Home /News /national /

omicron cases in india: భారత్​లో 21కి చేరిన ఒమిక్రాన్ కరోనా​ కేసులు.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కేసులు

omicron cases in india: భారత్​లో 21కి చేరిన ఒమిక్రాన్ కరోనా​ కేసులు.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కేసులు

ఢిల్లీ ఎయిర్​పోర్టులో కరోనా పరీక్షలు చేస్తున్న సిబ్బంది (photo: ANI/Twitter)

ఢిల్లీ ఎయిర్​పోర్టులో కరోనా పరీక్షలు చేస్తున్న సిబ్బంది (photo: ANI/Twitter)

ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 17 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...
దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron)​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌ (India)లో కూడా ఒమిక్రాన్‌ (Omicron)టెర్రర్‌ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 17 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ (Rajasthan)​లో 9, మహారాష్ట్ర (Maharashtra)లో 7 , ఢిల్లీలో ఒక్క కేసు తాజాగా బయటపడ్డాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడలో ఆరు, పుణేలో ఒక్క కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 797 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.



రాజస్థాన్​లో తొమ్మిది కేసులు..

రెండ్రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఒమిక్రాన్‌ వేరియంట్‌. ఫస్ట్‌ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్‌ డే మరో రెండు.. గుజరాత్‌లో ఒకటి,  రాజస్థాన్​లో 9, మహారాష్ట్ర లోనే 8 , ఢిల్లీలో మరో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్థారణ (omicron cases in india) అయింది. టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి కొత్త వేరియంట్​ సోకింది. దీంతో దేశంలో 3 రోజుల్లోనే 21 ఒమిక్రాన్‌ కేసులు (omicron cases in india) నమోదయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్​, మహారాష్ట్రలో కేసుల పెరుగుదలపై అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.



జాగ్రత్త ముఖ్యమని..

ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Corona cases, Maharashtra, Omicron, Rajastan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు