Home /News /national /

THE INDIAN AUTHORITIES SENT AN EIGHT YEAR OLD BOY WHO HAD MISTAKENLY ENDED UP ON THE INDIAN SIDE BACK HOME TO PAKISTAN SSR GH

Pak Minor: భారత భూభాగంలోకి వచ్చిన 8 ఏళ్ల పాక్ బాలుడు.. ఆ తర్వాత ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ చాచ్రోకు సమీపంలో ఉండే తార్పార్కర్ కు చెందిన 8 ఏళ్ల కరీం దీనో ఈ నెల 3న పొరపాటున భారత భూభాగంలో ప్రవేశించాడు. భారత బలగాలు అతడిని రక్షించి తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి పాకిస్థాన్ రేంజర్లు కూడా భారత అధికారులకు సమాచారం అందించారు. పొరుగుదేశానికి చెందిన వింగ్ నెంబర్ 31 నుంచి...

ఇంకా చదవండి ...
'బజరంగీ భాయ్ జాన్' సినిమా గుర్తుందా. పొరపాటున పాకిస్థాన్ నుంచి భారత్ సరిహద్దుల్లో ప్రవేశించిన ఆరేళ్ల బాలికను రక్షించి ప్రాణాలొడ్డి ఆమె నివాసానికి చేరుస్తాడు హీరో. అయితే ఇదే తరహాలో ఇటీవలే దాయాది దేశానికి చెందిన 8 ఏళ్ల బాలుడు పొరపాటున భారత్ సరిహద్దుల్లో రాగా.. బోర్డర్ సెక్యురిటీ బలగాలను అతడిని సురక్షితంగా ఇంటికి చేరవేశారు. దీంతో ఇరు దేశాల నాయకులు సానుకూలంగా స్పందించి ద్వైపాక్షిక సంబంధాలను బలపర్చుకోవాలని పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ చాచ్రోకు సమీపంలో ఉండే తార్పార్కర్ కు చెందిన 8 ఏళ్ల కరీం దీనో ఈ నెల 3న పొరపాటున భారత భూభాగంలో ప్రవేశించాడు. భారత బలగాలు అతడిని రక్షించి తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి పాకిస్థాన్ రేంజర్లు కూడా భారత అధికారులకు సమాచారం అందించారు. పొరుగుదేశానికి చెందిన వింగ్ నెంబర్ 31 నుంచి భారత బలగాలకు సంబంధిత సమాచారాన్ని చేరవేశారు. ఓ బాలుడు తప్పిపోయాడని, అతడి కుటుంబం పాకిస్థాన్ సరిహద్దు గ్రామంలో నివసిస్తుందని తార్పార్కర్ డిప్యూటీ కమీషనర్ మహ్మద్ నవాజ్ సోహో ఖరారు చేశారు.

కరీం కుటుంబం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో బాలుడిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కుటుంబాన్ని చేరుకోవడంతో కరీం ముఖంలో ఆనందపు ఛాయలు వెల్లివిరిశాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఫెన్సింగ్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ప్రజలు పొరపాటున క్రాస్ చేస్తూ ఉంటారని తార్పార్కర్ కు చెందిన సాజిద్ బజీర్ అనే జర్నలిస్టు తెలిపాడు. ఇటీవలే ఓ పాకిస్థాన్ టీనేజర్ నాగర్ పార్కర్ ప్రాంతంలో అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత బలగాలు సంహరించాయి. అనంతరం అతడి దేహాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇరుదేశాల మధ్య స్నేహాపూర్వక సంబంధాలు బలపరచుకోవాలనే కోరికను భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ ద్వారా పంపారు. ఇందుకు ప్రతి సంకేతంగా దాయాది దేశాధినేత ఇమ్రాన్ ఖాన్ కూడా అభినందనలు తెలిపి సానుకూల సంకేతాలను ఇచ్చారు. రెండు దేశాల మద్య వివాదస్పద సమస్యలను పరిష్కరించుకోవాలని, ప్రగతిశీల విధానం ఆధారంగా సంభాషణలు జరగాలని ఆయన అన్నారు.

2003 ఫిబ్రవరి 25 ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) స్థాయి చర్చలను తగ్గించాయి. అప్పటి నుంచి గతాన్ని ఇరు దేశాలు ఇమ్రాన్ ఖాన్, పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమార్ జావేద్ బజ్వా పాతిపెట్టి ముందుకు సాగాలని కోరికను వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ అణ్వాయుధా సమస్యల పరిష్కారానికి భారతే ముందుడుగు వేయాలని పాకిస్థాన్ ఇప్పటికీ చెబుతోంది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: India, India pakistan border, Indian Army, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు