• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • THE MINISTRY OF FINANCE EXTENDED THE INSURANCE RENEWAL DATES TO APRIL 21 BN

పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఆర్థిక శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే..

పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఆర్థిక శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

హెల్త్, వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీల గడువును పొడగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు రెన్యూవల్ గడువు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

  • Share this:
    పాలసీదారులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో వెహికల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లుబాటును ఏప్రిల్ 21వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల వల్ల పాలసీదారులు తమ ఇన్సూరెన్స్‌లను రెన్యూవల్ చేసుకోకలేకపోతున్నారు. దీంతో లాక్‌డౌన్ సమయంలో ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీలు వచ్చే వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

    దీంతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు ఇన్సూరెన్స్‌లు రెన్యూవల్ చేసుకోవాల్సిన వారికి భారీ ఊరట కలిగింది. ఇదిలావుంటే.. పాలసీదారులు తమ ప్రీమియాన్ని ఏప్రిల్ 21 లేదా అంతకంటే ముందే చెల్లించుకోవచ్చని పేర్కొంది. చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ బీమా కవరేజీని కొనసాగించాలని, 2020 ఏప్రిల్ 21ని ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీగా లెక్కలోకి తీసుకోవాలని సూచించింది.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు