హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇంటి అద్దె చెల్లించలేదని దంపతులను కాల్చి చంపిన యాజమాని..

ఇంటి అద్దె చెల్లించలేదని దంపతులను కాల్చి చంపిన యాజమాని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంజయ్ డబ్బులు లేవని చెప్పడంతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన రాయ్ తుపాకీతో సంజయ్, అతడి భార్యపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి అద్దె చెల్లించలేదన్న కోపంతో దంపతులను కాల్చి చంపాడో ఇంటి యాజమాని. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అజామ్‌ఘర్ జిల్లా అహిరౌలాకు చెందిన సంజీవ్ అనే వ్యక్తి కోత్వాలీ నగరంలో ఆటో స్పేర్ పార్ట్ అమ్మే దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ నగరంలోనే రాకేశ్ రాయ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో దుకాణం తెరవకపోవడంతో డబ్బుల్లేక సంజయ్ ఇంటి అద్దె కట్టలేకపోయాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటి యాజమాని రాయ్ అతడిని అద్దె ఇవ్వాలని కోరాడు. సంజయ్ డబ్బులు లేవని చెప్పడంతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన రాయ్ తుపాకీతో సంజయ్, అతడి భార్యపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Crime, Gun fire, Uttar pradesh

ఉత్తమ కథలు