హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Twitter: హిందూ దేవతకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులను తొలగించండి: ట్విట్టర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Twitter: హిందూ దేవతకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులను తొలగించండి: ట్విట్టర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదిత్య సింగ్ దైస్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం ట్విట్టర్‌కు సూచించింది.

సోషల్ మీడియా (Social media)లో కొందరు వ్యక్తులు మతాలు, దేవుళ్ల గురించి ఇష్టానుసారం పోస్టులు పెడుతూ ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అలాంటి అభ్యంతరకర పోస్టు (Objectionable post)లను తొలగించాల్సిందిగా రిపోర్ట్ చేస్తే.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు ట్విట్టర్ మినహాయింపేమీ కాదు. కొద్ది రోజుల క్రితం హిందువుల మనోభావాలను (The sentiments of the Hindus) కించపరిచేలా ఓ ట్విట్టర్ (Twitter) యూజర్ కాళీ మాత (Kaali) గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. వీటిపై ఆదిత్య సింగ్ దేశ్వాల్ అనే ఓ వ్యక్తి ట్విట్టర్‌కు ఫిర్యాదు చేయగా.. వాటిని తొలగించడం కుదరదని ట్విట్టర్ (TWITTER) బదులిచ్చింది. దాంతో అతడు న్యాయస్థానం (court)లో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ విచారణకు రాగా.. ఢిల్లీ హైకోర్టు (Delhi court) ట్విట్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అలాగే హిందూ దేవతకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్‌ను తన ప్లాట్‌ఫామ్ (Platform) నుంచి సత్వరమే రిమూవ్ చేయాలని ట్విట్టర్‌ని కోరింది.

బిజినెస్ చేస్తున్నందున..

ఆదిత్య సింగ్ దైస్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం (bench) విచారించింది. ఈ సందర్భంగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం ట్విట్టర్‌కు సూచించింది. సోషల్ మీడియా దిగ్గజం సాధారణ ప్రజల కోసం బిజినెస్ (business) చేస్తున్నందున వారి మనోభావాలను గౌరవిస్తుందని అభిప్రాయపడుతున్నట్లు ధర్మాసనం తెలిపింది. అభ్యంతరకరమైన పోస్టు (Objectionable post) లను తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ట్విట్టర్‌ని కోరింది. ట్విట్టర్ (Twitter) బహు బాగా పనిచేస్తోందని.. ట్విట్టర్‌ సేవలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని బెంచ్ పేర్కొంది.

ప్రజల మనోభావాలను గౌరవించాలి..

"దేవతను అవమానించేలా.. హిందూ (Hindu) మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న కంటెంట్‌ను తొలగిస్తారా? లేదా?” అని ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్ తరఫు న్యాయవాదికి ప్రశ్న సంధించింది. "మీరు పెద్ద ఎత్తున ప్రజల కోసం వ్యాపారం చేస్తున్నందున సాధారణ ప్రజల మనోభావాలను గౌరవించాలి. వారి మనోభావాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ఇలాంటి పనులు ఎందుకు చేయాల్సి వస్తోంది? అవమానకర కంటెంట్ (Insulting content) తొలగించండి. గతంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) దళిత అమ్మాయి ఐడెంటిటీ రివీల్ (Identity) చేసే విధంగా పెట్టిన ట్వీట్స్ కూడా తొలగించారు కదా.’’ అని ధర్మాసనం పేర్కొంది.

అసభ్యకర కంటెంటు తొలగిస్తామని..

ట్విటర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ తొలగింపుకు సంబంధించి కోర్టు (Court) ఉత్తర్వుల్లో పేర్కొనవచ్చని అన్నారు. కోర్టు ఆదేశాలకు కట్టుబడి అసభ్యకర కంటెంటు తొలగిస్తామని.. ఇప్పటికే ఒక అకౌంట్ డిసేబుల్ (content disable) చేశామని ధర్మాసనానికి తెలిపారు. కాగా కోర్టు కేసు తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.

కాళీ మాత గురించి అసహ్యకరమైన పోస్ట్‌..

పిటిషనర్ ఆదిత్య సింగ్ దేశ్వాల్ మాట్లాడుతూ.. @AtheistRepublic యూజర్ ఐడీ గల ఒక వినియోగదారుడు కాళీ (kaali) మాత గురించి అసహ్యకరమైన పోస్ట్‌లను పెట్టాడని.. అవి తాను చూశానని పేర్కొన్నాడు. సీనియర్ న్యాయవాది సంజయ్ పొద్దార్ (sanjay Poddar) ద్వారా పిటిషనర్ వాదించారు. యూజర్ పెట్టిన కంటెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021, నిబంధనలకు విరుద్ధంగా ఉందని ట్విట్టర్ ఫిర్యాదు అధికారికి తెలియజేసినట్టు తెలిపారు. ట్విట్టర్ ఈ నియమాలు పాటించకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ద్వారా లభించిన లీగల్ ఇమ్యూనిటీ కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఆ కంటెంట్ తాము చర్యలు తీసుకోవాల్సిన వర్గానికి చెందినది కాదని.. అందువల్ల దానిని తొలగించలేమని ట్విట్టర్ సెలవిచ్చినట్లు పిటిషనర్‌ ఆరోపించారు.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Delhi High Court, Hindu Temples, Twitter, Viral post

ఉత్తమ కథలు