• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • THE PETROL THAT IS BROUGHT IN ILLEGALLY FROM NEPAL IS SOLD TO SMALL RETAILERS AT LESS PRICE IN NORTH BIHAR SSR

Petrol Price: అక్కడ పెట్రోల్ 22 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో క్యూ కడుతున్న జనం..!

Petrol Price: అక్కడ పెట్రోల్ 22 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో క్యూ కడుతున్న జనం..!

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. దీంతో.. నేపాల్ బోర్డర్‌కు సమీపంలోని నార్త్ బీహార్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల వాహనదారులు నేపాల్ వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుక్కుంటున్నారు. అయితే.. కొందరు ఇదే అదనుగా...

  • Share this:
    పాట్నా/డెహ్రాడూన్: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. దీంతో.. నేపాల్ బోర్డర్‌కు సమీపంలోని నార్త్ బీహార్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల వాహనదారులు నేపాల్ వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుక్కుంటున్నారు. అయితే.. కొందరు ఇదే అదనుగా పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. నార్త్ బీహార్‌కు దగ్గరగా ఉండే నేపాల్ సరిహద్దు ప్రాంతం పార్శా జిల్లా నుంచి కొందరు రోజుకు బైక్‌పై ఐదారు ట్రిప్పులు వేసి మరీ పెట్రోల్ తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు 5 లీటర్ల పెట్రోల్‌ను నార్త్ బీహార్‌కు తరలిస్తున్నారు. నేపాల్‌లో అక్కడి మారకం ప్రకారం లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు. అయితే.. ఒక నేపాల్ రూపాయి విలువ 0.63 పైసల భారత రూపాయికి సమానం.

    దీంతో.. నేపాల్‌లో 113 రూపాయలకు లీటర్ పెట్రోల్ కొన్నప్పటికీ భారత కరెన్సీలో చెప్పాలంటే దాని విలువ 70రూపాయల 79 పైసలే. అక్కడి నుంచి 70 రూపాయల 79 పైసలకు కొని 90 నుంచి 95 రూపాయలకు ఇక్కడ అమ్ముతున్నారు. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న నార్త్ బీహార్‌లోని ప్రాంతాల్లో చాలా మంది రోజూ బైక్స్‌పై బోర్డర్ దాటి పెట్రోల్ అక్కడ తక్కువ ధరకు కొని, ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

    పెట్రోల్ బంకులతో పోల్చితే నాలుగైదు రూపాయలు తక్కువకే వస్తుండటంతో వాహనదారులు కూడా వీరి దగ్గరే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా అమ్ముకుంటున్న వారు రోజుకు తక్కువలో తక్కువగా రూ.2,500 సంపాదిస్తున్నారు. నేపాల్‌లో భారత వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపుకోకూడదన్న నిబంధన ఏమీ లేకపోవడంతో పలువురు ఈ అక్రమ పెట్రోల్ రవాణాను దందాగా మలుచుకున్నారు. పెట్రోల్ తక్కువ ధరకు వస్తుండటంతో నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉంటున్న చాలామంది భారతీయ వాహనదారులు అక్కడికి వెళ్లి పెట్రోల్ కొంటున్నారు. దీంతో.. నేపాల్ బోర్డర్‌లో ఉన్న జిల్లాలలో పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. నష్టాలను చవిచూస్తున్న పరిస్థితి నెలకొంది.

    నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో కూడా ఈ అక్రమ పెట్రోల్ రవాణా జోరుగా సాగుతోంది. అయితే.. చంపావత్ జిల్లా కలెక్టర్ వినీత్ తోమర్ మాట్లాడుతూ.. తమకు పెట్రోల్ అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, నేపాల్ సరిహద్దులోకి అనుమతించి వాహనదారులు లీగల్‌గా పెట్రోల్ కొనుక్కుంటే ఎలాంటి సమస్య ఉండదని ఆయన చెప్పారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. నేపాల్‌కు పెట్రోలియం ఉత్పత్తులు భారత్ నుంచే సరఫరా అవుతాయి.
    Published by:Sambasiva Reddy
    First published: