జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదుల కారణంగా అప్పుడప్పుడు భీతావాహ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇప్పుడు కశ్మీర్‌లో ఉగ్రవాదం నాశనమయ్యే స్థితికి చేరుకుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Union minister Jitendra Singh) పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని యువత ఆయా రంగాల్లో సక్సెస్ అవ్వాలని.. భారతీయుల జనజీవన స్రవంతిలో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. న్యూస్18 (News18)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ (Special Interview) లో జమ్మూ కశ్మీర్‌పై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో మాట్లాడటం కంటే జమ్మూ కశ్మీర్‌లోని యువతతో మాట్లాడటమే ఉత్తమమని హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యల్లో సెంటిమెంట్ ప్రతిబింబిస్తోందని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది & సహాయ మంత్రిగా.. అలాగే ఉదంపూర్ ఎంపీ (Udhampur MP)గా సేవలందిస్తున్నారు.
భద్రతా బలగాలు ఉగ్రవాదుల (Terrorist) గుండెల్లో గుబులు రేపుతూ వారిని చేజ్ చేస్తున్నందున జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం చివరి దశకి చేరుకుందని సింగ్ తెలిపారు. పరారీలో ఉన్న ఉగ్రవాదులు సామాన్య పౌరులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జితేంద్ర సింగ్ తెలిపారు. భద్రతా దళాల (Security forces) రాడార్‌ను తాకిన కొద్ది నెలల వ్యవధిలోనే ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపారన్నారు. మిలిటెంట్ కమాండర్లు (Militant commanders) చాలా ఏళ్ల తర్వాత పాపులర్ హోదాను పొందినట్లు కాకుండా భద్రతా దళాలు ఉగ్రవాదులను తక్కువ సమయంలోనే అణచివేయడంలో సక్సెస్ అయ్యారని తెలిపారు. భారతదేశం సరికొత్త కేంద్రపాలిత ప్రాంతం కోసం కార్యాచరణను వివరిస్తూ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ప్రతిపక్షాల అభ్యంతరాన్ని పక్కన పెట్టేశారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత కశ్మీర్‌కు రాష్ట్ర హోదా (State status) వస్తుందని తెలిపారు. ఆయన ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పారో తెలుసుకుంటే..
* హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్‌లో పర్యటనలో పాకిస్థాన్‌తో మాట్లాడే బదులు, జమ్మూ కశ్మీర్ యువతతో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటన ప్రాముఖ్యత ఏంటి?
జితేంద్ర సింగ్: అమిత్ షా (Amit shah) ప్రకటన జమ్మూ & కశ్మీర్‌లోని సామాన్య ప్రజానీకానికి, యువతకు మరింత చేరువయ్యే విధానంతో సాగుతుంది. రాష్ట్ర జనాభాలో ఎక్కువగా యువతే (youngsters) ఉన్నారు. అమిత్ షా ప్రకటన సరైన, ఆచరణాత్మక విధానం. వాస్తవానికి జమ్మూ & కశ్మీర్ యువత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు జరిగే హింసాత్మక సంఘటనల కారణంగా అతను వెనకడుగు వేసి ఉండొచ్చు.
కానీ వాస్తవం ఏమిటంటే, జమ్మూ కశ్మీర్‌లోని యువత మంచి లక్ష్యాలతో చాలా పోటీతత్వం కలిగి ఉన్నారు. అన్ని పోటీ పరీక్షలలో (Competitive exams) వాళ్లు చాలాసార్లు రాణించడమే ఇందుకు నిదర్శనం. ఈ సంవత్సరం నీట్ టాపర్ గా జమ్మూ & కశ్మీర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి నిలిచాడు. సివిల్ సర్వీసెస్ (Civil services)లో కూడా జమ్మూ & కశ్మీర్ నుంచి వరుసగా టాపర్లుగా నిలిచిన వారు ఉన్నారు. వారి ఆకాంక్షలు, వారి ప్రతిభకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
* అయితే పాకిస్థాన్‌తో ఇకపై చర్చలు ఉండవా?
జితేంద్ర సింగ్: పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. నేను దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానించను.
* జమ్మూ కశ్మీర్‌లోని పౌరులపై ఇటీవల జరిగిన దాడులను మీరు ఎలా చూస్తారు? ప్రభుత్వం ఆందోళన చెందుతోందా?
జితేంద్ర సింగ్: ఉగ్రవాదులు పరారీలో ఉన్నందున.. సాఫ్ట్ టార్గెట్లను లక్ష్యంగా చేసుకుని తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మిలిటెన్సీ చాలా నియంత్రణలో ఉంది. దీనికి మొదటి కారణం.. మీరు గణాంకపరంగా చూసుకుంటే.. మునుపటి సంవత్సరాల గణాంకాలను, ప్రత్యేకించి 2014కి ముందు ఉన్న గణాంకాలను పోల్చి చూస్తే, ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు. ఇది మిలిటెన్సీకి చివరి దశ, వారు (ఉగ్రవాదులు) పోయేకాలం వచ్చింది.
గత ఏడేళ్లలో జరిగిన భద్రతా సిబ్బంది, పౌరుల హత్యల సంఖ్య మునుపటితో పోలిస్తే చాలా తక్కువ. రెండో కారణం ఏంటంటే.. ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్స్, ఇతర నిర్ణయాత్మక చర్యల తర్వాత పెద్ద సంఘటనేమీ జరగలేదు. ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు సాఫ్ట్ టార్గెట్‌లను ఎంచుకుంటున్నారు. దానివల్ల అప్పుడప్పుడు హత్యలు (Murders) జరుగుతున్నాయి. కానీ వారు పరారీలో ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు (Security forces) సమర్థవంతమైన వేటను మొదలుపెట్టాయి.
ఉగ్రవాదం (terrorism) చివరి అంచున ఉందని చెప్పడానికి మూడవ సాక్ష్యం ఏమిటంటే.. ఉగ్రవాది సగటు జీవిత కాలం కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరానికి తగ్గింది. కొత్త టెర్రర్ కమాండర్ ఉద్భవించాడని గమనించిన క్షణం నుంచి, కొన్ని నెలల్లోనే అతన్ని మట్టు బెడుతున్నారు. టెర్రర్ కమాండర్ ఒక దశాబ్దం పాటు లెజెండ్‌గా మారడం అనేది జరగడం లేదు. జమ్మూ కశ్మీర్‌లో ఈ ఉగ్రవాద శకం (The era of terrorism) ముగియబోతోందనడానికి ఇవన్నీ సంకేతాలు.
* J&K యువత ఇప్పుడు మీతో ఉన్నట్లు భావిస్తున్నారా?
జితేంద్ర సింగ్: అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సామాన్యుల మనోధైర్యం పెరిగింది. ముఖ్యంగా యువత ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. తమ జనజీవన స్రవంతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM narendra modi) సారథ్యంలో ఉందని వారు చాలా స్పష్టంగా చెప్పారు. వారు అభిలాష కలిగిన యువత కాబట్టి అవకాశాలను జారవిడుచుకోరు.
* జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా పునర్విభజన తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత రాష్ట్ర హోదా ఉంటుందని అమిత్ షా చేసిన ప్రకటనను జమ్మూ కశ్మీర్‌లోని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారికి ముందుగా రాజ్యాధికారం/ ప్రత్యేక హోదా కావాలి. దీంతో పునర్విభజన కసరత్తులో సమస్య ఎదురవుతుందా?
జితేంద్ర సింగ్: ఈ సమస్యపై హోంమంత్రి వైఖరి మొదటి రోజు నుంచి స్థిరంగానే ఉంది. ఎప్పుడు అడిగినా పార్లమెంట్‌లోనూ, బయటా ఇదే మాట అన్నారు. కాబట్టి ఎలాంటి సందిగ్ధత లేదు. పునర్విభజన అనేది రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి ఇది ఇతర మార్గాల ద్వారా ప్రభావితం కావచ్చని నేను అనుకోను.
* J&K విషయానికి వస్తే దిల్ కి దూరి.. డిల్లీ కి దూరి రెండింటినీ తొలగించడం గురించి పీఎం మాట్లాడారు. అందులో ఎంత వరకు విజయం సాధించారు?
జితేంద్ర సింగ్: పీఎం తొలి నుంచి ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. 2014లో, ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్ లోయలో వరదలు వల్ల రాజధాని నగరం శ్రీనగర్ మొత్తం నీటిలో మునిగిపోయింది. పీఎం అప్పటి నుంచి J&Kని పదే పదే సందర్శిస్తున్నారు. తన మొదటి దీపావళిని కశ్మీర్‌లో గడిపారు. ఆ సమయంలో ఆయన వరద బాధిత ప్రజలను పరామర్శించారు. ఈ దీపావళికి కూడా జమ్మూ & కశ్మీర్‌లో సైనికులతో సమయం గడుపుతున్నారు. అందుకే అతనికి భారతదేశమంతటా ప్రత్యేక శోభ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, Jammu and Kashmir, Kashmir security, Special interview, Terrorism