ఫలితాల తర్వాతే మాట్లాడుకుందాం...యూఏపీకు స్టాలిన్ షాక్?

గ్జిట్ పోల్స్‌ని పట్టించుకోనని చెబుతూనే...ఎవరి పక్షాన ఉండేది మే 23 తర్వాతే స్పష్టంచేస్తామనడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీకి చేరవవుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

news18-telugu
Updated: May 20, 2019, 2:04 PM IST
ఫలితాల తర్వాతే మాట్లాడుకుందాం...యూఏపీకు స్టాలిన్ షాక్?
డీఎంకే నేత స్టాలిన్
  • Share this:
కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వానిదే అధికారమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టంచేశాయి. సుమారు 300 పైచిలుకు స్థానాలు కమలం కూటమికి వస్తాయని జోస్యం చెప్పాయి. ఐతే మరోవైపు బీజేపీ వ్యతిరేక పక్షాలు మాత్రం వరుస భేటీలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించే వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో యూపీఏ పక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రలో ఏ కూటమిలో చేరేది ఫలితాల తర్వాతే నిర్ణయిస్తాం. మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. ఇప్పుడే ఢిల్లీలో పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదు. ఫలితాల తర్వాత సమావేశాలు జరిపితే ఓ ప్రయోజనం ఉంటుంది.
స్టాలిన్, డీఎంకే ప్రెసిడెంట్
డీఎంకే ప్రస్తుతం యూపీఏలో భాగస్వామ్యంగా ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ఐతే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎగ్జిట్ పోల్స్‌ని పట్టించుకోనని చెబుతూనే...ఎవరి పక్షాన ఉండేది మే 23 తర్వాతే స్పష్టంచేస్తామనడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీకి చేరవవుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే జరిగితే యూపీఏకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు