Kerala: వంట పాత్రలో పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్న వధూవరులు.. ఎందుకో తెలుసా?

పెళ్లి మండపానికి వెళుతున్న వధూవరులు

కేరళలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి (marriage) హాట్​ టాపిక్​ అయింది. వర్షంలోనూ రోడ్లన్నీ (roads) మునిగిపోయినా కూడా పెళ్లి మండపానికి (marriage hall) చేరుకుని పెళ్లి చేసుకున్నారు. ఏంటీ నీటిలో వెళ్లి పెళ్లి చేసుకోవడం కూడా వింతేనా అంటారా? అవును.. కానీ.. వాళ్లు పెళ్లి మండపానికి వెళ్లిన తీరే కొంచెం వింత.

  • Share this:
    నైరుతి రుతుపవనాల వల్ల దేశమంతటా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తాయి. ప్రతి ఏటా మొదటగా కేరళ (Kerala) ను తాకి అనంతరం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఈ రుతుపవనాలు (Monsoons) వ్యాపిస్తాయి. అనంతరం తిరుగుముఖం పడతాయి. అయితే, ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా తిరోగమించిన కారణంగా కేరళ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే కేరళలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి (marriage) హాట్​ టాపిక్​ అయింది. వర్షంలోనూ రోడ్లన్నీ (roads) మునిగిపోయినా కూడా పెళ్లి మండపానికి (marriage hall) చేరుకుని పెళ్లి చేసుకున్నారు. ఏంటీ నీటిలో వెళ్లి పెళ్లి చేసుకోవడం కూడా వింతేనా అంటారా? అవును.. కానీ.. వాళ్లు పెళ్లి మండపానికి వెళ్లిన తీరే కొంచెం వింత. ఎలా వెళ్లారో తెలుసుకుందాం..

    అల్యూమినియం వంట పాత్రలో..

    కేరళలో వరదలు పోటెతుత్తున్నగానీ ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు (health workers)  ఐశ్వర్య (Aishwarya), ఆకాష్ (aakash)లు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వరద (floods)లోనే వారు కల్యాణ మండపానికి చేరుకున్నారు. పెద్ద అల్యూమినియం వంట పాత్ర (aluminum cooking pot )లో పెళ్లి కొడుకు (groom), పెళ్లి కూతురు (bride) వివాహ వేదికకు చేరుకున్నారు. సమీపంలోని ఆలయం పక్కనే ఉన్న తలవాడిలో వరద (floods)తో నిండిన హాలులోకి ప్రవేశించారు. పరిమిత సంఖ్యలో ఉన్న బంధువుల మధ్య ఐశ్వర్య (Aishwarya), ఆకాష్ (aakash)పెళ్లి చేసుకున్నారు. వారు అల్యూమినియం పాత్రలో వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (social media)లో వైరల్ అయింది.

    చెంగనూరులో ఆసుపత్రిలో..

    వధువు, వరుడు చెంగనూరులోని ఒక ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలు (health workers)గా పని చేస్తున్నారు.సోమవారం వివాహం చేసుకోవాలని నిర్ణయించామని, ఇది శుభకార్యం కాబట్టి అడ్డంకులు చూడకుండా ముందుకు సాగాలని అనుకున్నామని నూతన జంట (young couple) తెలిపింది. ఇంకా ఆలస్యం చేయకూడదని భావించామని వారు చెప్పారు. కొన్ని రోజుల క్రితం దేవాలయానికి (temple) వచ్చినప్పుడు నీరు లేదని, అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రదేశం జలమయమైందన్నారు.

    భారత వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం..

    భారత వాతావరణ శాఖ (IMD) అక్టోబరు 10న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తుఫాను కారణంగా అక్టోబరు 12 నుంచి 14 తేదీల్లో కేరళ, మాహేల్లో భారీగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు దేశంలోని వాయువ్య ప్రాంతాల నుంచి తిరుగుముఖం పట్టాయని తెలిపింది. ఫలితంగా కేరళలో ఆరు జిల్లాలకు ప్రమదా హెచ్చరికలు జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్, దక్షిణ, మధ్య కేరళ ప్రాంతం వర్షంతో దెబ్బతిన్నాయి
    Published by:Prabhakar Vaddi
    First published: