ప్రపంచంలో ప్రాణాన్ని మించిన ఆస్తి, ఐశ్వర్యం మరొకటి లేదు. మనవి ప్రాణాలే. ఎదుటివారివి ప్రాణాలే. అందుకే ప్రాణాలతో ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు, హత్యలు వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వారిపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల జీవితాల్లో శాశ్వత దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తమ కొడుకు ఇక తిరిగి రాడు అనే నమ్మలేని నిజాన్ని వారి జీవితాల్లో చిమ్మ చీకట్లను నింపుతుంది. అలాగే అపోహలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోకుండానే దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో చేసిన పొరపాటు జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా బీహార్ (Bihar) లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది. తన చెల్లికి విసిరిన నకలు చీటీ తన పాలిట యమపాశంగా మారుతుందని గ్రహించలేకపోయాడు. 12 ఏళ్లకే ఆ బాలునికి నిండు నూరేళ్లు నిండిపోయాయి.
China: మూడోసారి చైనా అధ్యక్షుడిగా కొనసాగేందుకు జిన్పింగ్ అడుగులు.. వ్యతిరేకిస్తున్న ప్రజలు..
అసలేం జరిగిందంటే?
తన చెల్లి 5వ తరగతి చదువుతుండగా స్కూల్లో పరీక్షలు నిర్వహించారు. దీనితో ఆమెను వెంటపెట్టుకొని 6వ తరగతి చదవుతున్న బాలుడు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తన చెల్లికి పరీక్షలో హెల్ప్ చేయాలనీ చూస్తాడు. అందుకోసం చెల్లికి నకలు చిట్టీలు విసిరేయాలనుకున్నాడు. చెల్లి పరీక్ష రాస్తుండగా సిద్ధం చేసిన నకలు చిట్టిలను ఆ బాలుడు చెల్లి దగ్గర పడేలా విసరాలనుకున్నాడు. కానీ ఆ చిట్టీలు వెళ్లి మరో బాలిక వద్ద పడ్డాయి. అయితే ఈ నకలు చిట్టిలను తప్పుగా భావించిన బాలిక అది లవ్ లెటర్ అని పొరపడింది. ఆ బాలుడు తనకే లవ్ లెటర్ రాశాడని ఆ బాలిక తన సోదరులకు చెప్పింది.
దీనితో ఆ బాలుడిని ఆమె సోదరులు కత్తులతో పొడిచి కాళ్లు, చేతులు నరికేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాలుడి చెల్లి అన్నపై దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పింది.దీనితో వారు బాలుడి కోసం వెతకసాగారు. ఈ క్రమంలో భోజ్ పూర్ లోని మహత్ బనియా ఆల్ట్ స్టేషన్ దగ్గర బాడీ పార్టులు లభించాయి. ఈ విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పగా వారు అక్కడ లభించిన టీషర్ట్ ఆధారంగా తమ కొడుకే అని గుర్తించారు. దీనితో పోలీసులు కేసు నమోదు విచారణ జరిపించారు. జరిగిన తతంగమంతా బాలుడి చెల్లి పోలీసులకు చెప్పిన దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారంతా మైనర్లే కావడం గమనార్హం. ఈ ఘటన వారం రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిన్న పొరపాటు వల్ల బాలుడి కుటుంబంలో పెను విషాదం మిగిలింది. సినిమా స్టోరీని తలపించిన ఈ క్రైమ్ సీన్ లో అంతా మైనర్లే కావడం స్థానికంగా వణుకు పుట్టిస్తుంది. అయితే ఆ బాలిక ఆ నకలు చిటిని లవ్ లెటర్ గా పొరపడక పోకుంటే ఇంత ధారుణమే జరిగేది కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Crime news