భారతీయ రైల్వే (Indian Railways) శాఖ సరికొత్త ట్రైన్స్‌ను మెరుపువేగంతో దూసుకెళ్లేలా అభివృద్ధి చేస్తోంది. ఇండియన్ రైల్వే కొత్తగా తయారు చేసిన ఏసీ డబుల్ డెక్కర్ LHB కోచ్ (AC Double Decker LHB coach) భారీ స్పీడ్‌తో దూసుకెళ్లి అబ్బురపరిచింది. తాజాగా ఇండియన్ రైల్వేస్ ఈ ఏసీ డబుల్ డెక్కర్ LHB కోచ్‌కు స్పీడ్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో కొత్త కోచ్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR)లోని రాజస్థాన్ (Rajasthan)లోని కోటా-నాగ్డా సెక్షన్‌లో స్పీడ్ ట్రయల్స్‌ను రైల్వే అధికారులు కండక్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో రైలు స్పీడోమీటర్ 180 kmph మార్కును తాకడం గమనించవచ్చు. అలానే ఈ రైలు మెరుపు వేగంతో వివిధ మార్కులను కళ్లు తెరిచి మూసేలోపు దాటేస్తూ ఉండటం చూడవచ్చు.
పశ్చిమ మధ్య రైల్వే కూడా స్పీడ్ ట్రయల్ వీడియోను ట్వీట్ చేసింది. “కోటా - నాగ్డా సెక్షన్‌లో గంటకు 180 కి.మీ వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ స్పీడోమీటర్‌పై ఓ లుక్కేయండి." అని వెస్ట్ సెంట్రల్ రైల్వే ఒక వీడియో పోస్ట్ చేసింది. 2021లో వెస్ట్ సెంట్రల్ రైల్వే 180 kmph వేగంతో నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ సెక్షన్‌లో ఎయిర్ కండిషన్డ్ త్రీ-టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌ల ఆసిలేషన్ ట్రయల్స్ (Oscillation Trials)ను విజయవంతంగా నిర్వహించింది. ఈ స్పీడ్(Speed)లో ట్రైన్ ఎక్కువగా ఊగకుండా కనిపించింది. దాంతో ఇదే వేగంతో భారతీయ రైల్వే మరిన్ని ట్రైన్స్ తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/RailMinIndia/status/1417709846820839425?t=rv1n_i0ACfvvizDqWASjfA&s=19
మరోవైపు జబల్‌పూర్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్ కోచ్‌లను తీసుకురావాలని పశ్చిమ మధ్య రైల్వే నిర్ణయించింది. విస్టాడోమ్ కోచ్‌లలో కిటికీలకు పెద్ద గాజు పలకలు, తిరిగే సీట్లు, గ్లాస్ రూఫ్, అబ్జర్వేషన్ లాంజ్‌లు ఉంటాయి. ఈ ఫీచర్లన్నీ ప్రయాణికులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు వీక్షించేందుకు సహాయపడతాయి. తద్వారా తాము వెళ్లే మార్గంలో కనిపించే ప్రకృతి సౌందర్యాలు, సోయగాలు పర్యాటకులు చూసి ఎంజాయ్ చేయవచ్చు. 2018లో ముంబయి-మడ్‌గావ్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మొదటి విస్టాడోమ్ కోచ్‌లు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున సానుకూల స్పందన వచ్చింది. ఆ విజయంతో మరింత ఉత్సాహంగా.. ఈ కోచ్‌లను జూన్ 2021లో ముంబై-పూణే దక్కన్ ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 2021 నుంచి ముంబై-పూణే మార్గంలో డెక్కన్ క్వీన్‌కు కూడా పరిచయం చేశారు.
రైలు మార్గంలో విస్టాడోమ్ కోచ్‌లు పరిచయం చేసి ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి, రైల్వే మార్గాల్లో పర్యాటకాన్ని పెంచడానికి భారతీయ రైల్వే ఒక భారీ లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యంలో భాగంగా పశ్చిమ మధ్య రైల్వే విస్టాడోమ్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తోంది. డెక్కన్ క్వీన్‌లోని విస్టాడోమ్ కోచ్ పుణే నుంచి ముంబై వరకు 99 శాతం ఆక్యుపెన్సీని చూడటం విశేషం. ఈ ట్రైన్ జూన్ 2021 నుంచి మే 2022 మధ్య రూ. 1.63 కోట్ల ఆదాయం సంపాదించింది. అదే మార్గంలో డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలులో కోచ్ 100 శాతం ఆక్యుపెన్సీని చూసింది. ఈ రైలు అదే కాలంలో రూ. 1.11 కోట్ల రెవిన్యూను కలెక్ట్ చేసింది. అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2021 మధ్య కాలంలో సెంట్రల్ రైల్వే జోన్‌లో మొత్తం 20,407 మంది ప్రయాణికులు విస్టాడోమ్ కోచ్‌లను బుక్ చేసుకున్నారు. తద్వారా రైల్వే జోన్‌కు మొత్తం రూ. 2.38 కోట్ల ఆదాయం సమకూరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, High speed trains, Indian Railways, Rajastan