Home /News /national /

THE KOLKATA HIGH COURT HAS DIRECTED THE CENTER TO FILE AN AFFIDAVIT ON THE DISAPPEARANCE OF NETAJI SUBHASH CHANDRA BOSE PRV

 Netaji Subhash Chandra Bose death: నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఎప్పుడు చనిపోయాడో చెప్పండంటూ కోల్​కతా హైకోర్టులో పిటిషన్​

సుభాష్​ చంద్రబోస్​

సుభాష్​ చంద్రబోస్​

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం కేసు పశ్చిమ బెంగాల్​లో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నేతాజీ బతికే ఉన్నారా.. లేదా చనిపోయారా? దీనిపై సోమవారం కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్య్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ (Gandhi) మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం (Netaji Subhash Chandra Bose death) ఇప్పటికీ ఒక రహస్యంగా (Mystery) మిగిలిపోయింది.

    నేతాజీ అదృశ్యం (Netaji Subhash Chandra Bose missing) మిస్టరీపై అనేక విచారణ కమిషన్లు ఏర్పాటయ్యాయి. చివరి విచారణ కమిషన్ ముఖర్జీ కమిషన్. తైహోకూర్ విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణాలు (Netaji Subhash Chandra Bose death) కోల్పోయారని గతంలో ఖోస్లా కమిషన్, షానవాజ్ కమిషన్ పేర్కొన్నాయి. కానీ ముఖర్జీ కమిషన్ దానిని వ్యతిరేకించింది. మనోజ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్, సుభాష్ చంద్రబోస్‌గా చెప్పబడుతున్న రెంకోజీ ఆలయ అస్థికలు వాస్తవానికి జపాన్ సైనికుడికి చెందినవని పేర్కొంది. విమానం కూలిపోయిన రోజు తైపీలో ఏ విమానమూ కూలిపోలేదని తైపీ ప్రభుత్వం తెలిపింది. అయితే నేతాజీ అదృశ్యం కేసు పశ్చిమ బెంగాల్​లో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారా.. లేదా చనిపోయారా (Netaji Subhash Chandra Bose death)? దీనిపై సోమవారం కోల్​కతా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసును స్వీకరించిన కోల్​కతా హైకోర్టు (Kolkata high court) అఫిడవిట్ (Affidavit) దాఖలు చేయాలని కేంద్రాన్ని (Center) ఆదేశించింది. కేంద్రం ఈ అఫిడవిట్‌ను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. నేతాజీ  ఇంకా బతికే ఉన్నారా లేదా చనిపోయారా అంటూ దాఖలైన ఈ కేసులో తమకు సమాధానం కావాలని ప్రధాన న్యాయమూర్తి డివిజన్‌ ​​బెంచ్‌ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఎనిమిది వారాల గడువు ఇచ్చింది.

    కోల్​కతా హైకోర్టు (Kolkata high court)లో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)లో భారతదేశం గర్వించదగ్గ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికే ఉన్నారా.. చనిపోయారా.. అనే ప్రశ్నకు ఏ ప్రభుత్వం కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయిందని హరేన్ బాగ్చి ప్రశ్నించారు.

    హరేన్ బాగ్చీ పిటిషన్‌తో పాటు, భారత కరెన్సీలో నేతాజీ చిత్రాన్ని ఉపయోగించవచ్చా.. లేదా అనే విషయాన్ని కూడా కోర్టు పరిశీలించాలని కోరారు. కేంద్రం తన వైఖరిని వెంటనే తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ ఆదేశించారు. ఎనిమిది వారాల్లోగా దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం ఉందో కేంద్రం అఫిడవిట్‌తో తెలియచేయాలని సూచించారు.

    నేతాజీ అదృశ్యంపై ముఖర్జీ కమిషన్ విచారణ..

    కాగా, 1999లో నేతాజీ అదృశ్యంపై విచారణ జరిపిన ముఖర్జీ కమిషన్ వివిధ దేశాలకు చెందిన వందలాది ఫైళ్లను పరిశీలించి జపాన్, రష్యా, తైవాన్‌లను సందర్శించింది. అయితే, అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ పరిశీలనలను గుర్తించలేదు. నవంబర్ 8, 2005న, ముఖర్జీ కమిషన్ ఈ విషయంపై ఒక నివేదికను సమర్పించింది. 2006 మే 16న పార్లమెంటులో జరిగిన చర్చ తర్వాత ఇది తిరస్కరించబడింది. 1941 ఆగస్ట్‌ 18న నేతాజీ విమాన ప్రమాదంలో మరణిస్తే.. వారం రోజుల తర్వాత ఆయన సోవియట్‌లోకి ఎలా వెళ్లారు? నేతాజీ మరణం మిస్టరీపై దేశాన్ని ఉలిక్కిపడేలా చేసే చారిత్రక ఆధారం ఇది. ఎవరికీ సాధ్యం కాని అంశాన్ని పూరబీ రాయ్‌ ఛేదించారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: High Court, Kolkata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు