మోటార్ వెహికల్ చట్టం 2019 : నిర్లక్ష్య డ్రైవింగ్‌కి తప్పదు భారీ మూల్యం..

Motor Vehicle Act 2019 : సెప్టెంబరు 1 నుంచి అమలులోకి వచ్చిన మోటారు వాహనాల చట్టం ద్వారా నిర్లక్ష్య డ్రైవింగ్‌కు భారీ జరిమానా తప్పదు.

news18-telugu
Updated: September 28, 2019, 1:34 PM IST
మోటార్ వెహికల్ చట్టం 2019 : నిర్లక్ష్య డ్రైవింగ్‌కి తప్పదు భారీ మూల్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొత్త మోటారు వాహనాల చట్టం రోడ్డుపై నిర్లక్ష్య వైఖరికి బ్రేకులు వేస్తోంది.ఆకతాయితనంతో రోడ్డుపై ఇష్టారీతిన వాహనం నడిపిస్తే.. ఈ సెప్టెంబరు నెల ఇప్పటినుంచి మిమ్మల్ని సరైన మార్గంలో పెడుతుంది.నిర్లక్ష్యమైన డ్రైవింగ్‌కు ఎందుకు స్వస్తి పలకాలి..? ఇతరుల ప్రాణాలను కాపాడటం కోసం అనే కారణం మీకు సంతృప్తికరంగా అనిపించకపోతే, కనీసం మీ డబ్బుని ఆదా చేయడానికైనా మీరు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు స్వస్తి పలకాలి. సెప్టెంబరు 1 నుంచి అమలులోకి వచ్చిన మోటారు వాహనాల చట్టం ద్వారా నిర్లక్ష్య డ్రైవింగ్‌కు భారీ జరిమానా తప్పదు.

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఇకపై 500 రూపాయల జరిమానా చెల్లించడం అనేది మరచిపోండి. లైసెన్స్ లేకుండా పట్టుబడితే 5,000 రూపాయల జరిమానా చెల్లించడానికి సిద్దంగా ఉండండి!
ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో లాగా రోడ్డుపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు జరిమానా తప్పదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేలు చెల్లించాల్సిందే. ఇది కొన్ని నెలల మీ డీజిల్ బిల్లుకు సమానం.

తాగిన హుషారులో స్నేహితులతో కలిసి డ్రైవింగ్ చేస్తున్నారా..? కానీ తాగడం అనేది సరదా కాదని గుర్తుంచుకోండి.
డ్రంకన్ డ్రైవ్‌కి ఇకపై రూ.10వేల జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష తప్పదు.

రోడ్డుపై రచ్చ చేసినా.. గొడవలకు దిగినా.. తోటి వాహనదారులతో గొడవపడ్డా.. ఇక నుంచి రూ.500 జరిమానా తప్పదు.ఇన్సూరెన్స్ మరిచిపోయారా..? ఇకపై ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2వేల జరిమానాతో
పాటు 3 నెలల జైలు శిక్ష అనుభవించే అవకాశం కూడా ఉంది.

గతంలో మొదటి తప్పు కింద రూ.100, ఆ తర్వాత వరుసగా నిబంధనలను అతిక్రమించినవారికి రూ.300
జరిమానా విధించినట్టయితే.. ఇప్పుడవి రూ.500,రూ.1500గా మారుతాయని గుర్తుంచుకోవాలి.
వాహనం నడిపే సమయంలో మీ దృష్టి రోడ్డుపై, చేతులు వాహనంపై ఉండడం మంచిది. ఏదైనా రహదారి నిబంధనలను ఉల్లంఘించినట్లయితే మీరు రూ.500 నుండి రూ.1,000 జరిమానా చెల్లించాలి.

రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారా..? అయితే రూ.2వేల జరిమానా తప్పదు.
కాబట్టి ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిది.

మీరు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగి, మిమ్మల్ని డ్రైవింగ్‌కు అనర్హులుగా చేస్తే రూ.10,000 భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

అతివేగం.. ఇంతకు ముందు పరిమితిని మించి వాహనాన్ని వేగంగా నడిపితే జరిమానా కేవలం రూ.400 మాత్రమే. కానీ ఇప్పుడు వేలల్లో జరిమానా విధించబడుతుంది. తేలికపాటి మోటారు వాహనానికి రూ.1,000 నుండి రూ. 2,000 వరకూ, ఒక మోస్తరు ప్రయాణీకుల
లేదా ఉత్పత్తుల రవాణా వాహనాలకు రూ.2,000 నుండి రూ. 4,000 వరకూ జరిమానా, ఇతర నేరాలకు లైసెన్సుని రద్దు చేయడం జరుగుతుంది.

మెంటల్&ఫిజికల్ ఫిట్‌నెస్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ. 1,000, అదే పునరావృతమైతే రూ.2000 జరిమానా తప్పదు.
తుంటరి వేషాలతో మీరు ఏదైనా ప్రమాదానికి కారణమైతే మీరు జైలుపాలు కావచ్చు. అలా మీ మొదటి నేరానికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ.5,000 జరిమానా. ఇదే పునరావృతమైతే మీకు రూ.10,000 జరిమానాతో పాటు ఒక ఏడాదిపాటు జైల్లో గడపాల్సి ఉంటుంది.
చట్టబద్దమైన అర్హత లేకుండా వాహనం నడపడం, బలవంతంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం.
ఇంతకుముందు లైసెన్స్ లేకుండా సరదాగా వాహనాన్ని నడిపితే జరిమానా కేవలం రూ.500 మాత్రమే, కానీ సెప్టెంబరు నుండి రూ.5,000 జరిమానా.
వెనుక సీట్లో ఉన్న ప్రయాణికులు కుడా ఇప్పుడు సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి.ముందు సీటులోని ప్రయాణికుల్లా వెనక సీటులోని ప్రయాణికులు (14 లేదా అంతకంటే ఎక్కువ) కుడా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రూ.1000 జరిమానా!
భారతదేశంలోని రహదారుల స్థితి, డ్రైవర్లు, రైడర్ల #ChaltaaHai (#nirlakshya) ధోరణిని బట్టి, ఎక్కువమంది ప్రయాణికుల #RoadToSafety (#Rahadaari bhadrata) కోసం కొత్త మోటారు వాహనాల చట్టం మరిన్ని మార్పులను తెస్తుంది.
జరిమానాల భయంతో నియమాలను పాటించడం కాకుండా, రోడ్లపై ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, పాదచారులకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడం కోసమే రహదారి భద్రత.

మీరు కూడా #RoadToSafety ప్రతిజ్ఞ చేసి రోడ్డు భద్రతా నియమాలు, https://www.firstpost.com/diageoroadtosafety/ని పాటిస్తున్నారని నిర్ధారించుకోండి
First published: September 28, 2019, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading