దేశీ మైకెల్ జాక్సన్... సోషల్ మీడియా సెన్సేషన్...

పాప్ రారాజు మైకెల్ జాక్సన్ స్టెప్స్ వెయ్యాలంటే అంత ఈజీ కాదు. దానికి ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. మరి ఆ కుర్రాడు ఎలా దించేస్తున్నాడు? ప్రతీ స్టెప్పునూ జాక్సన్‌ లాగే ఎలా వేయగలుగుతున్నాడు?

news18-telugu
Updated: January 18, 2020, 6:48 AM IST
దేశీ మైకెల్ జాక్సన్... సోషల్ మీడియా సెన్సేషన్...
దేశీ మైకెల్ జాక్సన్... సోషల్ మీడియా సెన్సేషన్... (credit - tiktok)
  • Share this:
మైకెల్ జాక్సన్ ఏ స్టెప్పూ వెయ్యకుండానే ఫ్యాన్స్ ఉర్రూతలూగుతారు. అలా ఓ కాలు కదిపితే చాలు... కాన్సర్ట్ హోరెత్తిపోతుంది. అలాంటిది మైకెల్ జాక్సన్‌ లాగే స్టెప్స్ వేస్తూ... టిక్ టాక్ మొత్తాన్నీ ఊపేస్తున్నాడు రాజస్థాన్... జోధ్‌పూర్‌కి చెందిన యువరాజ్ సింగ్ పరిహార్. ఇతని స్టెప్స్ చూసి... బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్... ఎవరీ స్మూతెస్ట్‌ ఎయిర్‌వాకర్‌ అని కామెంట్ చేశాడు. బిగ్ బీ అమితాబ్‌ సైతం సరిలేరు నీకెవ్వరు అనడంతో... ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు. ఇటీవల చాలా మంది తమ టాలెంట్ చూపించేందుకు టిక్ టాక్, యూట్యూబ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్లను ఎంచుకుంటున్నారు. యువరాజ్ సైతం... టిక్ టాక్‌ని ఎంచుకున్నాడు. తనను తాను బాబా జాక్సన్‌గా చెప్పుకుంటూ... అద్భుతమైన వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో... సోషల్ మీడియాను ఊపేస్తోంది.


జనరల్‌గా బాలీవుడ్‌లో అద్భుతమైన డాన్సర్‌గా హృతిక్ రోషన్‌కి పేరుంది. అలాంటి ఆ హీరోనే... యువరాజ్ స్టెప్పులకు ఫిదా అయ్యాడు. తాను చూసిన డాన్సర్లలో ఇతడే స్మూతెస్ట్ ఎయిర్ వాకర్ అనేశాడు. దాంతో ఈ వీడియోని 10 లక్షల మందికి పైగా చూశారు. లైక్స్ 50వేలు దాటేశాయి. అమితాబ్‌తోపాటూ... రవీనా టాండన్, టైగర్ ష్రాఫ్ వంటి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు... అతన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తనకు అంత స్టార్‌డమ్ వస్తుందని ఊహించలేదంటూ... ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు యువరాజ్. తనను మెచ్చుకుంటున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నాడు. నిజానికి యువరాజ్... డాన్సర్ అవ్వాలనుకోలేదు. బాక్సర్ అవ్వానుకున్నాడు. ఐతే... అది అంతగా కలిసి రాలేదు. సన్నగా ఉన్న అతడు... బాక్సర్‌గా సెట్ కాలేను అనుకున్నాడు. అదే సమయంలో... డాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. యూట్యూబ్ చూసి... మైకెల్ జాక్సన్ స్టెప్స్ నేర్చుకున్నాడు. ఇందుకు అతని తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పుడు వరల్డ్ ఆఫ్ డాన్స్ ప్రోగ్రామ్‌లో తన టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు యువరాజ్. సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నాడు.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు