Home /News /national /

THE INTENSE COMPETITION BETWEEN THOSE THREE THE 5G SPECTRUM AUCTION IS GOING ON LIKE YOU OR ME HOW MANY LAKHS OF CRORES HAVE COME UMG GH

5G Auction: ఆ ముగ్గురి మధ్యే తీవ్ర పోటీ.. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న 5G స్పెక్ట్రమ్ వేలం.. ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే !

 ఆ ముగ్గురి మధ్యే తీవ్ర పోటీ..  నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న 5G స్పెక్ట్రమ్ వేలం .. ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే !

ఆ ముగ్గురి మధ్యే తీవ్ర పోటీ.. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న 5G స్పెక్ట్రమ్ వేలం .. ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే !

ఇండియాలో 5G సేవలు అందించేందుకు మంగళవారం నుంచి 5G స్పెక్ట్రమ్‌(5G Spectrum) వేలం(Auction) నిర్వహిస్తున్నారు. ఇందులో దిగ్గజ వ్యాపారులు ముఖేష్ అంబానీ, సునీల్ భారతీ మిట్టల్, గౌతమ్ అదానీ తదితరులు పాల్గొన్నారు. వేలం ప్రారంభ రోజున సుమారు రూ.1.45 లక్షల కోట్లు బిడ్ వేశారు. వేలం మొదటి రోజు రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయని చెప్పారు.

ఇంకా చదవండి ...
ఇండియాలో 5G సేవలు అందించేందుకు మంగళవారం నుంచి 5G స్పెక్ట్రమ్‌(5G Spectrum) వేలం(Auction) నిర్వహిస్తున్నారు. ఇందులో దిగ్గజ వ్యాపారులు ముఖేష్ అంబానీ, సునీల్ భారతీ మిట్టల్, గౌతమ్ అదానీ(Goutam Adani) తదితరులు పాల్గొన్నారు. వేలం ప్రారంభ రోజున సుమారు రూ.1.45 లక్షల కోట్లు బిడ్ వేశారు. వేలం మొదటి రోజు అంచనాలకు మించి స్పందన కనిపించింది. వేలం ద్వారా 2015లో రూ.1.09 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ప్రస్తుతం ఆ రికార్డులను ఆదాయం అధిగమిస్తుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

2016, 2021 వేలంలో ఎవ్వరూ ఆసక్తి చూపని 700 MHz బ్యాండ్ కూడా ఈసారి బిడ్‌లను అందుకుంది. టెలికాం డిపార్ట్‌మెంట్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రతిష్టాత్మకమైన 700 MHz బ్యాండ్‌కు వేలం మొదటి రోజున రూ.39,270 కోట్ల ప్రొవిజనల్‌ బిడ్‌లు వచ్చాయి. అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మిట్టల్‌కి చెందిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ సంస్థ 5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్నాయి. 5G అల్ట్రా-హై స్పీడ్ (4G కంటే దాదాపు 10 రెట్లు వేగంగా), లాగ్-ఫ్రీ కనెక్టివిటీని అందిస్తుంది. రియల్‌ టైమ్‌లో బిలియన్ల కొద్దీ కనెక్ట్ అయిన డివైజ్‌లకు డేటా షేర్‌ చేయవచ్చు.

ముగిసే వరకు స్పష్టత ఉండదు
ప్రక్రియ ప్రకారం.. ఎయిర్‌వేవ్స్‌లో ఏ కంపెనీకి ఎంత వచ్చిందో చివరి వరకు తెలియదు. మొదటి రోజు విక్రయించిన అన్ని రేడియో వేవ్స్‌ రిజర్వ్ ధర వద్ద ఉన్నాయి. నలుగురు బిడ్డర్లు పాల్గొనడాన్ని మంచి స్పందనగా పేర్కొన్న మంత్రి, మొదటి రోజు రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయని చెప్పారు. వేలంలో ఆరోగ్యకరమైన భాగస్వామ్యాన్ని చూశామని, వ్యాజ్యాల కారణంగా పరిశ్రమ కష్టకాలం నుంచి తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు పరిశ్రమ సన్‌రైజ్‌ ఇండస్ట్రీగా మారుతుందని, దాదాపు రూ.1,45,000 కోట్ల బిడ్‌లు పరిశ్రమ సానుకూల వైఖరిని సూచిస్తున్నాయని, కొత్త పెట్టుబడులు వస్తాయని, సేవా నాణ్యత మెరుగుపడుతుందని, కొత్త టెక్నాలజీలను పరిశ్రమ పరిచయం చేస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ అంతర్గత అంచనాల ప్రకారం.. మొదటి రోజు వేలం అంచనా రూ.80,000 కోట్ల కంటే డిమాండ్ 80 శాతం ఎక్కువ.

రికార్డు సమయంలో స్పెక్ట్రమ్‌ కేటాయింపు
ప్రభుత్వం, రికార్డు సమయంలో స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తుందని, సెప్టెంబర్-అక్టోబర్లో 5G సేవలు ప్రారంభమవుతాయని మంత్రి వైష్ణవ్‌ అన్నారు. ఆగస్టు 14-15లోగా స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రారంభ రోజున నాలుగు రౌండ్ల బిడ్డింగ్‌లు జరిగాయి, మిడ్, హై-ఎండ్ బ్యాండ్‌లకు ఆసక్తి కనబరిచారు. 3,300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కోసం వచ్చిన మొత్తం బిడ్‌లలో సగానికి పైగా (విలువ పరంగా) 9 బ్యాండ్‌లలో 7 బిడ్‌లు అందాయి. 3,300 MHz బ్యాండ్‌ స్పెక్ట్రమ్ కోసం రూ.78,550 కోట్ల విలువైన బిడ్‌లు దాఖలయ్యాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.

ఇదీ చదవండి: Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !700 MHz బ్యాండ్, కాస్ట్‌ ఎఫిసియంట్‌ డెప్లాయమెంట్‌ కోసం పశ్చిమ దేశాల్లోని టెల్కోలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది రూ.39,270 కోట్ల విలువైన ప్రొవిజనల్‌ బిడ్‌లు అందుకుంది. అయితే మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ 26 GHz, ఇది అల్ట్రా-హై-స్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. రూ.14,632.50 కోట్ల విలువైన బిడ్‌లతో అత్యధికంగా డిమాండ్ ఉన్న వాటిల్లో మూడో స్థానంలో ఉంది. 800 MHz, 2,300 MHz బ్యాండ్‌లకు బిడ్‌లు అందలేదు. కనీసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 GHz (గిగాహెర్ట్జ్) రేడియో వేవ్స్‌ బిడ్డింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వేలం బుధవారం కొనసాగుతుంది. గురువారం ముగిసే అవకాశం ఉంది.రూ.57,122.65 కోట్ల స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన జియో
EY గ్లోబల్ TMT ఎమర్జింగ్ మార్కెట్స్ లీడర్ ప్రశాంత్ సింఘాల్ మాట్లాడుతూ.. ‘స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజు అంచనాలకు అనుగుణంగా ఉంది. ప్రత్యేకించి 3,300 MHz, 26 GHz బ్యాండ్‌లకు ఆసక్తి కనబరిచారు. 5G స్పెక్ట్రమ్‌కు చాలా డిమాండ్ ఉందని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. 700 MHz బ్యాండ్‌లో బిడ్డింగ్ ఆశ్చర్యకరంగా ఉంది. పాన్-ఇండియా కవరేజీని అందించాల్సిన అవసరాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.’ అని చెప్పారు. రిలయన్స్ జియో రూ. 57,122.65 కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది, భారతీ ఎయిర్‌టెల్ సుమారు రూ.18,699 కోట్లకు, వొడాఫోన్ ఐడియా రూ.1,993.40 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.
Published by:Mahesh
First published:

Tags: 5G, Adani group, AIRTEL, Android, Anil Ambani, Jio

తదుపరి వార్తలు