బుద్ధుడి మార్గమే మేలు... గురు పౌర్ణమి నాడు ప్రధాని శాంతి మంత్రం...

ఓవైపు చైనా సరిహద్దుల్లో రెచ్చిపోతుంటే... ప్రధాని మోదీ... యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని పరోక్ష సంకేతం ఇచ్చారు. మరి చైనా తన తీరు మార్చుకుంటుందా?

news18-telugu
Updated: July 4, 2020, 10:33 AM IST
బుద్ధుడి మార్గమే మేలు... గురు పౌర్ణమి నాడు ప్రధాని శాంతి మంత్రం...
బుద్ధుడి మార్గమే మేలు... గురు పౌర్ణమి నాడు ప్రధాని శాంతి మంత్రం... (credit - twitter - ANI)
  • Share this:
ఆషాఢ పూర్ణిమ (గురు పూర్ణిమ, గురు పౌర్ణమి) సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... తన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో... ఈ శుభ సందర్భంగా... మనం గురువుల్ని గుర్తుచేసుకోవాలని ప్రధాని అన్నారు. గురువులు మనకు నాలెడ్జి ఇచ్చారని వారిని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవాళికి శాంతి మార్గాన్ని బోధించిన బుద్ధ భగవానుడిని మోదీ స్మరించుకున్నారు. నివాళులు అర్పించారు. తధాగతుడు సూచించిన 8 సూత్రాల మార్గం... ఎన్నో దేశాలు, సమాజాల అభివృద్ధికి బాటలు పరిచిందని మోదీ గుర్తుచేశారు. దయ, జాలి గొప్పదనం తెలిసొచ్చిందన్నారు. ఆలోచించడానికీ, పాటించడానికీ బుద్ధుడి విధానాలు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు ప్రధాని మోదీ.

ఓవైపు చైనా సరిహద్దుల్లో బలగాలతో రెచ్చిపోతుంటే... ప్రధాని మోదీ... యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని... శాంతి మంత్రమే సరైన విధానమని పరోక్ష సంకేతం ఇచ్చారు. మరి చైనా తన తీరు మార్చుకుంటుందా? కుట్రపూరిత స్వార్థ బుద్ధిని వదులుకుంటుందా... అంటే... దేశ ప్రజల్లో అలాంటి నమ్మకం కనిపించట్లేదు. డ్రాగన్‌తో డేంజరే అని ప్రజలు భావిస్తున్నారు. చైనా యుద్ధం చేస్తే మాత్రం... భారత్ గట్టిగా బదులివ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. నేడు చాలామంది సూర్యోదయాన ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ముగిస్తారు.
Published by: Krishna Kumar N
First published: July 4, 2020, 10:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading