హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

The Flag Code of India: త్రివర్ణ పతాకాన్ని గౌరవప్రదంగా ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా? ఫ్లాగ్ కోడ్ రూల్స్ ఇవే..

The Flag Code of India: త్రివర్ణ పతాకాన్ని గౌరవప్రదంగా ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా? ఫ్లాగ్ కోడ్ రూల్స్ ఇవే..

భారత జాతీయ పతాకం

భారత జాతీయ పతాకం

The Flag Code of India: ప్రధాని మోదీ (Indian PM Narendra Modi) ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపునివ్వడంతో చాలా మంది తమ ఇళ్లు, వానహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య వేడుకలు ముగియడంతో.. జాతీయ జెండాను గౌరవప్రదంగా డిస్పోజ్ చేయడం చాలా ముఖ్యం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశానికి స్వాతంత్ర్యం (Independence Day) వచ్చి 75 వసంతాలు పూర్తికావడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ (Indian PM Narendra Modi) ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపునివ్వడంతో చాలా మంది తమ ఇళ్లు, వానహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య వేడుకలు ముగియడంతో.. జాతీయ జెండాను గౌరవప్రదంగా డిస్పోజ్ చేయడం చాలా ముఖ్యం.

* అగౌరవపరిస్తే మూడు సంవత్సరాల జైలు

ఎవరైనా త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిస్తే, భారత ఫ్లాగ్ కోడ్ ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇంతకీ చట్టం ఏం చెబుతుందంటే..‘బహిరంగ ప్రదేశంలో జాతీయ జెండాను ఎవరైనా దహనం, అపవిత్రం, నాశనం చేసినా, తొక్కినా లేదా ఇతరత్రా ధిక్కారానికి గురిచేసినా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.’ అని చెబుతోంది.

వస్త్రంతో చేసిన జెండాలను కొనుగోలు చేసిన వారు వాటిని భద్రపర్చుకుని మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించిన తర్వాత జెండాలను విసిరివేయకూడదు. అసలు జాతీయ జెండాకు సంబంధించి చేయాల్సినవి, చేయకూడని నియమాలను జాబితా రూపంలో చెప్పేదే ఫ్లాగ్ కోడ్.

* కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఇవే..

- జాతీయ జెండాను ఏదైనా దుస్తులు లేదా యూనిఫారంలో భాగంగా ఉపయోగించకూడదు

- కుషన్స్, నేప్‌కిన్స్ లేదా డ్రెస్ మెటీరియల్‌గా ఉంపయోగించకూడదు. అలాగే ఎంబ్రాయిడరీ చేయకూడదు. ముద్రించకూడదు.

- జెండాపై ఎలాంటి అక్షరాలు రాయకూడదు. జెండాకు ఉద్దేశపూర్వకంగా కుంకుమను అంటించరాదు.

త్రివర్ణ పతాకం డిస్పోజింగ్‌పై ఫ్లాగ్ కోడ్ ఇలా పేర్కొంది. జెండా డ్యామేజ్ లేదా మురికిగా ఉన్నప్పుడు, అది పూర్తిగా ప్రైవేట్‌గా డిస్పోజ్ చేయాలి. మొదటి ప్రాధాన్యంగా కాల్చడం లేదా జెండా గౌరవానికి అనుగుణంగా మరేదైనా పద్ధతి ద్వారా కూడా డిస్పోజ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి : జానపద కళాకారులతో మమతా బెనర్జీ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..

 దెబ్బతిన్న లేదా తడిసిన జెండాలన్నింటినీ సేకరించి భద్రంగా చెక్క పెట్టెలో ఉంచి వాటిని పాతిపెట్టవచ్చు. పెట్టెను పాతిపెట్టి కొద్దిసేపు మౌనం పాటించాలి. ఒక వ్యక్తి డ్యామేజ్ జెండాలను కాల్చాలని అనుకుంటే, మంటలను ప్రారంభించిన తర్వాత వాటిని చక్కగా మడిచి మంటల మధ్యలో ఉంచాలి. ఇది పూర్తిగా ప్రైవేట్‌గా చేయాల్సి ఉంటుంది.

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)పారిశుధ్య కార్మికులకు కొన్ని సూచనలు చేసింది. చిరిగిన లేదా తడిసిన జెండాలను విడివిడిగా సేకరించాలని కోరింది. ఈ జెండాలను గౌరవంగా డిస్పోజ్ చేయాలని పేర్కొంది. ఢిల్లీకి చెందిన URJA గ్రూప్.. RWA సభ్యులందరికీ వారి ప్రాంతం నుంచి జెండాలను సేకరించి, వాటిని నిర్దేశించిన స్థలంలో డిపాజిట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపింది.

First published:

Tags: Independence Day, Independence Day 2022, National flag, PM Narendra Modi