అభినందన్ విచారణ పూర్తి...సెలవులపై ఇంటికి వెళ్లనున్న వింగ్ కమాండర్

సెలవుల నుంచి తిరిగొచ్చిన తర్వాత అభిందన్‌కు మెడికల్ రివ్యూ బోర్డ్ ఆధ్వర్యంలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌, యుద్ధం విమానాన్ని నడిపే శక్తిసామర్థ్యాలను సమీక్షిస్తుంది

news18-telugu
Updated: March 14, 2019, 4:40 PM IST
అభినందన్ విచారణ పూర్తి...సెలవులపై ఇంటికి వెళ్లనున్న వింగ్ కమాండర్
భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్(File)
  • Share this:
పాకిస్తాన్ గడ్డపై దేశం మీసం తిప్పిన వింగ్ కమాండర్ అభినందన్ త్వరలో ఇంటికి వెళ్లనున్నారు. పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి ఢిల్లీలో భారత ఆర్మీ అదుపులోనే ఆయన ఉన్నారు. మొదటి మూడు రోజుల పాటు అభినందన్‌కు ప్రత్యేక వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలపై.. భారత వాయుసేన అధికారులతో పాటు ఇతర ఏజెన్సీలు ఆయన్ను ప్రశ్నించాయి. విచారణ పూర్తికావడంతో.. డాక్టర్ల సలహా మేరకు సిక్ లీవ్‌పై పంపిస్తున్నారు. దాంతో కొన్ని వారాల పాటు కుటుంబ సభ్యులతో గడపనున్నారు అభినందన్.

సెలవుల నుంచి తిరిగొచ్చిన తర్వాత అభిందన్‌కు మెడికల్ రివ్యూ బోర్డ్ ఆధ్వర్యంలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌, యుద్ధం విమానాన్ని నడిపే శక్తిసామర్థ్యాలను సమీక్షిస్తారు. ఆ తర్వాతే ఫైటర్ పైలట్‌గా అభినందన్ తన విధులు నిర్వహించాలా? లేదంటే గ్రౌండ్‌కే పరిమితం చేయాలా? అనే దానిపై వాయుసేన నిర్ణయం తీసుకుంటుంది.

ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఫైటర్‌జెట్స్ నిబంధనలను ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. భారత మిలటరీ స్థావరాలే లక్ష్యంగా దూసుకురావడంతో..ఎయిర్‌ఫోర్స్ ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్స్‌ని మిగ్-21 బైసన్ విమానాలు తరిమికొట్టాయి. వాయుసేన దాడిలో F-16 విమానం కూలిపోయింది. ఆ ప్రయత్నంలో మిగ్-21 విమానం సైతం కూలిపోయి..పీవోకేలో కూలిపోయింది. వింగ్ కమాండర్ అభిందన్ పాక్ భూభాగంలోకి అడుగుపెట్టడంతో ఆ దేశ ఆర్మీ కస్టడీలోకి తీసుకుంది. ఐతే భారత్‌తో పాటు ప్రపంచదేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో రెండు రోజుల తర్వాత అభినందన్‌ని విడుదల చేశారు. అభినందన్ విడుదల తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు శాంతించాయి.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading