Home /News /national /

THE MODI STORY NEW WEBSITE PRESENTS UNTOLD INSPIRING STORIES ABOUT THE PRIME MINISTER MKS GH

Modi Story: పాల గిన్నె వైపు పిల్లాడి చూపు.. ఆకలి పసిగట్టిన మోదీ.. ఆనక జీవిత దృక్పథం మారింది..

మోదీ స్టోరీ వెబ్ సైట్

మోదీ స్టోరీ వెబ్ సైట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని విషయాలను, స్ఫూర్తిదాయకమైన కథనాలను అందిస్తోంది మోదీ స్టోరీ అనే వాలంటరీ వెబ్‌సైట్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని విషయాలను, స్ఫూర్తిదాయకమైన కథనాలను అందిస్తోంది ఒక వాలంటరీ వెబ్‌సైట్. కొందరు వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఈ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 'మోడీ స్టోరీ' (Modi Story) పేరుతో దీన్ని తాజాగా ప్రారంభించారు. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రధానమంత్రి జీవితాన్ని దగ్గరగా చూసిన వ్యక్తుల ప్రత్యక్ష సంఘటనలు, జ్ఞాపకాలను పొందుపరిచారు. ప్రధానితో సంబంధం ఉన్న ఫోటోలు, లేఖలు, రైటప్స్, ఆడియో లేదా విజువల్ స్టోరీస్‌ను సమర్పించాలని కూడా ఈ వెబ్‌సైట్‌ పిలుపునిచ్చింది.

కొత్త వెబ్‌సైట్ ట్విట్టర్ హ్యాండిల్‌ (modistory.in)ను కేంద్ర మహిళా, శిశుసంరక్షణ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ షేర్ చేశారు. ప్రధాని వ్యక్తిగత విషయాలు, ఆయన స్నేహపూర్వక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చర్చలు, నిర్ణయాత్మక రాజకీయ వ్యక్తిత్వం, ఇప్పటి వరకు మనకు తెలియని, మనం వినని కథలు, కథనాలు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉంటాయని తెలిపారు.

Ola Electric Scooter: ఎండకే మండిందా? తయారీ లోపమా? -ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఘటన ఎలా? -Video


ఈ వెబ్‌సైట్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘వాలంటీర్ గ్రూప్ చేసిన ఈ చొరవను చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణం, ప్రజా జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు, కథనాలను ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.’ అని ఠాకూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ అనే వ్యక్తి.. 1980లలో ప్రధానమంత్రితో ప్రయాణించినప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని పంచుకున్నారు. డాక్టర్ రావల్ ప్రధాన మంత్రిని ‘బడుగుల అభ్యున్నతికి, సమాజంలో చివరి వ్యక్తి ఉన్నతికి మీరు ఎలా కట్టుబడి ఉన్నారు?’ అని అడిగారు. దానికి మోదీ బదులిస్తూ.. తాను ఒక స్వయంసేవక్ ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

Zomato: జొమాటోకు షాక్.. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా సాధ్యం? ట్రాఫిక్ పోలీసుల నోటీసులు


‘నేను ఒకప్పుడు స్వయంసేవక్ ఇంటికి వెళ్ళాను. అది జుగ్గీ. జుగ్గీలో అతని భార్య, పిల్లలతో కలిసి స్వయంసేవక్ నివసించేవారు. వారు ఒక థాలీలో నాకు సగం భజ్రా రోటీ, ఒక రొట్టె వడ్డించారు. చిన్న గిన్నె పాలు ఇచ్చారు. తల్లి ఒడిలో కూర్చున్న పిల్లాడు పాల గిన్నె వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఆ పాలు పిల్లాడి కోసమేనని నాకు అర్థమైంది. సగం రోటీ నీళ్లతో తిని పాలు వదిలేశాను. ఆ పాల గిన్నెను తల్లి పిల్లవాడికి ఇచ్చింది. బాబు ఆత్రంగా ఆ పాలు తాగాడు. దీంతో నా కళ్లలో నీళ్ళు తిరిగాయి. అప్పుడే సమాజంలో చివరి వ్యక్తి ఉన్నతి కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాను.’ అని మోదీ చెప్పినట్టు ఈ వెబ్‌సైట్‌లో డాక్టర్ రావల్ గుర్తు చేసుకున్నారు.

CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!


ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని మోదీ సిక్కు వేషం వేసుకున్నారని గుజరాత్ వాసి రోహిత్ అగర్వాల్ చెప్పారు. పోలీసులకు పట్టుబడకుండా తృటిలో ఎలా తప్పించుకున్నారనే విషయాన్ని ఆయన వివరించారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌లో మోదీతో అనుబంధం ఉన్న, ఆయన గురించి తెలిసిన వ్యక్తులు పంచుకున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Modi, Narendra modi, New website, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు