసమే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతుల శ్రేయస్సే తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. ఈ ప్రకటనలను బట్టి చూస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయ రంగ సంస్కరణల ప్రయాణం కొనసాగుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

* సిక్కు వర్గాల ఆశీర్వాదం కోసమేనా?

సిక్కు సమాజం భావాలను మోదీ చాలా సున్నితంగా పరిగణిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను కేంద్రం ఇటీవల తిరిగి ప్రారంభించిందని, గురునానక్ జయంతి సందర్భంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. వారిని ఎప్పుడూ చులకన చేసి పక్కన పెట్టలేదని తెలిపారు. ‘పార్టీ పనుల కోసం మోదీ పంజాబ్, చండీగఢ్‌లలో కొన్ని సంవత్సరాలు పనిచేశారు. ఈ క్రమంలో సిక్కు సమాజంతో సంబంధాలు బలోపేతం చేసుకున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. 2001 నాటి భూకంపం కారణంగా కచ్‌లోని లఖ్‌పత్ గురుద్వారా ధ్వంసమైంది. ఈ గురుద్వారాకు మరమ్మతు చేయడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. సిక్కు సమాజాన్ని ప్రధాని మోదీ ఎప్పటికీ నిరాశపరచరు’ అని బీజేపీ వర్గాలు తెలిపాయి.

First published:

Tags: Farm Laws, Farmers, Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు