THE NEW COUNCIL OF MINISTERS IS LIKELY TO BE DIFFERENT FROM THE OUTGOING TEAM WITH SOME NEW FACES IN CENTRAL CABINET NK
మోదీ కేబినెట్లో కొత్త ముఖాలు... అవకాశం దక్కేది ఎవరికంటే...
అమిత్ షా, నరేంద్ర మోదీ (ఫైల్)
PM Modi Cabinet : ఇదివరకటి కంటే ఎక్కువ మెజార్టీతో, ఎక్కువ ఉత్సాహంతో రెండోసారి అధికారాన్ని చేపట్టబోతున్న నరేంద్ర మోదీ... ఈసారి అత్యంత పవర్ ఫుల్ కేబినెట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది.
కేంద్రంలో అధికారం ఎవరిదో తేలిపోయింది. ఇక కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కుతాయో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకూ ఉన్న కేబినెట్ కాకుండా... ఈసారి ఏర్పడే కేబినెట్లో కొందరు పాతవారిని తొలగించి, కొత్తవారికి కూడా అవకాశం కల్పిస్తారని తెలిసింది. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా... తొలిసారి కేంద్ర కేబినెట్లో చేరబోతున్నట్లు తెలిసింది. మోదీ కేబినెట్లో అరుణ్ జైట్లీ అత్యంత కీలకమైనప్పటికీ... ఆయనకు అనారోగ్య ఉండటం వల్ల ఆయన్ని ఆర్థిక శాఖ నుంచీ తప్పిస్తారని తెలిసింది. ఆ పదవిని ఇదివరకు జైట్లీ... ట్రీట్మెంట్ కోసం వెళ్లినప్పుడు తాత్కాలికంగా నిర్వహించిన... ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కి ఇస్తారని తెలుస్తోంది. ఐతే... మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ సైతం అనారోగ్యంతో ఉన్నారు. ఆమె కూడా విదేశాంగ శాఖ మంత్రిగా ఉంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఆమె కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలంటే... కచ్చితంగా రాజ్యసభ సభ్యురాలవ్వాలి. అలాగే... రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను నియమిస్తే, అమిత్ షాకి హోంశాఖను ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదివరకు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... గుజరాత్ అమిత్ షా హోంమంత్రిగా చేశారు.
ప్రస్తుతం రక్షణ శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కి బీజేపీ పెద్దల నుంచీ ఫుల్ సపోర్ట్ ఉంది. ఐతే... సుష్మస్వరాజ్ విదేశాంగ శాఖ నుంచీ వైదొలగితే... ఆ శాఖను నిర్మలా సీతారామన్‌కి ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో... అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన, టెక్స్టైల్స్ శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఈసారి కేంద్ర కేబినెట్లో మరింత ఉన్నత మంత్రిత్వ శాఖను ఇస్తారని తెలుస్తోంది.
ఈసారి పట్నా సాహిబ్ నుంచీ లోక్ సభకు ఎన్నికైన న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కి కీలక శాఖ ఇస్తారని తెలుస్తోంది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అలాగే... మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్‌గా చేశారు.
ఎక్కువ శాఖల్ని నిర్వహిస్తున్న నితిన్ గడ్కరీ అన్నింటినీ సమర్థంగా నిర్వహించారన్న క్రెడిట్ దక్కించుకున్నారు. అందువల్ల ఆయన్ని అవే శాఖల్లో కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈసారి మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేబినెట్ ర్యాంక్ దక్కుతుందని తెలుస్తోంది. మోదీ అండ్ కోలో ముస్లిం వర్గాల నుంచీ నఖ్వీ కీలక నేతగా ఉన్నారు.
ధర్మేంద్ర ప్రదాన్, ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డా వంటి వారు కూడా కీలక నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారంతా కొత్త కేబినెట్లో కొనసాగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.