కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం...ఇకపై టూరిస్టు స్పాట్‌గా సియాచిన్

లఢఖ్ ప్రాంతంలో పర్యాటక రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చునని పేర్కొన్నారు.

news18-telugu
Updated: October 21, 2019, 11:01 PM IST
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం...ఇకపై టూరిస్టు స్పాట్‌గా సియాచిన్
జమ్మూకశ్మీర్ మ్యాప్
  • Share this:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సైనిక పహారా నిర్వహించే ప్రాంతం సియాచిన్ లోకి టూరిస్టులను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. లఢఖ్ ప్రాంతంలో పర్యాటక రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చునని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌ సైనిక శిబిరాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో భారత సైనిక శిబిరాలను సందర్శించాలన్న దేశ ప్రజల కోరిక నెరవేరనుందని పలువురు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ హర్షం తెలియజేస్తున్నారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు