హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Explained: రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలు రద్దయ్యాయ్.. ఇకపై ఎవరైనా వేశారనుకోండి.. ఇలా చేయండి.

Explained: రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలు రద్దయ్యాయ్.. ఇకపై ఎవరైనా వేశారనుకోండి.. ఇలా చేయండి.

హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇలా చేయండి.

హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇలా చేయండి.

హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్‌ బిల్‌లో సర్వీస్‌ ఛార్జీ విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బిల్లు‌లో సర్వీస్‌ ఛార్జీ యాడ్‌ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.

ఇంకా చదవండి ...

హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్‌ బిల్‌ (Food Bill)లో సర్వీస్‌ ఛార్జీ (Service Charge) విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బిల్లు‌లో సర్వీస్‌ ఛార్జీ యాడ్‌ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల (Service Charge) విధింపునకు సంబంధించి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ చర్యలు తీసుకుంది. వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫిర్యాదు చేసేందుకు 1915 నంబర్‌కు కాల్ చేయవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

2020 జులైలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి, అమలు చేయడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి CCPAని తీసుకొచ్చారు. రెస్టారెంట్లు, హోటళ్ల ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడానికి సంబంధించి ఐదు ప్రధాన మార్గదర్శకాలను CCPA జారీ చేసింది. అవేంటంటే..

- ఏ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులో ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీని జోడించకూడదు.

- ఏ ఇతర పేరుతో వినియోగదారుల నుంచి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు.

- ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వినియోగదారుని సర్వీస్ ఛార్జీని చెల్లించమని బలవంతం చేయకూడదు, సర్వీస్ ఛార్జీని వినియోగదారులు స్వచ్ఛందంగా అందిస్తేనే తీసుకోవాలి.

- సర్వీస్‌ ఛార్జీ వసూలు ఆధారంగా సేవల ప్రవేశం లేదా సదుపాయంపై ఎటువంటి పరిమితి విధించకూడదు

- ఫుడ్‌ బిల్‌తో కలిపి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు.. ఈ మొత్తానికి జీఎస్టీ కూడా విధించకూడదు

ఇదీ చదవండి: నేవీ అగ్నిపథ్‌కు మహిళా అభ్యర్థుల నుంచి మంచి రెస్పాన్స్.. మూడు రోజుల్లోనే 10వేలకు పైగా దరఖాస్తులు


మార్గదర్శకాలను ఉల్లంఘించినప్పుడు వినియోగదారు ఏం చేయవచ్చు?

వినియోగదారుడు తన బిల్లులో సర్వీస్ ఛార్జ్ లెవీని గుర్తిస్తే.. ముందుగా, బిల్లు నుంచి సర్వీస్ ఛార్జీని తీసివేయమని హోటల్ లేదా రెస్టారెంట్‌కి సూచించవచ్చు. లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో ఫిర్యాదు చేయవచ్చు. 1915 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా NCH మొబైల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా వినియోగదారు కమిషన్‌కు లేదా edaakhil పోర్టల్, http://www.edaakhil.nic.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా CCPA ద్వారా విచారణ, తదుపరి చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును చేసే అవకాశం ఉంది. com-ccpa@nic.inకి ఇమెయిల్ పంపడం ద్వారా CCPAకి ఫిర్యాదు చేయవచ్చు.

* CCPA మార్గదర్శకాలను ఎందుకు జారీ చేసింది?

CCPA ముందుగా వినియోగదారులను అడగకుండా లేదా తెలియజేయకుండా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించే రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంది. జూన్ 2న, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం, హోటల్‌లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల విధింపుపై రెస్టారెంట్ అసోసియేషన్లు, వినియోగదారుల సంస్థలతో సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం తరువాత, సర్వీస్‌ ఛార్జీ విధించడాన్ని నిషేధించిన 2017 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఒక రోజు తర్వాత, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఛార్జీలు చెల్లించమని రెస్టారెంట్లు వినియోగదారులను అడగలేవని, ఇలా చేస్తే అసలు ధర ఏమిటో ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

* ఏ చట్టం ప్రకారం ఈ మార్గదర్శకాలు జారీ చేశారు?

CCPA వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 18 (2) (I) ప్రకారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు కేంద్రం 2017 మార్గదర్శకాలకు అదనంగా ఉన్నాయి, ఇవి హోటళ్లు, రెస్టారెంట్‌ల ద్వారా వినియోగదారులపై సర్వీస్‌ ఛార్జీని విధించడాన్ని నిషేధించాయి,

* రెస్టారెంట్లు, హోటళ్ళు ఏం చెబుతున్నాయి?

జూన్ 2న జరిగిన సమావేశంలో.. హోటల్, రెస్టారెంట్ పరిశ్రమ ప్రతినిధులు కేంద్రానికి ఒక రెస్టారెంట్ ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడం అనేది వ్యక్తిగత విధానానికి సంబంధించిన విషయం అని చెప్పారు. అలాంటి ఛార్జీ విధించడంలో చట్టవిరుద్ధం లేదని పేర్కొన్నారు. సర్వీస్ ఛార్జీపై పన్ను చెల్లించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కూడా వారు చెప్పారు.

First published:

Tags: Bar and restaurants, Food delivery, GST, Service charges

ఉత్తమ కథలు