Home /News /national /

THE PECULIAR INCIDENT OF SPEED BREAKER INAUGURATION BY AAP MLA LED TO MASSIVE TROLLING ON TWITTER SSR

AAP MLA Speed Breaker: స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే.. నెటిజన్లు ఏ రేంజ్‌లో ఆడుకుంటున్నారంటే..

స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయల్

స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయల్

    న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు ఆయన వైఖరి పట్ల దుమ్మెత్తిపోస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఇంత ప్రభావం చూపుతున్న ఈ తరుణంలో ఆయన ఓ స్పీడ్ బ్రేకర్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అవును. మీరు విన్నది నిజమే. స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవానికే ఆయన వెళ్లారు. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు ఆప్ ఢిల్లీ ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయల్. ఆయన బుధవారం నాడు స్పీడ్ బ్రేకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు.. చేసిందేదో గొప్ప అయినట్టు తన ట్విట్టర్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు. స్పీడ్ బ్రేకర్‌ను ప్రారంభోత్సవానికి వెళ్లిందే కాకుండా పూర్తిగా కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి ఎమ్మెల్యే చుట్టూ దాదాపు 20 మందికి పైగా కార్యకర్తలు గుమిగూడటం గమనార్హం. అంతేకాదు.. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్లలో చాలామంది కనీస భౌతిక దూరం పాటించకుండా.. మాస్క్‌లు తీసేసి మరీ ఎమ్మెల్యేతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

    ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పబ్లిసిటీ కోసం చివరకు స్పీడ్ బ్రేకర్‌ను కూడా వాడుకుంటున్నారని.. ఢిల్లీలో అదేదో పెద్ద అభివృద్ధి జరిగినట్లు ఫొటోలకు ఫోజులివ్వడం, అదీ ఈ కరోనా సమయంలో అంతంత మంది ఒకే దగ్గర గుమిగూడటం సిగ్గుచేటన్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి ఆయన కోవిడ్ నిబంధనలను ఇలా తుంగలో తొక్కడమేంటని కొందరు నెటిజన్లు నిలదీస్తున్నారు. కొందరు నెటిజన్లయితే ఎమ్మెల్యేను ఉద్దేశించి ట్వీట్లలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తరువాత ఎమ్మెల్యే శివ్ చరణ్ పాల్గొనబోయే అభివృద్ధి కార్యక్రమం జీబ్రా లైన్ల ప్రారంభోత్సవమా అంటూ సెటైర్లేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Wife: సివిల్ ఇంజనీర్ భార్యకు ఇలాంటి చావా... రెండున్నరేళ్ల క్రితం పెళ్లి.. ఇంతలోనే ఇలా.. అసలేం జరిగిందంటే..

    ఇదిలా ఉంటే.. ఈ విమర్శలను పట్టించుకోని సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌరవనీయ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలో కోవిడ్-19 ఉపద్రవ సమయంలో కూడా మోతీ నగర్‌లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వేగంగా వచ్చే వాహనాలను అదుపులోకి ఉంచడానికి, ప్రమాదాలను నివారించడానికి ఈ టేబుల్‌టాప్ స్పీడ్ బ్రేకర్‌ను మోతీనగర్ రెడ్ లైట్ క్రాస్‌రోడ్‌లోని ‘ఫన్ సినిమా’ దగ్గర ఏర్పాటు చేసినట్లు మోతీ నగర్ ఆప్ ఎమ్మెల్యే శివ్ చరణ్ గోయల్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. స్పీడ్ బ్రేకర్ వ్యవహారం ఆప్‌కు తలనొప్పిగా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: AAP, Arvind Kejriwal, Delhi, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు