హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Drone : ఆ దేశ సరిహద్దు వెంట భారత్ హై అలర్ట్.. కదలికలను పసిగట్టెందుకు ఆధునిక డ్రోన్

Drone : ఆ దేశ సరిహద్దు వెంట భారత్ హై అలర్ట్.. కదలికలను పసిగట్టెందుకు ఆధునిక డ్రోన్

Drone : చైనా సరిహద్దు వెంట భారత్ హై అలర్ట్.. ఆ దేశ కదలికలను పసిగట్టెందుకు ఆధునిక డ్రోన్

Drone : చైనా సరిహద్దు వెంట భారత్ హై అలర్ట్.. ఆ దేశ కదలికలను పసిగట్టెందుకు ఆధునిక డ్రోన్

Drone : ఎల్‌ఏసిలో చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఆధునిక డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. సుమారు 30 వేల అడుగుల ఎత్తునుండి సరిహద్దులో జరిగే కదలికలను పసిగట్టేందుకు హెరాన్ మార్క్ 1 అనే అత్యాధునిక డ్రోను ఉపయోగిస్తున్నారు.

గత జూన్‌లో (june ) జరిగిన ఘర్షణల కారణంగా కొద్ది రోజులుగా భారత భూభాగంలోని చైనా ( china ) చొచ్చుకు వస్తుండడంతో పాటు ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ( boarder ) కొనసాగుతుండడంతో భారత దేశ భద్రతా విభాగం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. చైనా సరిహద్దులు దాడి భారత్‌లొకి చొరబడకుండా నిరంతర నిఘాను ( surveillance ) ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా కదలికలను గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు అసోంలోని (asom) మిసామరి ఆర్మి ఏవియోషన్ బేస్ వద్ద హెరాన్ మార్క్-1 డ్రోన్‌‌ను నిఘా కోసం సైన్యం మోహరించింది.

భారత్‌ ఈ డ్రోన్లను ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకున్నది. హెరాన్ మార్క్ -1 డ్రోన్‌ ( Heron mark 1 Drones ) దాదాపు 30వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతూ.. సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికలను పసిగట్టడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. డ్రోన్‌ సహాయంతో వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రు సైన్యం కదలికలు, చేపడుతున్న సన్నాహాలు, నిర్మాణాలను పర్యవేక్షిస్తూ భారత భూభాగాన్ని కాపాడుకోవడానికి సైన్యానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వనుంది.

ఇది చదవండి : " పాక్ తో మ్యాచ్ ఆడొద్దు... ఆ జట్టును బ్యాన్ చేయండి " .. టీమిండియాపై పెరుగుతున్న ఒత్తిడి..


ఇటీవల భారత ఆర్మీ ఇజ్రాయెల్‌ ( Israeli) నుంచి హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్ల కొనుగోలుకు సైతం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ డ్రోన్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎక్కువ ఎత్తు, సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం. కాగా గతేడాది జూన్‌ లఢఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నాటి నుంచి వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాల సైనిక అధికారుల మధ్య 13 రౌండ్ల పాటు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు.

ఇది చదవండి : పడిలేచిన ఉద్యమ కెరటం.. దారి తెన్నూ లేని ఉద్యమంగా మారింది.. దానికి గల కారణం ఏంటి..?

First published:

Tags: China, Drones, India-China, International news

ఉత్తమ కథలు