హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mumbai Court: కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉందని కేసు..! కోర్టులో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

Mumbai Court: కొవ్వొత్తి, అగ్గిపెట్టె ఉందని కేసు..! కోర్టులో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

 కొవ్వొత్తి, అగ్గిపెట్టె కలిగి ఉన్న వ్యక్తిపై  కోర్టు సంచలన తీర్పు ! ఎక్కడ జరిగిందంటే ?

కొవ్వొత్తి, అగ్గిపెట్టె కలిగి ఉన్న వ్యక్తిపై కోర్టు సంచలన తీర్పు ! ఎక్కడ జరిగిందంటే ?

నిప్పు రాజేసే వస్తువులు ఎవరిదగ్గరైనా లభించినంత మాత్రాన వారు నేరం చేసేందుకే వాటిని తీసుకెళ్తున్నట్లు భావించలేమని తెలిపింది ముంబై (Mumbai)కోర్టు. దీనికి సంబంధించి 2013లో నమోదైన పోలీస్(Police) కేసును కోర్టు తాజాగా కొట్టివేసింది.

నిప్పు రాజేసే వస్తువులు ఎవరిదగ్గరైనా లభించినంత మాత్రాన వారు నేరం చేసేందుకే వాటిని తీసుకెళ్తున్నట్లు భావించలేమని తెలిపింది ముంబై (Mumbai)కోర్టు. దీనికి సంబంధించి 2013లో నమోదైన పోలీస్ కేసును కోర్టు తాజాగా కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే.. కొవ్వొత్తి, అగ్గిపెట్టె వ్యక్తుల దగ్గర ఉంటే నేరం కాదని ముంబై మేజిస్ట్రేట్ కోర్టు వ్యాఖ్యానించింది. 2013 అక్టోబర్ 30నాడు ముంబైలోని ఆర్‌సీఎఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు.. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అతన్ని తనిఖీ చేయగా, కొవ్వొత్తి, అగ్గిపెట్టె లభ్యమయ్యాయి. అయితే అతను వాటికి సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు (Court)కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నిందితుడు(Accused) మహమ్మద్ ఖాన్ ఏదైనా గుర్తించదగిన నేరం చేయాలనుకుంటున్నాడని రుజువు చేయడానికి రికార్డులో ఎటువంటి ఆధారాలు లేవు. ఒక అగ్గిపెట్టె, కొవ్వొత్తి ఉంటే అతను నేరానికి పాల్పడుతున్నట్లు కాదు. ఇవి మార్కెట్‌లో లభించే సాధారణ వస్తువులు.’’ అని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహిపాల్ పి బిహరే వ్యాఖ్యానించారు. దీంతో నిందితుడిపై నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చారు.

ఇదీ చదవండి: Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !


నిందితుడిపై గతంలో దొంగతనం లేదా ఇళ్లపై దాడి చేయడం వంటి కేసులు పెండింగ్‌లో లేవని పోలీసులు కోర్టుకు వివరించారు. దీంతో మహారాష్ట్ర పోలీసు చట్టంలోని సెక్షన్ 122(సి) ప్రకారం నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, రాత్రి పూట అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తి, నేరం చేయాలనే ఉద్దేశ్యంతో ఏదైనా ప్రమాదకరమైన ఆయుధంతో ఉండి, పొంతలేని వివరణ ఇస్తుంటే అతన్ని దోషిగా నిర్ధారించవచ్చు. కేసు విచారణలో నేరం రుజువైతే, అటువంటి వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు.

మరోవైపు, ఓ విడాకుల కేసులో ఇటీవల బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విడాకుల తీసుకున్న భార్య.. ఉద్యోగం చేసినంత మాత్రాన భరణానికి అనర్హురాలిగా చెప్పలేమని ప్రకటించింది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ భరణం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఓ భర్త వేసిన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. తన భార్య ఉద్యోగం చేస్తుందని.. విడాకులు తీసుకున్నప్పుడు భరణం ఇవాల్సిన అవసరం లేదంటూ సదరు వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కాడు. విచారణ చేపట్టిన కోర్టు, విడాకులు తీసుకున్న భార్య ఉద్యోగం చేస్తూ ఆదాయం పొందుతునప్పటికీ భరణం పొందే హక్కును కాదనలేమని తీర్పునిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్‌జే జమదార్... ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు వెల్లడించారు.

Published by:Mahesh
First published:

Tags: Crime news, High Court, Mumbai, Police Case

ఉత్తమ కథలు