హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Minister Daughter : మంత్రి కూతురు ప్రేమ వివాహం..పోలీసులని ఆశ్రయించిన జంట

Minister Daughter : మంత్రి కూతురు ప్రేమ వివాహం..పోలీసులని ఆశ్రయించిన జంట

TN Minsiter Sekar Babu Daughter : జయ కళ్యాణి, సతీశ్​ లు హిందూ సంప్రదాయం ప్రకారం బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లి అయిన అనంతరం దంపతులు బెంగళూరు సిటీ కమిషన్​ కార్యాలయానికి వెళ్లి.. తన తండ్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇంకా చదవండి ...

  Minister Daughter Lover Marriage :  తమిళనాడు మంత్రి శేఖర్ ​బాబు కూతురు జయ కళ్యాణి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. సోమవారం బెంగళూరులో సతీశ్​ అనే యువకుడితో మంత్రి కూతురు వివాహం జరిగింది. జయ కళ్యాణి, సతీశ్​ లు హిందూ సంప్రదాయం ప్రకారం బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లి అయిన అనంతరం దంపతులు బెంగళూరు సిటీ కమిషన్​ కార్యాలయానికి వెళ్లి.. తన తండ్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌ కు వినతి పత్రం సమర్పించారు.

  మంత్రి కూతiరు జయకళ్యాణి మీడియాతో మాట్లాడుతూ..." నేను సతీశ్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇవాళ మేము ​ పెళ్లి చేసుకున్నాము. మాది ప్రేమ వివాహం. మా ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. కొన్ని నెలల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని సతీశ్ ముందుకు వచ్చారు. అయితే తమిళనాడు పోలీసులు ఆయనని రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. దీని వెనుక మా నాన్న పాత్ర ఉందని అనుమానం ఉంది. ఇప్పుడు మేము మేజర్లం. ఈ పెళ్లి మా ఇద్దరి సమ్మతి మీదనే జరిగింది. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని మా తల్లిదండ్రులు బెదిరించారు. కాబట్టి మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాను"అని తెలిపారు. కాగా,మంత్రి శేఖర్ ​బాబు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కు అత్యంత సన్నిహితుడు.

  ALSO READ Russsia enemy countries : రష్యా శత్రుదేశాలు ఇవే..లిస్ట్ విడుదల చేసిన పుతిన్

  హిందూ కార్యకర్త భరత్ శెట్టి మాట్లాడుతూ... ఈ జంట వివాహం చేసుకోవడానికి సహాయం కోరుతూ సోషల్ మీడియాలో తమను సంప్రదించినట్లు చెప్పారు. దీంతో తాము హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుకను నిర్వహించామని, వారికి అమ్మాయి కుటుంబం నుండి ప్రాణహాని ఉందని, అందువల్ల వారు బెంగళూరు పోలీసులని భద్రత కోసం అభ్యర్థిస్తున్నారని ఆయన తెలిపారు

  First published:

  Tags: Bengaluru, Love marriage, Tamilnadu

  ఉత్తమ కథలు