Home /News /national /

THE PUNJAB AND HARYANA HIGH COURT HAS SAID THAT RECORDING WIFE PHONE CALLS WITHOUT PERMISSION IS A VIOLATION OF HER RIGHT TO PRIVACY PRV

Wife and Husband: భార్య అనుమతి లేకుండా అలా చేయడం ముమ్మాటికీ తప్పే.. పంజాబ్​, హర్యానా హైకోర్టు ఆసక్తికర తీర్పు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని  ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్‌ సంభాషణలను సమర్పించాడు. అయితే ఇక్కడే కేసు మరో మలుపు తిరిగింది. 

    పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య (Wife) వేధింపులకు గురిచేస్తోందని, విడాకులు (Divorce) ఇప్పించమని  ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్‌ సంభాషణలను (Phone Recordings) సమర్పించాడు. అయితే ఇక్కడే కేసు మరో మలుపు తిరిగింది. ఈ సాక్ష్యాలపై భార్య అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా రికార్డు చేయడం (Recording calls without the wife's permission)పై పంజాబ్‌, హర్యానా హైకోర్టులో భార్య (wife) కేసు పెట్టింది. ఇక్కడే కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్‌ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం (Recording calls without the wife's permission) గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్‌, హర్యానా ఉమ్మడి హైకోర్టు (Punjab and Haryana High Court) స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ లిసా గిల​ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.

    ఫోన్​ రికార్డింగులు, సిమ్‌ కార్డులను సాక్ష్యాలుగా..

    2007లో ఫిబ్రవరి 20న ఆ భార్యాభర్తలకు (wife and Husband) వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె  జన్మించింది. అయితే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్‌ దాఖలు చేశాడు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ఫోన్​ రికార్డింగులు, సిమ్‌ కార్డులను సాక్ష్యాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్‌ చేస్తూ భార్య (wife) హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యత (Right to privacy)ను ఉల్లంఘించడమేనని వాదించింది.  అయితే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతో కాదని భర్త తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు .

    ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్‌ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్‌ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.

    ఇటీవలె కేరళలో..

    వివాహ బంధానికి సంబంధించి కేరళ హైకోర్టు ఇటీవలె కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో భర్త శృంగారంలో పాల్గొంటే అది వైవాహిక అత్యాచారం అవుతుందని  హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ ఎ ముహమ్మద్ ముస్తాక్ మరియు జస్టిస్ కౌసర్ ఎడప్పగత్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జూలై 30న హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహం మరియు విడాకులు తప్పనిసరిగా లౌకిక చట్టం కింద ఉండాలని పేర్కొంది.అలాగే దేశంలోని వివాహ చట్టాన్ని పునశ్చరణ చేయడానికి సమయం ఆసన్నమైందని అభిప్రాయపడింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Haryana, High Court, Punjab, Wife and husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు