7200 మంది ఖైదీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అందులో భాగంగానే ఇప్పటివరకు 7200 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదలయ్యారు. జైళ్లలో ఎక్కువ ఖైదీలు ఉన్న నేపథ్యంలో వారిని విడుదల చేయాలంటూ ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గనిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 17, 2020, 6:10 PM IST
7200 మంది ఖైదీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేయాలని భావించింది. అందులో భాగంగానే 7200 మంది ఖైదీలను విడుదల చేశారు. ఇప్పటికే జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచుతున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆ ఖైదీలకు భద్రత కల్పించడం, ఆహారం అందించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఖైదీలను తాత్కాలిక బెయిల్, పెరోల్‌పై ఖైదీలను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఇప్పటివరకు 7200 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదలయ్యారు. జైళ్లలో ఎక్కువ ఖైదీలు ఉన్న నేపథ్యంలో వారిని విడుదల చేయాలంటూ ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గనిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం మేరకు ఏడేళ్లు, అంతకన్న తక్కువ శిక్ష పడిన ఖైదీలు మహారాష్ట్రలో 11 వేల మంది ఉండగా, వారందరినీ తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయనున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ కన్నా ముందు 60 జైళ్లలో దాదాపు 35 వేల మంది ఖైదీలుండగా, వీరిలో 7200 మందిని విడుదల చేశారు.
First published: May 17, 2020, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading