దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron) వైరస్‌పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ ధాటికి ఫ్రాన్స్ చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికా, బ్రిటన్‌లో కూడా కేసులు ఎక్కువయ్యాయి. అయితే ఒమిక్రాన్ (Omicron నేపథ్యంలో భారత్‌లోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షియస్ వేరియంట్ వెర్షన్‌గా ఒమిక్రాన్ ఉంది. ప్రస్తుతం యూరప్, అమెరికా (America) లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
మొదటి మరణం..
ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో భారత్‌లో సెకండ్ వేవ్ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పాక్షిక లాక్డౌన్ విధించింది. పలు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 198 మంది రోగులు పాజిటివ్‌గా తేలారు. ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం (omicron first death in india) కూడా నమోదైంది.
దేశంలో ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం (omicron first death in india) మహారాష్ట్ర (Maharashtra)లో నమోదైంది. ఇక్కడ 52 ఏళ్ల ఒమిక్రాన్ సోకిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. డిసెంబర్ 28న ఈ వ్యక్తి మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన అతను పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ వ్యక్తి 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు బులెటిన్‌లో తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగానే పరిగణించింది.
1,201కి చేరిన కేసులు..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో అతనికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలడం యాదృచ్ఛికమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ పేర్కొంది. భారతదేశంలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1201కి చేరుకుంది. మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కేసులు 450కి చేరుకున్నాయి.
రాజధానిలో..
ఇప్పటివరకు దేశంలో 395 ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో, క్రియాశీల రోగుల సంఖ్య 810గా ఉంది. దేశంలో 263 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. రాజధానిలో 57 మంది కోలుకున్నారు. 206 మంది చికిత్స తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona deaths, Maharashtra, Omicron