హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dr BR Ambedkar : అగ్రవర్ణ హిందువు వేషధారణలో బీ.ఆర్.అంబేడ్కర్‌.. రచ్చ రేపుతున్న ఫోటో..

Dr BR Ambedkar : అగ్రవర్ణ హిందువు వేషధారణలో బీ.ఆర్.అంబేడ్కర్‌.. రచ్చ రేపుతున్న ఫోటో..

Dr BR Ambedkar  (PC : The cover page of Malayali Memorial)

Dr BR Ambedkar (PC : The cover page of Malayali Memorial)

Ambedkar: బుక్ కవర్ పేజీపై అంబేడ్కర్‌ను హిందూ వేషధారణలో చిత్రీకరించిన తీరు కులతత్వ రాజకీయాలపై మరో చర్చకు దారి తీసింది. ఇలా చేయడం అంబేడ్కర్‌ను అవమానించినట్టేనని రచయితపై కొందరు కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఒక బుక్ కవర్‌పై ఉన్న డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్‌ (Ambedkar) వస్త్రధారణ తాజాగా సోషల్ మీడియా (Social Media)లో చర్చలకు తెరలేపింది. క్రియేటివ్ ఫ్రీడమ్ అనే పేరుతో ఒక చిన్న కథా రచయిత అంబేడ్కర్‌ను ఒక అగ్రవర్ణ హిందువుగా చూపించారు. కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన ఈ రైటర్ పేరు ఉన్ని ఆర్. ఇతను తన మలయాళీ మెమోరియల్ (Malayali Memorial) బుక్ కవర్ పేజీపై అంబేడ్కర్‌ను హిందూ వేషధారణలో చిత్రీకరించిన తీరు కులతత్వ రాజకీయాలపై మరో చర్చకు దారి తీసింది. ఇలా చేయడం అంబేడ్కర్‌ను అవమానించినట్టేనని రచయితపై కొందరు కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. వివాదాలను సృష్టించి తన బుక్ పాపులర్ కావాలనే దురుద్దేశంతో ఉన్ని ఆర్ అంబేడ్కర్‌ ఇమేజ్‌ను వాడుకున్నాడని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

హిందుత్వ రాజకీయాలు కేరళ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోకి మెల్లమెల్లగా ప్రవేశిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలో అంబేడ్కర్‌ హిందూ వస్త్రధారణపై జరుగుతున్న చర్చకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ప్రముఖ కేరళ పబ్లిషింగ్ హౌస్ డీసీ బుక్స్ (DC Books) ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ పుస్తకం కవర్ పేజీపై అంబేడ్కర్‌ కసావు ధోతీ (Kasavu dhothi), చొక్కా ధరించి భూస్వామ్య లేదా జమిందారి ఇంటిలో కూర్చున్నట్లు ఒక చిత్రాన్ని ప్రచురించారు. దీంతో అగ్రవర్ణాల నాయర్లు అంబేడ్కర్‌ వారసత్వాన్ని తమకు అనుగుణంగా మార్చేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఒక వర్గం ఆరోపణలు చేస్తోంది. అయితే ఇది పాఠకులను ఆకర్షించే మార్కెటింగ్ వ్యూహంగా కొందరు పేర్కొంటున్నారు.

ఈ పుస్తకం కవర్ పేజీ గురించి దళిత ఉద్యమకారుడు కపికాడ్ మాట్లాడుతూ.. రచయిత వివాదాన్ని సృష్టించి మార్కెట్‌ను చేజిక్కించుకునే కుట్రను పన్నారని చెప్పారు. ఇది అంబేడ్కర్‌ గుర్తింపుపై 'సవర్ణ దండయాత్ర' అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ అగ్రవర్ణ వేషధారణతో నాయర్‌గా కనిపించే క్షణం అంబేడ్కర్‌ జీవితంలో ఎప్పుడూ భాగం కాలేదన్నారు.

అంబేడ్కర్‌ జీవితాంతం దేనికి వ్యతిరేకంగా పోరాడారో, ఇప్పుడు దానినే ఆయనపై బలవంతంగా రుద్దుతున్నారని కపికాడ్ చెబుతున్నారు. కొందరి స్వార్థ ప్రయత్నాలకు ఈ కవర్ పేజీ ప్రతీకగా కనిపిస్తోందన్నారు. ఈ ఉచ్చులో దళితులు పడవద్దని, పుస్తకాన్ని తగలబెట్టడం లేదా ప్రచురణకర్తల ముందు నిరసన తెలియజేయడం వంటివి చేయవచ్చని చెప్పారు.

ఇది కూడా చదవండి : ఆప్ కు బిగ్ ఝలక్..ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

అయితే రచయిత ఉన్ని మాట్లాడుతూ.. “విమర్శకులు ముందుగా ‘మలయాళీ మెమోరియల్’ కథను చదవాలి. అప్పుడే కథతో కవర్ పేజీకి ఉన్న సంబంధం అర్థమవుతుంది. పుస్తకాన్ని బహిష్కరించాలని కూడా ఎవరో పిలుపునిచ్చారని విన్నాను. అంబేడ్కర్‌ సంఘీభావం అనే పదాన్ని ఉపయోగించారు, అసలు దాని అర్థం ఏంటో వారికి తెలుసా?" అని ప్రశ్నించారు.

కవర్ డిజైనర్ జైనుల్ అబిద్ మాట్లాడుతూ.. కథను చదవని వారికి ఇది తప్పుగానే అనిపిస్తుందన్నారు. “అంబేడ్కర్‌లో సహజసిద్ధమైన కులతత్వ భావం, అతని మారుపేరు పట్ల ఆయనకున్న అయిష్టత నన్ను అలాంటి కవర్ ఇమేజ్ గురించి ఆలోచించేలా చేసింది. 'అంబేడ్కర్‌' భౌతికత్వంలో ఉన్న వైరుధ్యం, అతనిలో అగ్ర కులం ట్యాగ్ లోతుగా పాతుకుపోయిన భావన ఈ ఇమేజ్‌ను రూపొందించడానికి నన్ను ప్రేరేపించింది," అని అబిద్ వివరించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Ambedkar, Kerala, National News

ఉత్తమ కథలు