THE DEMAND FOR INTERNATIONAL MEN DAY WAS RAISED BY EMINENT INDIAN CLASSICAL DANCER AND MP SONAL MANSINGH SSR
International Women’s Day: మహిళా దినోత్సవం రోజున పార్లమెంట్లో ఈ మహిళా ఎంపీ డిమాండ్ విని అవాక్కయిన నెటిజన్లు..!
ఎంపీ సోనల్ మాన్సింగ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పార్లమెంట్ సాక్షిగా ఈ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మెజార్టీ నెటిజన్లు మండిపడ్డారు. పురుషుల దినోత్సవం జరపాల్సిన అవసరం లేదని, దేశంలో జరుగుతున్న అత్యాచారాల గురించి గళమెత్తాల్సిన అవసరం ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. భారత్‌లో చర్చించడానికి ఎన్నో అంశాలు ఉంటే సోనాలి మాన్సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తారని ఓ నెటిజన్ చమత్కరించారు. కొందరు మాత్రం ఎంపీకి ఇంటర్నేషన్ మెన్స్ డే...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బీజేపీ మహిళా ఎంపీ ఒకరు పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్త్రీపురుష సమానత్వం గురించి రాజ్యసభలో బీజేపీ మహిళా ఎంపీ సోనల్ మాన్సింగ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఆమె ప్రకటించారు. సోనల్ మాన్సింగ్ ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్. రాజ్యసభ సభ్యురాలిగా ఆమె పార్లమెంట్‌కు నామినేట్ అయ్యారు. పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని, ఆ రోజును కూడా మహిళా దినోత్సవం మాదిరిగానే ఘనంగా జరుపుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ఎంపీలంతా ఘొల్లున నవ్వారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పార్లమెంట్ సాక్షిగా ఈ మహిళా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మెజార్టీ నెటిజన్లు మండిపడ్డారు. పురుషుల దినోత్సవం జరపాల్సిన అవసరం లేదని, దేశంలో జరుగుతున్న అత్యాచారాల గురించి గళమెత్తాల్సిన అవసరం ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. భారత్‌లో చర్చించడానికి ఎన్నో అంశాలు ఉంటే సోనల్ మాన్సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తారని ఓ నెటిజన్ చమత్కరించారు. కొందరు మాత్రం ఎంపీకి ఇంటర్నేషన్ మెన్స్ డే ఉన్న సంగతి తెలియదేమోనని, నవంబర్ 19ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా పరిగణిస్తారన్న విషయాన్ని ఎంపీకి గుర్తుచేస్తున్నారు. మహిళా నెటిజన్లు మాత్రం ఎంపీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
దేశంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో 99.99 శాతం పురుషుల వల్ల జరుగుతున్నవేనని ఓ మహిళా నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ సంగతి మర్చిపోయి ఇంటర్నేషనల్ మెన్స్ డే గురించి సోనల్ మాట్లాడుతున్నారని ఆమె ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఎంపీ సోనల్ తర్వాత మాట్లాడిన మహిళా ఎంపీలంతా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించామని, కానీ.. ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్ వరకూ పెంచాల్సిన అవసరం ఉందని చతుర్వేది డిమాండ్ చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.