హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi@8: మోదీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి.. 2014 ముందు ఇలా ఉండేది కాదన్న బీరేన్ సింగ్..

Narendra Modi@8: మోదీ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి.. 2014 ముందు ఇలా ఉండేది కాదన్న బీరేన్ సింగ్..

మోదీతో మణిపూర్ సీఎం

మోదీతో మణిపూర్ సీఎం

దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించి 8 సంవత్సరాలు పూర్తవుతోంది.

దేశంలో భారతీయ జనతా పార్టీ(BJP) ఆధ్వర్యంలోని ఎన్డీఏ(NDA) కూటమి ప్రభుత్వం(Government) ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రధాని బాధ్యతలు స్వీకరించి 8 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు, మణిపూర్ ముఖ్యమంత్రి(Manipur Chief Minister) ఎన్ బీరెన్ సింగ్ ఈశాన్య రాష్ట్రాలపై మోదీ(Modi) ప్రభుత్వ ప్రభావంతో పాటు ప్రధానితో సన్నిహిత్యం, పర్సనల్ ఇంటరాక్షన్స్(Interaction) గురించి న్యూస్18తో(News18) ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం..

నరేంద్ర మోదీతో కలిసి పని చేయడం ఎలా ఉంది?

మన ప్రధానమంత్రి భిన్నమైన నాయకుడు. ఆయన ఒక లెజెండరీ లీడర్. బీజేపీలోకి రాకముందు నేను ఇతర నేతలతో కలిసి పనిచేశాను, కానీ ఆయన చాలా భిన్నంగా ఉంటారు. వేరే నేతలకు మోదీకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మోదీ ఆలోచనలను సృష్టిస్తారు. వాటిని మనతో పంచుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పని చేయరు. మోదీజీ ఆలోచనలు సామాన్యులు, బహుజనుల కోసమే లక్ష్యంగా ఉంటాయి.

2014 తర్వాత తూర్పు, ఈశాన్య ప్రాంతాలపై కేంద్రం ఎక్కువ దృష్టి సారించిందని భావిస్తున్నారా?

చాలా మంచి ప్రశ్న. ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేను ఇంతకు ముందు ఎదుర్కొన్న, ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మోదీజీ రాక కంటే ముందు భారతీయులు మమ్మల్ని చిన్నచూపు చూశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఏదో చెప్పాలనుకునేవాళ్లం. కానీ ఈరోజు ఇచ్చినట్లుగా అప్పట్లో మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తే.. నాకు ఏది కావాలన్నా, అందరూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Narendra Modi@8: ఎన్డీఏ ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు.. మోదీ ప్రారంభించిన ఎనిమిది ముఖ్య పథకాలు ఇవే..


ఉదాహరణకు, 2017లో రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను ఢిల్లీకి వెళ్లాను. అభివృద్ధి పనుల గురించి ప్రధానితో చర్చించాను. ఆయన ‘ఘర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రకటించారు. ఆ సమయంలో రూ.3,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రతిపాదన లభించింది. మణిపూర్ లాంటి రాష్ట్రానికి రూ.3,500 కోట్లు పెద్ద ప్రతిపాదన. ఇంత మొత్తం నిధులు విడుదల చేస్తారని మేం ఊహించలేదు. సమావేశం ముగిసిన తరువాత ప్రధానమంత్రి సీనియర్ సెక్రటరీతో మాట్లాడారు. ఒక వారంలో మాకు క్లియరెన్స్ వచ్చింది. ఏడు నెలల్లో ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం.

అంటే ఈశాన్య ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తోంది?

మేము ఇప్పుడు గర్వించదగిన భారతీయులం. ఇంతకుముందు మమ్మల్ని సరిగా పట్టించుకోలేదు. ఇంతకుముందు కేంద్ర మంత్రుల బాడీ లాంగ్వేజ్ చూస్తేనే.. వారు మమ్మల్ని చిన్నచూపు చూసేవారని స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. మోదీజీ ఈశాన్య ప్రాంతాలను తన కుటుంబంగా భావిస్తారు. గత ఏడెనిమిదేళ్లలో మోదీజీ ఈశాన్య రాష్ట్రాల్లో 50 సార్లకు పైగా పర్యటించారు. ప్రధానమంత్రిగా ఉండి, చాలాసార్లు మా రాష్ట్రాలను సందర్శించడం, ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రతి రోజూ వచ్చి ఏం కావాలి అని అడగడం వల్ల.. మేమంతా ఒకే కుటుంబం అనే భావన కలుగుతోంది.

ప్రధాని మోదీ గురించి మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయం చెప్తారా?

ఈశాన్య ప్రజల పట్ల ఆయనకు చాలా శ్రద్ధ ఉంది. మోదీ మణిపూర్ సంస్కృతిని జాగ్రత్తగా చూసుకున్నారు. మీకు లీరమ్ ఫీ (leirum phee- సాంప్రదాయ మణిపురి టవల్) అంటే తెలుసా? నేను ఢిల్లీ వెళ్లి ఆయనకు లీరమ్ ఫీ బహుకరించినప్పుడు, ‘సార్, ఇది ముఖ్యమైనది’ అని చెప్పాను. గంగలో పుణ్యస్నానం చేస్తున్నప్పుడు ఆయన దాన్ని ధరించడం మనం చూశాం. మా లీరమ్ ఫీ గురించి తనకు తెలుసని, ఇది భారతదేశం గర్వించదగ్గ సంస్కృతి అని మోదీ చెప్పారు. అది చాలా బాగుందని చెప్పారు. నేను ఈ విషయాన్ని చాలా గొప్పగా భావించాను. మణిపూర్ క్రీడా ప్రముఖులను ఆయన ప్రశంసించిన విధానం చాలా బాగుంది. మోదీ దార్శనికుడు, ఆయన అందరికంటే భిన్నంగా ఉంటారు.

సంక్షోభ పరిస్థితుల్లో సీనియర్‌గా ఎలా పనిచేశారు?

మణిపూర్ చిన్నది కానీ సంక్లిష్టమైనది. నేను క్లిష్టమైన సమస్యలను ప్రస్తావించినప్పుడు, ఆయన నా మాట వింటారు, మాకు మార్గనిర్దేశం చేస్తారు. రోడ్‌మ్యాప్‌లను విశ్లేషిస్తారు. ఒకసారి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. నేను దాని గురించి ఆయనకు చెప్పాను. ఆయన చాలా ఓపికగా విన్నారు. ‘బీరెన్, మీ డిమాండ్ సరైనదే. అమిత్ షా తో మాట్లాడండి’ అని మోదీ నాకు మార్గనిర్దేశం చేశారు. ఆ తర్వాత 'మీరు అమిత్ భాయ్‌ని కలిశారా? ఆయన్ను కలవండి, విషయం గురించి అమిత్ షాకు స్పష్టంగా తెలుసు.’ అని మరోసారి చెప్పారు. తర్వాత నేను అమిత్ జీ దగ్గరకు వెళ్లాను. ఇది ఒక కుటుంబం వంటిది.

MonkeyPox : మహమ్మారిలా మంకీపాక్స్ -గాలి ద్వారా వ్యాప్తి? -క్వారంటైన్ విధిస్తూ బెల్జియం సంచలనం


మీరు మోదీ ప్రభుత్వానికి ఎలాంటి స్కోర్ ఇస్తారు?

వంద శాతం కంటే ఎక్కువ మార్కులు ఇస్తాను. మీరు ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలో మార్పులను చూస్తున్నారు. మణిపూర్ ఎలా మారిపోయిందో చూడండి.. AFSPAకి ఇన్నర్ లైన్ పర్మిట్ తగ్గింది. కేవలం జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం మాత్రమే దీని పరిధిలో ఉంది. అండమాన్‌లో మణిపూర్‌ అమరవీరులను సన్మానించారు. మణిపురీల మనోభావాలను మోదీ స్పృశించారు. ఆయన 100 కంటే ఎక్కువ మార్కులకు అర్హుడు. గతంలో చాలా విషయాల్లో మేం సిగ్గుతో తలదించుకునేవాళ్లం, ఇప్పుడు ఆయన వల్ల మేము భారతీయులమని గర్విస్తున్నాం.

ప్రధానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?

నేను నిజంగా ప్రధానమంత్రి, ఆయన బృందాన్ని అభినందించి, గౌరవించాలనుకుంటున్నాను. మోదీజీ లాంటి నాయకులు దొరకడం చాలా కష్టం కాబట్టి ఆయన 15 ఏళ్లకు పైగా అధికారంలో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అంతర్జాతీయంగా మనల్ని నడిపించగల ఏకైక నాయకుడు ఆయనే. ఆయన ప్రధానిగా కొనసాగితే మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుంది.

First published:

Tags: Manipur, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు