హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dead Body: కన్నీళ్లు తెప్పించే వార్త.. వర్షంలో నట్టడివిలో నడుస్తూ.. కూతురి శవంతో నాలుగు కిలోమీటర్లు.. ఆ తండ్రి బాధ వర్ణణాతీతం

Dead Body: కన్నీళ్లు తెప్పించే వార్త.. వర్షంలో నట్టడివిలో నడుస్తూ.. కూతురి శవంతో నాలుగు కిలోమీటర్లు.. ఆ తండ్రి బాధ వర్ణణాతీతం

కూతురు శవంతో వర్షంలో తడుస్తూ వస్తున్న తండ్రి (Image: Mathrubhumi.com)

కూతురు శవంతో వర్షంలో తడుస్తూ వస్తున్న తండ్రి (Image: Mathrubhumi.com)

దేశంలో రోడ్డు మార్గం కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామస్తులకు ఏదైనా జబ్బు చేస్తే కాలి నడకన వెళ్లాల్సిందే. ఎవరైనా చనిపోతే చేతులతో మోసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు.

ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ మారుమూల గ్రామాలకు కనీస సదుపాయాలను కల్పించే నాథుడే కరవయ్యాడు. దేశంలో రోడ్డు మార్గం కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రామస్తులకు ఏదైనా జబ్బు చేస్తే కాలి నడకన వెళ్లాల్సిందే. ఎవరైనా చనిపోతే చేతులతో మోసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు. కేరళ (Kerala)లోని అట్టపాడి (Attappadi) లోని మురుగాల (Murugala) గ్రామం ప్రజలు కూడా ఇలాంటి తీవ్ర సమస్యలతోనే బాధపడుతున్నారు. తాజాగా ఈ ఊరికి చెందిన అయ్యప్పన్ తన కూతురి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డాడు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అతను తన బిడ్డ భౌతికకాయాన్ని చేతుల్లో మోస్తూ నాలుగు కిలోమీటర్లు నడిచాడు. అయ్యప్పన్ తన ఇంటికి చేరుకోవడానికి కుండపోత వర్షంలో భయంకరమైన అడవి గుండా అడుగులు వేయాల్సి వచ్చింది. ఒక చెట్టు మొద్దుతో చేసిన చిన్న వంతెనపై ప్రవహించే ప్రమాదకరమైన కాలువను దాటవలసి వచ్చింది. ఈ తండ్రి వెంట కాంగ్రెస్ ఎంపీ వీకే శ్రీకందన్ కూడా వచ్చారు.

వివరాల్లోకి వెళితే.. అయ్యప్పన్, సరస్వతి దంపతులకు చెందిన మూడు నెలల, 25 రోజుల వయసున్న బాలిక సజేశ్వరి సోమవారం మృతి చెందింది. ఈ చిన్నారి మృతదేహానికి పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం, మంగళవారం రోజు అంబులెన్స్‌లో చిన్నారి మృతదేహాన్ని తాడికుండుకు తీసుకెళ్లారు. అయితే మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ వీకే శ్రీకందన్‌ తన కాంగ్రెస్ కార్యకర్తలతో తాడికుండు (Thadikundu) వద్దకు వస్తున్నామని తెలిపారు. దాంతో అయ్యప్పన్ తన కూతురు మృతదేహాన్ని చేతుల్లో పట్టుకొని అక్కడ ఎదురుచూశాడు. కొంతసేపటికి శ్రీకందన్ అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని చూసి చలించిపోయారు.

 ఇదీ చదవండి: ఈ వార్త చదివితే ఆశ్చర్యపోతారంతే.. వినాయకుడి విగ్రహాలను ఎత్తుకెళ్తున్న గజరాజులు.. ఎక్కడంటే..?


ఆపై "నేను కూడా నీతో పాటు వస్తాను పదా" అని అయ్యప్పన్‌తో ఎంపీ అన్నారు. అయ్యప్పన్‌ బదులిస్తూ ఊరుకు రోడ్డు మార్గం లేదు, వెళ్లడం చాలా కష్టమని చెప్పినా ఎంపీ వినిపించుకోలేదు. అతనితో కలిసి ఎంపీ ప్రమాదకరమైన మార్గంలో నడుస్తూ గ్రామానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. భారీ వర్షంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువను ప్రాణాలకు తెగించి అయ్యప్పన్ దాటాడు. అతని తర్వాత ఎంపీ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నీటి ప్రవాహాన్ని దాటారు. ఎంపీ శ్రీకందన్ అయ్యప్పన్‌ వెనకే నడుస్తూ గొడుగు పట్టారు. చివరికి ఎలాగోలా గ్రామానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరునాలి కాలువ, భవానీ నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో మురుగాల గ్రామానికి చేరుకోవడం అసాధ్యంగా మారింది. అయితే గ్రామ ప్రజల కోసం భవానీ నది మీదుగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ (ఐటీడీపీ) కింద సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఊరు ప్రజలు నది దాటాలంటే చిన్న చెక్క వంతెనపైనే ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన గ్రామమైన తాడికుండు వద్దకు మాత్రమే వాహనాలు రాగలుగుతున్నాయి. కాగా నదిని కూడా దాటేందుకు వీలుగా ఒక మంచి బ్రిడ్జి తీసుకురావాలని ప్రజలు పాలకులను కోరుకుంటున్నారు.

Published by:Mahesh
First published:

Tags: Dead body, Father, Kerala, Younger daughter

ఉత్తమ కథలు