Home /News /national /

THE CENTRAL GOVERNMENT HAS WARNED THAT ACTION WILL BE TAKEN AGAINST WEBSITES AND YOUTUBE CHANNELS THAT SPREAD FALSE NEWS THAT COULD TARNISH THE COUNTRY IMAGE PRV GH

YouTube channels banned: యూట్యూబ్​ ఛానళ్లపై కేంద్రం సంచలన నిర్ణయం..  అలాంటి వాటిని బ్యాన్​ చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ హెచ్చరిక

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (ఫైల్‌)

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (ఫైల్‌)

దేశ గౌరవాన్ని కించపరిచేలా తప్పుడు వార్తలు (fake news) ప్రచారం చేస్తున్న వెబ్​సైట్లు, యూట్యూబ్​ ఛానళ్లు, సోషల్​ మీడియా అకౌంట్లపై ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం.

దేశ గౌరవాన్ని కించపరిచేలా తప్పుడు వార్తలు (fake news) ప్రచారం చేస్తున్న వెబ్​సైట్లు, యూట్యూబ్​ ఛానళ్లు, సోషల్​ మీడియా అకౌంట్లపై ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం. దేశ భద్రతకు నష్టం కలిగించేలా వార్తలను ప్రసారం చేస్తున్న 20 యూట్యూబ్​ ఛానళ్లను బ్లాక్​ చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ (Union Minister of Information and Broadcasting Anurag Thakur)​ బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ యూట్యూబ్​ ఛానళ్లు, వెబ్​సైట్లను బ్యాన్​ చేసేందుకు ప్రభుత్వం నిఘా వర్గాల (Intelligence) సహాయం తీసుకున్నట్లు చెప్పారు. ఇకపై యూట్యూబ్​ ఛానళ్లు (YouTube Channels), వెబ్​సైట్లపై నిఘా ఉంటుందని, దేశ పౌరుల మధ్య విభేదాలు సృష్టించే తప్పుడు వార్తలను ప్రసారం చేస్తే సహించేది లేదన్నారు. దేశ గౌరవాన్ని కించపరిచేలా (To degrade the dignity of the country) వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

2‌0 యూట్యూబ్​ ఛానళ్లను బ్యాన్​ చేశాం..

బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ “భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానల్‌లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో అస్సలు రాజీ పడం. తాజాగా భారత్​కు వ్యతిరేకంగా పనిచేస్తున్న 2‌0 యూట్యూబ్​ ఛానళ్లను బ్యాన్​ చేశాం (YouTube channels have been banned). ఆయా ఛానళ్లు, వెబ్​సైట్లు పాకిస్థాన్​ కేంద్రంగా గుర్తు తెలియని నెట్​వర్క్​ ద్వారా పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి.

సున్నితమైన అంశాలపై తప్పుడు వార్తలు..

బ్యాన్​కు గురైన ఛానళ్లు కశ్మీర్ (Kashmir)​, రామ మందిరం, దివంగత మాజీ సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్​, ఇండియన్​ ఆర్మీ, మైనారిటీ కమ్యూనిటీ, ఇతర సున్నితమైన అంశాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని తేలింది. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నాం. యూట్యూబ్​ సైతం ఆయా ఛానళ్ల (channels)ను నిషేధించేందుకు ముందుకు రావడం పట్ల సంతోషిస్తున్నాను.” అని చెప్పారు. భారత్​కు వ్యతిరేక కంటెంట్‌ (Content against India‌)ను వ్యాప్తి చేసే, కుట్రలకు పాల్పడుతున్న వెబ్‌సైట్‌లు (Websites), ఛానల్‌లపై ఇంలాంటి చర్యలే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

* ఎందుకు బ్యాన్​ చేశారు?

బ్లాకింగ్ (Blocking)​కు గురైన 20 యూట్యూబ్​ ఛానళ్లు (YouTube channels), వెబ్​సైట్లు పాకిస్తాన్​ సహకారంతో తప్పుడు సమాచారాన్ని (fake news) ప్రసారం చేస్తున్నాయిని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దేశంలో అశాంతిని ప్రేరేపించేలా, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వార్తలు ప్రసారం చేశాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఆయా ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గూగుల్ యాజమాన్యాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది. దీంతో, మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గూగుల్​ చర్యలు చేపట్టింది. భారత ఐటీ చట్టం 2021 ప్రకారం ఆయా ఛానళ్లపై చర్యలు తీసుకుంది. వీటితో పాటు మరో రెండు వెబ్​సైట్లను సైతం నిషేధించింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Central governmennt, Youtube channel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు