Ayodhya: అయోధ్యపై తీర్పు వచ్చింది... అయోధ్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో కేసు ఇది

Ayodhya | ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు నమోదైన కేసు ఇది. దీంతో పాటు మీడియా సిబ్బందిపై దాడి చేయడం, కెమెరాల్లాంటి విలువైన వస్తువుల్ని దోచుకోవడం లాంటి ఫిర్యాదులపై మరో 47 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యాయి.

news18-telugu
Updated: November 9, 2019, 11:39 AM IST
Ayodhya: అయోధ్యపై తీర్పు వచ్చింది... అయోధ్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో కేసు ఇది
Ayodhya: అయోధ్యపై తీర్పు వచ్చింది... అయోధ్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో కేసు ఇది (image: News18 Creative)
  • Share this:
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టు తీర్పు కోసం దేశమంతా ఎదురుచూసింది. అయితే అయోధ్యకు సంబంధించిన మరో కేసు లక్నో కోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఇది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసు. దీని వెనుక నేరపూరిత కుట్ర ఉందన్న ఆరోపణలున్నాయి. 27 ఏళ్ల దర్యాప్తులు, విచారణల తర్వాత లక్నో స్పెషల్ సీబీఐ కోర్టులో ఈ కేసు చివరి దశకు చేరుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన 49 మంది నిందితుల్లో కొందరు ఇప్పటికే చనిపోయారు. మిగతా వారు హై-ప్రొఫైల్ రాజకీయ నాయకులు, మాజీ డిప్యూటీ ప్రధాన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేబినెట్ మంత్రులు, ప్రస్తుతం పార్లమెంట్‌లో ఎంపీలుగా ఉన్న వ్యక్తులకు ఈ కేసుతో సంబంధం ఉంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన కొన్ని నిమిషాల్లోనే సాయంత్రం 5.15 గంటలకు గుర్తుతెలియని 'కరసేవకులపై' మొదటి ఎఫ్ఐఆర్ నెంబర్ 197/92 దాఖలైంది. క్రిమినల్ లా సవరణ చట్టంలోని సెక్షన్ 7, ఐపీసీలోని 395, 397, 332, 337, 338, 295, 297, 153ఏ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. 10 నిమిషాల తర్వాత రెండో ఎఫ్ఐఆర్ 198/92 రిజిస్టరైంది. ఐపీసీలోని 153ఏ, 153బీ, 505 సెక్షన్ల కింద ఎల్‌కే అద్వానీ, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, విష్ణు హరి దాల్మియా, సాధ్వి రితాంభరలపై కేసు నమోదైంది. ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు నమోదైన కేసు ఇది. దీంతో పాటు మీడియా సిబ్బందిపై దాడి చేయడం, కెమెరాల్లాంటి విలువైన వస్తువుల్ని దోచుకోవడం లాంటి ఫిర్యాదులపై మరో 47 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌లు దాఖలయ్యాయి.

కొన్ని రోజుల తర్వాత అప్పటి ప్రభుత్వం కేస్ నెంబర్ 197 ను సీబీఐ విచారణకు ఆదేశించింది. రాజకీయ నాయకులపై నమోదైన కేస్ నెంబర్ 198 ను ఉత్తరప్రదేశ్‌లోని సీబీ-సీఐడీ వింగ్‌కు బదిలీ చేశారు. 1993 ఆగస్ట్ 27న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు నెంబర్ 198 తో పాటు మిగతా 48 కేసుల్ని సీబీఐ విచారణకు ఆదేశించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులన్నింటిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. 1993 అక్టోబర్ 5న లక్నోలోని స్పెషల్ కోర్టులో 49 కేసుల్లో 40 మందిపై ఒకే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 1996 జనవరి 11న తొమ్మిది మంది ప్రముఖ వ్యక్తులపై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీంతో నిందితుల సంఖ్య 49 కి చేరింది. బాబ్రీ మసీదును కూల్చేందుకు అతిపెద్ద కుట్ర జరిగినట్టు తమ దగ్గర బలమైన, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సీబీఐ వాదించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు చెందిన పెద్దల పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో నేరపూరిత కుట్ర జరిగినట్టు కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు నిందితులు అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

నేరాలన్నీ ఒకే కుట్రలో భాగంగా జరిగినవి కాబట్టి అన్ని ఎఫ్ఐఆర్‌లకు ఒకే ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో ఎలాంటి తప్పులేదని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌ జస్టిస్ జగదీష్ భల్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే క్రైమ్ నెంబర్ 198/92 కు సంబంధించి ట్రయల్ కోర్ట్ నోటిఫికేషన్‌లో యూపీ ప్రభుత్వం చేసిన పాలనాపరమైన తప్పిదం కేసును తప్పుదోవ పట్టించింది. దీంతో తప్పిదాలను సరిచేయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది సీబీఐ. కొత్త నోటిఫికేషన్ తర్వాత విచారణ ప్రారంభిస్తామని సీబీఐ వెల్లడించింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. 2003 జనవరి 27న రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన అద్వానీతోపాటు మరికొందరిపై నమోదైన 198/92 కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించాలని కోరుతూ రాయ్‌బరేలీ కోర్టును ఆశ్రయించింది సీబీఐ. 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీ స్పెషల్ మెజిస్ట్రేట్ అద్వానీ పేరును 198/92 కేసు నుంచి తొలగించింది. అప్పుడు అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నారు.

2005 జూలై 6న అద్వానీని నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాయ్‌బరేలీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో అద్వానీపై మళ్లీ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో జూలై 26న రాయ్‌బరేలీ కోర్టు నిందితులందరిపై కేసు నమోదు చేసింది. 2012 మార్చి 20న అఫిడవిట్ దాఖలైంది. 49 కేసులపై ఒకే విచారణ జరపాలని సీబీఐ కోరింది. ఇలా ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో 300 మంది సాక్ష్యుల్ని విచారించారు. వారిలో 50 మంది చనిపోయారు. నిందితులు కూడా చనిపోయారు. ఈ కేసుపై ఇంకా తుది తీర్పు రావాల్సి ఉంది.

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులుఇవి కూడా చదవండి:Ayodhya Verdict: యూపీలో ఇంటర్నెట్ సేవలు బంద్... తాత్కాలిక జైళ్ల ఏర్పాటు

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్

Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి
Published by: Santhosh Kumar S
First published: November 9, 2019, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading